కొత్త చరిత్ర

పొరలు తీసే కొద్దీ
మట్టి తవ్వే కొద్ది
నగరాలో… నాగరికతలో
బయట పడుతునే ఉంటాయి
గెలుపు కాంక్ష శిథిల సమాధుల్లో
అల్లుకున్న తీగై దర్శన మిస్తుంది

ఓ అవ్యక్త వాంఛ
దేహం నుంచి దేహంలోకి
కాలం నుంచి కాలంలోకి
ఓ ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి
అనంత చలన శక్తై
ప్రసరిస్తూనే ఉంటుంది

నిగూఢ శక్తి ఏదో
సింధూ నది పాయల్లో మునక తీసి
చరిత్ర గర్భంలో అంతర్థానమయ్యింది

అతని కత్తిమొన మెరుపులోనో
ఆమె చిరునవ్వు అంచునో
కొత్త చరిత్ర పురుడు పోసుకుంటోంది

– రెహాన

Comments (0)
Add Comment