“ఎంత చెట్టుకంత గాలి! సర్కార్ జాగలు,చెరువు శిఖాలు కానచ్చేదాంకనే ఆడుంటయి,అటెంక మన పేరుమీద అపార్ట్ మెంట్లయితయి,లేకుంటె ఫామవుజులైతయి.వాటి మీద పార్టీ జెండా రెపరెప లాడుతాంటె ఎసోంటి ఎండాకాలం సుత సల్లటి నీడుంటది.ప్రజాసేవకు అడ్డు బడెటోళ్ళుండరు పార్టీలుండి గింతగనం ప్రజాసేవ జేషేటోళ్ళకు గాకపోతె రోడ్లు, కల్వట్లు, బిడ్జిలు గట్టే కాంట్రాక్టులు ఇంకోళ్ళకు ఇత్తె వూకుంటమా! ముక్కలేషేటోడు మనోడైనంక యే బంతిల గూసుంటేంది!? బరాబరి పదిగల్ల టెండర్లు దొరికిచ్చుకుంటె పార్టీ పదవులెన్కబడి మెడల దండలెత్తయి. సామాజిక వర్గానికి నాయం జేషే పనిమీదుంటె ఎమ్మెల్యే టికెట్ ఇంటిదర్వాజ కాడికచ్చి వంగి నిల్సుంటది. పదవులచ్చుడు ప్రజా సేవనేగాదు పనిలపనిగ కబ్జాల దందాను సుత పెంచుమంటది. చేతినిండపని, అవ్వల్ దర్జాగా ఆమ్దాని. అంతమాగనే వుంటది,గని ప్రజాసేవ జేయ శాతగానోళ్ళతోని అప్పుడప్పుడు తిప్పలు ఎన్కబడత్తది. గెరువు లేకుంట మొగులుకు షిల్లు బడ్డదా!”
దందాలు జేషేందుకు షిన్నంగ సంపుడుపుంజం దొరికే పొద్దు కోసం జూడాలె!ఏదోఒకనాడు కనబడ్డ జాగల కబ్జా ముగ్గు వోసేదినం రానే వత్తది.యెనుకకు జూషే పనే లేదింక యాడాది తిర్గక ముందే గా లీడర్లకే ‘‘కబ్జాలు జేసుడెట్ల’’! అనేటి పాటం జెప్పెటోళ్ళయితం. గిసొంటి కబ్జాల తోని ప్రజాసేవ జేషి ముదిరి లీడర్లయి,అధికార పార్టీ కంటికి రెప్పయితం. ఎంత చెట్టుకంత గాలి! సర్కార్ జాగలు,చెరువు శిఖాలు కానచ్చేదాంకనే ఆడుంటయి,అటెంక మన పేరుమీద అపార్ట్ మెంట్లయితయి,లేకుంటె ఫామవుజులైతయి.వాటి మీద పార్టీ జెండా రెపరెప లాడుతాంటె ఎసోంటి ఎండాకాలం సుత సల్లటి నీడుంటది.ప్రజాసేవకు అడ్డు బడెటోళ్ళుండరు పార్టీలుండి గింతగనం ప్రజాసేవ జేషేటోళ్ళకు గాకపోతె రోడ్లు, కల్వట్లు, బిడ్జిలు గట్టే కాంట్రాక్టులు ఇంకోళ్ళకు ఇత్తె వూకుంటమా! ముక్కలేషేటోడు మనోడైనంక యే బంతిల గూసుంటేంది!? బరాబరి పదిగల్ల టెండర్లు దొరికిచ్చుకుంటె పార్టీ పదవులెన్కబడి మెడల దండలెత్తయి. సామాజిక వర్గానికి నాయం జేషే పనిమీదుంటె ఎమ్మెల్యే టికెట్ ఇంటిదర్వాజ కాడికచ్చి వంగి నిల్సుంటది. పదవులచ్చుడు ప్రజా సేవనేగాదు పనిలపనిగ కబ్జాల దందాను సుత పెంచుమంటది. చేతినిండపని, అవ్వల్ దర్జాగా ఆమ్దాని. అంతమాగనే వుంటది,గని ప్రజాసేవ జేయ శాతగానోళ్ళతోని అప్పుడప్పుడు తిప్పలు ఎన్కబడత్తది. గెరువు లేకుంట మొగులుకు షిల్లు బడ్డదా! అన్నట్టు ఆనలు దంచి కొట్టి,షెరువులు నిండుతె అందరి దిష్టి మీదికచ్చి పల్కరిత్తది.‘‘ముప్పుతిప్పలు బెట్టేతీర్గ పద్దినాల సంది ఆనదంచి గొట్ట బట్టె!ఎన్కటి గొల్సుకట్టు శెరువులు బగ్గనిండి, కుంటలు, అలుగుబారి బగ్గవర్దలాయె!ఆడాడ కొన్ని శెరువులు,ఆగులు కట్టతెగి వూళ్ళెకూళ్ళు కొట్టుకబోవట్టె!. వూళ్ళె పొంటి యవుసంమంట్లె గలిశింది.పట్నాల పొంటి సిమ్టిరోడ్లు సుత పగిలి పర్రెలు వాశి తొవ్వలు బందాయె!వాడలకు వాడలు మునిగి ఇండ్లసుట్టు శెరువులు బుట్టుకచ్చె!రామసక్కదనాల బిడ్జిలు, కల్వట్లు మట్టి గోడలోలిగె కూలుతాంటె పట్నాల పొంటి సుత జనం గాయ్ గాయ్ గాబట్టిరి’’!అని అవుతలి పార్టోళ్ళు తీగ పేనుతరు.
