నిఖత్ జరీన్ కు స్వర్ణ పతకం

న్యూ ఢిల్లీ లోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో  ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ ను సీఎం అభినందించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి, మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో భారత్ కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని సీఎం అన్నారు. తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ప్రపంచ చాంపియన్ పోటీల్లో తన కెరీర్ లో ఇది రెండవ బంగారు పథకం కావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే వుంటామని సీఎం స్పష్టం చేశారు.

against KCR commentsgold medalnikhat zareentelanganawomens boxing championship
Comments (0)
Add Comment