ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • శ్రీశైలం, సాగర్‌ ‌ప్రాజెక్టుల నుంచి దిగువకు నీరు
  • గేట్లు ఎత్తేయడంతో కృష్ణమ్మ పరవళ్లు

కృష్ణాబేసినల్‌లో వరద కొనసాగుతుంది. ఎగువన కర్నాటక నుంచి దిగువకు నీరు వొచ్చి చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ‌జలాశయాలు నిండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు భారీగా వరదనీరు వొచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. సాగర్‌లో ప్రవేశిస్తుంది. నాగార్జున సాగర్‌ ‌జలాశయం ఇన్‌ ‌ఫ్లో 2,77,640 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ‌ఫ్లో 29,82 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 553.10 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 216.43 టీఎంసీలు. సాగర్‌ ‌జలాశయం గేట్లు ఎత్తేయడంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను…ప్రస్తుత నీటి నిల్వ 43.06 టీఎంసీలుగా కొనసాగుతుంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 173.226 అడుగులకు చేరింది.

ఇన్‌ ‌ఫ్లో, అవుట్‌ ‌ఫ్లో 27,823 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ఇక శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ ‌ప్లో 5,00,203 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ‌ఫ్లో 5,27,323 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 211.5133 టీఎంసీలు. ఎగువన కర్నాటక నుంచి వొస్తున్న వరదతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 47 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మిటర్లు కాగా…ప్రస్తుత నీటిమట్టం 316.910 మిటర్లుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 6.569 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇన్‌ ‌ఫ్లో 4,60,000 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ ‌ఫ్లో 4,65,310 క్యూసెక్కులుగా ఉంది. అలాగే దిగువకు శ్రీశైలం వైపు 4,62,186 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

breaking updates nowheadlines nowOngoing flood flow to projectsshortnews in teluguToday telangana news
Comments (0)
Add Comment