ఇం‌డియన్‌ ‌నేవీకి కొత్త జెండా

న్యూదిల్లీ,సెప్టెంబర్‌2 : ఇం‌డియన్‌ ‌నేవీ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల దుగా ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్‌ ‌చేశారు. ఆ జెండాలో ఓ కొత్త గుర్తును జోడించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రుపుదిద్దుకున్న ఓ గుర్తును ఆ జెండాలో డిజైన్‌ ‌చేశారు. శివాజీకి నౌకాదళం ఉన్న నేపథ్యంలో ఆయన ప్రేరణతో ఆ జెండాలో గుర్తును కలిపారు. బ్లూ కలర్‌ ఆక్టోగోనల్‌ ఆకారంలో ఉన్న గుర్తును నేవీ జెండాలో డిజైన్‌ ‌చేశారు. అష్టాకారంలో ఉన్న గుర్తులో రెండు గోల్డ్ ‌కలర్‌ ‌బోర్డర్లు ఉన్నాయి. శివాజీ నేవీ ముద్రను పోలినట్లు ఈ కొత్త డిజైన్‌ను రూపొందించారు. శివాజీ దళంలో సుమారు 60 యుద్ధ నౌకలు ఉండేవి. అతని వద్ద 5000 మంది నావికులు ఉండేవారు. శివాజీ పాలన సమయంలో మరాఠా నౌకాదళం శక్తివంతంగా ఉండేది. తీర ప్రాంతాన్ని ఆ దళం నిత్యం రక్షిస్తూ ఉండేది. అష్టాకారం అంటే ఎనిమిది దిక్కులు అని, అన్ని దిక్కుల్లోనూ నౌకాదళం అబేధ్యంగా ఉన్నట్లు గుర్తుండే రీతిలో ఆ ముద్రను డిజైన్‌ ‌చేసినట్లు నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.

శివాజీకి నౌకాదళం ఉన్న నేపథ్యంలో ఆయన ప్రేరణతో ఆ జెండాలో గుర్తును కలిపారు. ఇకపోతే ఇండియన్‌ ‌నేవీ జెండాను మార్చడం ఇది నాల్గో సారి. 1950 నుండి ఇప్పటి వరకు నాలుగుసార్లు జెండాను మార్చారు. దేశ స్వాతంత్యం•-ర తర్వాత.. రాయల్‌ ఇం‌డియన్‌ ‌నేవీని… రాయల్‌ ఇం‌డియన్‌ ‌నేవీ, రాయల్‌ ‌పాకిస్థాన్‌ ‌నేవీగా విభజించారు. జనవరి 26, 1950న భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించడంతో రాయల్‌ అనే పదాన్ని తొలగించారు. అప్పట్నుంచి ఇండియన్‌ ‌నేవీగా వ్యవహరిస్తున్నారు. 2001 వరకు ఉన్న చిహ్నాన్ని మార్చి తర్వాత నేవీ బ్లూ కలర్‌ ఇం‌డియన్‌ ‌నేవీ క్రెస్ట్‌ని తీసుకువచ్చారు. 2004లో అశోక చిహ్నాన్ని తిరిగి చేర్చారు. 2001లో నావికాదళ చిహ్నం తొలగించారు. 2014లో అశోక్‌ ‌చిహ్నం కింద జాతీయ నినాదం ‘సత్యమేవ జయతే‘ ను చేర్చారు. తాజాగా మరోసారి మార్పులు చేశారు.

Comments (0)
Add Comment