తెలంగాణపై వివక్ష లేదు

  • రైల్వే ప్రాజెక్టులకు రూ.2602 కోట్లు  
  • చర్లపల్లి శాటిలైట్‌ ‌టెర్మినల్‌కు కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌శంకుస్థాపన

తెలంగాణపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపడంలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ అన్నారు. రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులో తెలుగు రాష్టాల్రకు అన్యాయం జరిగిందన్నది వాస్తవం కాదన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ.2602 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. మంగళవారం సికింద్రబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. చర్లపల్లిలో శాటిలైట్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికి కేంద్రం రూ. 221 కోట్లు కేటాయించింది. యర్రగుంట, నంద్యాల సెక్షన్‌ ‌విద్యదీకరణకు వీడియో లింక్‌ ‌ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గోయల్‌ ‌మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 427 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించామన్నారు. బడ్జెట్‌ ‌కేటాయింపుల్లో దక్షిణ భారతదేశాన్ని రైల్వేశాఖ విస్మరించిందంటూ మంత్రి తలసాని చేసిన ఆరోపణల్ని కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌ఖండించారు. యూపీఏ హయాంలో రూ.258 కోట్లే కేటాయించారనీ..ఎన్డీయే హయాంలో 2020-21 బ్జడెట్‌లో 2,602 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. దక్షిణ భారతదేశాన్ని కేంద్రం విస్మరిస్తోందనడం అవాస్తవమన్నారు. రాష్టాల్రు సహకరిస్తేనే రైల్వే లైన్లు వేగంగా పూర్తవుతాయని చెప్పారు. రైల్వే కేటాయింపులు రాష్టాల్ర పరిధిలో ఉండవనీ.. జోనల్‌ ‌పరిధిలోనే ఉంటాయని చెప్పారు. ఎంఎంటిఎస్‌ ‌రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే పనులు త్వరితగతిన పూర్తవుతాయని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ, చర్లపల్లి శాటిలైట్‌ ‌రైల్వేస్టేషన్‌కు కేంద్రం రూ.221 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఎంఎంటీఎస్‌ ‌రెండో దశకు చర్లపల్లి శాటిలైట్‌ ఎం‌తో ఉపయోగమన్నారు. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్‌ ‌పూర్తి చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. 427 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కల్పించడం హర్షణీయమన్నారు. నత్తనడకన ఉన్న పనులను కేంద్రం వేగవంతం చేసిందన్నారు. తెలంగాణ, ఏపీ ప్రజల తరఫున కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రి తలసాని మాట్లాడుతూ, రైల్వే బడ్జెట్‌ ‌కేటాయింపుల్లో దక్షిణాదికి అన్యాయం జరిగిందన్నారు. రైల్వే మంత్రి ఎవరుంటే వారి రాష్టాల్రకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఇది మారాలని సూచించారు. తెలంగాణలో పెండింగ్‌ ‌రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, అర్వింద్‌, ఎమ్మెల్యే ప్రభాకర్‌ ‌రావు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment