దళితుల ఐక్యతే రాజ్యాధికారానికి రాచబాట

“యాచించే స్థానం నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్న కలలు నెరవేరేందుకు ఇంకా ఎంతగానో ప్రయత్నించాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో మొదట వైషమ్యాలు, విద్వేషాలు పెంచి పోషిస్తున్న ఆధిపత్య , అధికార వర్గాల కుట్రలను దళితులు చేధించాల్సిన అవసరం ఉంది. దళితుల మధ్య అనైక్యతను కొనసాగించడానికి విభజన పేరుతో మూడు దశాబ్దాలుగా సాగుతున్న మోసాన్ని ఇప్పటికైనా గ్రహించి ఐక్యంగా కులనిర్మూలన దిశగా అడుగులు వేయాలి. దళితుల మీద జరుగుతున్న కులపరమైన, దళిత మహిళల మీద పెరుగుతున్న లైంగికపరమైన దాడులను తిప్పికొట్టాలి. చట్టాల అమలులో, న్యాయస్థానాల్లో, అధికారంలో, ఉద్యోగాల్లో, ఉన్నత పదవుల నియామకం లో చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా కలిసికట్టుగా గొంతు విప్పాలి.”

రాష్ట్రంలో, దేశంలో దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుంది. దళితుల సంక్షేమం, అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నామని చెప్తున్న పార్టీలు, ప్రభుత్వాలు వారి ఐక్యతను దెబ్బతీసి నిరంతర పాలితులుగా ఉంచేందుకు రాజకీయాలకతీతంగా వారంతా ఐక్యంగా పనిచేస్తున్నారు. యాచించే స్థానం నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్న కలలు నెరవేరేందుకు ఇంకా ఎంతగానో ప్రయత్నించాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో మొదట వైషమ్యాలు, విద్వేషాలు పెంచి పోషిస్తున్న ఆధిపత్య , అధికార వర్గాల కుట్రలను దళితులు చేధించాల్సిన అవసరం ఉంది. దళితుల మధ్య అనైక్యతను కొనసాగించడానికి విభజన పేరుతో మూడు దశాబ్దాలుగా సాగుతున్న మోసాన్ని ఇప్పటికైనా గ్రహించి ఐక్యంగా కులనిర్మూలన దిశగా అడుగులు వేయాలి. దళితుల మీద జరుగుతున్న కులపరమైన, దళిత మహిళల మీద పెరుగుతున్న లైంగికపరమైన దాడులను తిప్పికొట్టాలి. చట్టాల అమలులో, న్యాయస్థానాల్లో, అధికారంలో, ఉద్యోగాల్లో, ఉన్నత పదవుల నియామకం లో చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా కలిసికట్టుగా గొంతు విప్పాలి. సామాజిక సమానత్వం కోసం పోరాడుతూనే రాజకీయ, ఆర్థిక సమానత్వం అనే దీర్ఘకాలిక లక్ష్య సాధన దిశగా పయనించాలి, అంబేద్కర్‌ ‌భావజాలాన్ని గ్రామీణ పునాదుల మీద నిర్మించాలి. ఆ లక్ష్యాల సాధనే ధ్యేయంగా మొట్టమొదటిగా అమరుడు పి.వి. రావు గారి ఆధ్వర్యంలో ఆనాడు మాల మహానాడు ఏర్పడింది.

