సవరణతో కూడిన కొత్త వ్యవసాయ చట్టం

  • రైతుల ముందు 5 ప్రతిపాదనలు
  • ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం
  • కేంద్ర ప్రతిపాదనలకు రైతు సంఘాల తిరస్కారం..14న దేశవ్యాప్త నిరసనలు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిసెంబరు 8న దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన బంద్‌ ‌విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రైతులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ దాని మిత్రపక్షాలు మినహా దాదాపుగా అన్ని పార్టీలు సంఘీభావం తెలిపాయి. సామాన్యులు వ్యాపారులు సైతం రైతన్నలకు వెన్నుదన్నుగా మేమున్నామంటూ స్వచ్ఛదంగా బంద్‌ ‌పాటించారు. దీంతో దిగివచ్చిన కేంద్రం ప్రభుత్వం…యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రైతు సంఘాలతో చర్చలు జరిపాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షాను పురమాయించింది. ఈ నేపథ్యంలోనే కొత్త వ్యవసాయ చట్టాలకు కొన్ని సవరణలను కేంద్రం ప్రతిపాదించింది.

ఆ సవరణలపై రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. తాము చేసిన 5 సవరణలపై లిఖిత పూర్వక హా ఇచ్చేందుకూ కేంద్రం అంగీకరించింది. రైతుల ప్రధాన డిమాండ్‌ అయిన కనీస మద్దతు ధర విధానాన్ని యథాతథ•ంగా కొనసాగిస్తూ కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలకు సవరణను ప్రతిపాదించింది. మండి వ్యవస్థ(ఏపిఎమ్‌సి) ను రైతుల అభిప్రాయానికి తగ్గట్టు మార్పులు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్లలో ఒకే పన్ను విధానం ఉండేలా కొత్త చట్టాన్ని కేంద్రం సవరించింది. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసే విధంగా రైతులకు సవరణలను ప్రతిపాదించింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రైవేట్‌ ‌కంపెనీ పేరు నమోదు తప్పనిసరి చేసింది.

కొత్త చట్టం ప్రకారం ‘పాన్‌‘ ‌కార్డు ఉన్న వారంతా పంట కొనుగోలు చేయొచ్చు. అయితే రిజిస్టర్‌ ‌చేసుకున్న వారే పంట కొనుగోలు చేయాలన్న సవరణను కేంద్రం చేసింది. ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పులకు కేంద్రం అంగీకరించింది. వ్యాపారులుర్ఖైతుల కాంట్రాక్ట్ ‌వ్యవసాయం ఒప్పందాలలో వివాదాల పరిష్కారానికి రైతులు సివిల్‌ ‌కోర్టును ఆశ్రయించేలా సవరణ చేసింది. కొత్త చట్టంలో ఆ అధికారం జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌కు ఉండడంపై రైతులు అభ్యంతరం తెలపడంతో ఈ సవరణ చేసింది. ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించే విధంగా సవరణ చేసింది. పంట వ్యర్థాల దహనం వ్యవహారంపై పంజాబ్‌ ‌హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మరి ఈ సవరణలకు రైతు సంఘాల నేతలు అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే చాలామంది రైతులు యథావిధిగా పాత విధానాన్ని అమలు చేయాలని…కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

కేంద్ర ప్రతిపాదనలకు రైతు సంఘాల తిరస్కారం..14న దేశవ్యాప్త నిరసనలు
వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 12‌వ తేదీన ఢిల్లీ-జైపూర్‌, ‌ఢిల్లీ-ఆగ్రా రహదారులను అడ్డుకుంటామని రైతుల నాయకులు బుధవారం విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. డిసెంబర్‌ 14‌న దేశవ్యాప్త నిరసనకు కూడా వారు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని అన్ని రహదారులను ఒక్కొక్కటిగా అడ్డుకుంటామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయలేదని రైతు నాయకులు విలేఖరుల సమావేశంలో అన్నారు. వివాదస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన ప్రతిపాదనలను రైతులు ఏకగ్రీవంగా తిరస్కరించడమే కాకుండా డిసెంబర్‌ 14‌న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా డిసెంబర్‌ 12 ‌ఢిల్లీ-జైపూర్‌, ‌ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని సింఘూ సరిహద్దు రైతులు ప్రకటించారు.

కేంద్రం ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేవని, తమ డిమాండ్లను తూచా తప్పకుండా కేంద్రం ప్రభుత్వం ఆమోదించే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు పేర్కొన్నారు. రైతు ఉత్పత్తుల సేకరణకు ప్రస్తుతం అమలులో ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానం కొనసాగుతుందని, ఈ మేరకు లిఖిత పూర్వక హా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ ప్రతిపాదనలో కేంద్రం పేర్కొంది. అయితే వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం మినహా మరే ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు మొదటి నుంచి డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదనను అన్ని రైతు సంఘాలు కలిసి ఏకగ్రీవంగా తిరస్కరించాయి.

5 proposals to farmersAmendmentcentral governmentNew agricultural lawNew agricultural law vs farmersPAN
Comments (0)
Add Comment