జెండాలు కదులుతయి. ‘‘రాష్ట్రవంత మునిగి ముద్దయింది. పొద్దు మాపులేకుంట గొట్టే ఆనలపట్నం,పల్లెనకుంట కొట్కవోవట్టినయి, యేంది రావులా!అని సర్కార్ అటో, యిటో బోయి అర్సుకుం దావనేటి ఆత్రం గింతనన్న లేకుంటున్నది. రైతులెట్లున్నరు! పంటలేమైనయి!? కట్టలు తెగవట్టె! పట్నాలల్ల రోడ్లు తెగవట్టె!జనం అరగోస పడుకుంట సాయం కోసం జూడవట్టె! ఎలచ్చన్ల ఓటేషిన గెలిపిచ్చిన జనం దుక్కమర్సుకునే సోయి జరంత సుత లేకుంట ఎమ్మెల్లేలు,మంత్రి సార్లంత ఇంట్ల మంచం దిగుతలేరు.గల్మ దాటుతలేరాయె’’ అని లొల్లి షురూ జేత్తరు. గీ లొల్లిల నాలాలు,షెరువుల మీది కబ్జాల మీద రచ్చ రచ్చ మస్తుగయితది. కబ్జాలను ఎక్కాల తీర్గ లెక్కలు గడుతరు. సోషల్ మీడియాల జోరుగ కబ్జాలను పొద్దుమాపు జూపెడుతరు. ఈ లోపల మంత్రులచ్చి లాగు లట్టం తడిషేటట్టు తెగిన వాగుల పొంటి,కూలిన బిడ్జీల పొంటి,నాలా మురుగు నీళ్ళ పొంటి నడుం లోతు దిగి నాలుగు ఫోటోలు దిగి ఓదార్పు యాత్ర జేత్తరు. నోర్జేసుకోని మాట్లాడ జూషె జనం మీదికి ముందుగాల మనమే నోర్జేసుకోవాలె!గయ్యిన లేవాలె! రొండో మూడో కబ్జా బంగ్లాల పక్క పెచ్చులు డోజర్లతోని కూలగొట్టియ్యాలె!అవుతలి పార్టోళ్ళ కన్న అధికార పార్టోళ్ళే జరంత ఎక్కువ ధూం ధాం జేయాలె! నాల్గు దినాలైతె వానలు,వరదలాగుతయి.షెరువులు,నాలాలు సల్ల వడుతయి.షిన్నంగ ఎండపొడత్తది. ఎక్కడోళ్ళక్కడ పనుల మీద బడుతరు.
‘‘సూడ్రా బయ్! ‘‘ఇక్రమార్క్’’! ‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా! షెరువు కట్టలు తెగుతాంటె,నాలాలు కబ్జాలయితాంటె సర్కార్ ముందువడి కట్టడి యెందుకు జేయటం లేదు!? గీ ప్రశ్నకు జవాబు జెప్పలె! లేకుంటె నువు సుత కబ్జా జేషినవని ఉల్లేక్కాల ముచ్చట అందరి షెవులేత్త’’!నని బెదిరిచ్చేటి భేతాళుని ఎప్పటి తీర్గనే భుజం మీదేసుకొని ‘‘విను!భేతాళ్!కబ్జాలు జేషేకాడ అధికార పార్టోళ్ళు, అవుతలి,ఇవుతలి పార్టోళ్ళనే ఎక్కువ,తక్కువల్లేకుంట సమానత్వముంటది. గీ సమానత్వం వర్ధిల్లకుంటె మొదటికే మోసమైతది. కబ్జాల కాడ వర్ధిల్లే సమానత్వం జనాల్ని బక్రాలను జేసుడే గని కబ్జాలను కట్టడి జేయదు.గీ ఇగురం జనాలకు జెప్పెటందుకు ఎవలు ముందువడాల్నో!యేందో!’’ అని జెప్పుకుంట నడ్వబట్టిండు..నడ్వబట్టిండు…
– ఎలమంద.తెలంగాణ.