కోటి మందికి వ్యాక్సిన్‌ ‌వేశాం…

74 లక్షల మందికి ఫస్ట్ ‌డోస్‌, 26 ‌లక్షల మందికి డబుల్‌ ‌డోస్‌ ‌లు ఇచ్చాం: దిల్లీ సిఎం కేజ్రీవాల్‌
‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ,జూలై 31: మహరాష్్ర‌ ‌తర్వాత వ్యాక్సినేషన్‌ ‌ప్రొగ్రాం లో కోటి మార్క్ ‌ను దాటిన రాష్ట్రంగా ఢిల్లీని నిలిచింది. ఢిల్లీలో కోటి మందికి డోస్‌ ‌లు వేశామని సిఎం కేజ్రీవాల్‌ ‌శనివారం ప్రకటించారు. ఇందులో 74 లక్షల మంది కనీసం ఒక డోసైనా పొందినట్లు తెలిపారు. మరో 26 లక్షల మందికి రెండు డోస్‌ ‌లు పూర్తయినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ జనాభా 2 కోట్లు కాగా… ఇందులో కోటి 50 లక్షల మంది 18 ఏండ్ల పైబడిన వారున్నట్లు తెలిపారు. ఈ సంఖ్యతో పోల్చితే 50 శాతం మందికి వ్యాక్సిన్‌ ‌వేయడంలో తమ సర్కార్‌ ‌విజయవంతమైందన్నారు.

వ్యాక్సినేషన్‌ ‌ప్రొగ్రాంలో రాత్రింభవళ్లు శ్రమిస్తోన్న హెల్త్ ‌కేర్‌ ‌స్టాఫ్‌ ‌కు కఈతజ్‌ఒతలు తెలిపారు. ప్రజలు సైతం వ్యాక్సిన్‌ ‌తీసుకునేందుక ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. రోజుకు 3 లక్షల డోసులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అయితే, కేంద్రం కేవలం 70 వేల డోసులను మాత్రమే రోజు వారిగా అందిస్తుందని తెలిపారు. వ్యాక్సిన్ల సరఫరా పై కేంద్రంతో టచ్‌ ‌లో ఉన్నామని… త్వరలో రాష్ట్రాలు, యూటీలు ఎక్కువల సంఖ్యలో వ్యాక్సిన్‌ ‌డోసులు పొందుతాయని ఆశిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.

One crore people have been vaccinated kejriwalpolitical updatesprajatantra news onlinetelangana updatestelugu news today
Comments (0)
Add Comment