ఆ ఆశయ సాధనా క్రమంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న అనివార్యత దృష్ట్యా 27 అక్టోబర్‌ 2006 ‌న తెలంగాణ మాల మహానాడు(TMM)) ఆవిర్భవించింది. ఏటూరునాగారంలో అద్దంకి దయాకర్‌, ‌కీ.శే. కాళేశ్వరం ప్రకాశం గారలు తెలంగాణ మాల మహానాడు ఆవిర్భావ ప్రకటన చేశారు. నాటి నుండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో JAC లో అత్యంత కీలక పాత్ర పోషించింది. అడ్డంకులు, ఆంక్షలను ధిక్కరించి, నిర్బంధాలను ఎదిరించి ఉద్యమాలను నిర్వహించింది. రాష్ట్రంలో మిలిటెంట్‌ ‌పోరాటాలకు చిరునామాగా నిలిచింది. ఆనాడు రాష్ట్రపతి అభ్యర్థి గా ఉన్న ప్రణబ్‌ ‌ముఖర్జీని తన హైదరాబాద్‌ ‌పర్యటనలో అత్యంత కట్టుదిట్టమైన పోలీసు పహారాను చేధించి మూడు చోట్ల అడ్డుకోవడం పెద్ద సంచలనం సృష్టించింది. దళితుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా తెలంగాణ గళ్ళీ నుండి ఢిల్లీ జంతర్‌ ‌మంతర్‌ ‌వేదికగా వేలాది మందితో అనేక ఉద్యమాలు నిర్వహించింది. అద్దంకి దయాకర్‌ ‌గారి నాయకత్వంలో కుల, వర్గ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై సమర్ధవంతంగా పనిచేస్తూ వస్తుంది. అంబేద్కర్‌ ఆలోచనా విధానంలో ,బుద్ధుని మార్గంలో, పూలే పాటించిన విప్లవాత్మక ఆచరణల దిశగా %•వీవీ% పోరాడుతున్నది. దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో దళితుల మీద దాడులు జరిగిన సందర్భాల్లో వారికి రక్షణగా నిలబడింది. దళితుల భూములను లాక్కుంటున్న ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దళితుల పక్షాన న్యాయబద్ధంగా భూ పోరాటాలు నిర్వహిస్తుంది. సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేపడుతూ రాష్ట్ర వ్యాప్త విస్తృత పర్యటనలతో ప్రజా క్షేత్రంలో పనిచేస్తుంది. మాలల రక్షణ, చైతన్యం కోసం కృషి చేస్తూనే దళిత బహుజన ఐక్యతను కాంక్షిస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా అగ్రవర్ణ పేదల తరుపున ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉంది.

మాలమహానాడు గా కేవలం కులానికే పరిమితం కాకుండా అన్ని కులాల్లో ఉన్న పీడితులకు అండగా నిలబడింది, కుల ప్రాతిపదిక నుంచి తన పోరాట పరిధిని విస్తృత పరుచుకున్న %•వీవీ% నిర్మాణపరంగానూ జాతీయ స్థాయికి ఎదిగింది. జాతీయ అధ్యక్షులుగా అద్దంకి దయాకర్‌ ‌గారి నాయకత్వంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర కర్ణాటక, గుజరాత్‌ ‌రాష్ట్రాల్లోనూ, దేశ రాజధాని లోనూ అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక ఉద్యమాల్లో భాగమవుతుంది. 15 సంవత్సరాల మాల మహానాడు కుల పరిధులు, పరిమితులను దాటి విశాల దృక్పథంతో పనిచేస్తున్నది. అలాగే ఇతర దళిత గిరిజన సంఘాలు, కార్యకర్తలు రాజకీయ పార్టీల కుట్రల్లో బలి కాకుండా దళిత బహుజన ఐక్యత ను సాధించేందుకు కృషి చేయాలి. ఆ ఐక్యతే కుల పునాదుల నిర్మూలనకు, నీలి జెండా నీడలో దళిత బహుజన అభివృద్ధికి బాటలు వేయగలదు.

TMM16 వ వార్షికోత్సవం, జాతీయ మాలమహానాడు మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని అక్టోబర్‌ 31 ‌న హైదరాబాద్‌ ‌లో నిర్వహిస్తున్న ప్లీనరీ సందర్భంగా)

– పిల్లి సుధాకర్‌, ‌రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ మాలమహానాడు
సెల్‌:9959689494

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilights
Comments (0)
Add Comment