ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన కలెక్టర్‌, ‌మేయర్‌, ఎమ్మెల్యే సామూహికంగా నాటిన 50 వేల మొక్కలు

వరంగల్‌, ‌జూలై 24, (ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌ ‌జన్మది నాన్ని పురస్కరించుకుని ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మహానగర పాలక సంస్థ ద్వారా ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని చింతగట్టు ప్రాంతంలో మంత్రపురి కాలనీలో బృహత్‌ ‌పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో అర్బన్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు, మేయర్‌ ‌గుండు సుధారాణి, కార్పొరేటర్లు, అధికారులు, ప్రజలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అర్బన్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు మాట్లాడు తూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, మున్సిపల్‌, ఎస్సార్‌ఎస్పీ, ప్రభుత్వ ఇన్సిస్టిట్యూషన్‌ ‌స్థలాలను గుర్తించి వాటిని పరిరక్షించడంతో పాటు పచ్చదనాన్ని పెంపొం దించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా పూల, పండ్ల మొక్కలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భావితరాలకు స్వచ్చ వాతావరణాన్ని అందించుటకు తోడ్పడుతుందన్నారు. మేయర్‌ ‌గుండు సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ ‌జన్మదినం సందర్భంగా ఎంపి జోగినపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌గ్రీన్‌ ఇం‌డి యా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన లో భాగంగా మంత్రపురి కాలనీలో లక్ష మొక్కలను పెద్దఎత్తున నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.5 ఏకరాల విశాలమైన స్థలాన్ని కేటీఆర్‌ ‌బృహత్‌ ‌పట్టణ ప్రగతి వనంగా తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు. ఈపార్క్‌లో పలు రకాలైన 50 వేల పూల పండ్ల మొక్కలైన మామిడి, ఉసిరి, వాటర్‌ ఆపిల్‌, ‌స్టార్‌ ‌ఫ్రూట్‌, ‌పనస, మల్లె, గులాబీ, చామంతితో పాటు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌కోరిన విధంగా గౌడ్‌ ‌కమ్యూనిటీని ప్రోత్సహించుటకు, ఉపాధికి గాను గిరిక తాళ్ళు, నేరేడు, కరొందా తమలపాకు మొక్కలను 5 ఎకరాల స్థలానికి చుట్టూ ప్రహరీ గా నాటడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాం తంలో ప్రజలకు వంటలకు వచ్చే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో ఒక ఏకరంలో ప్రత్యేకంగా మామిడి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు.

దీనికి తోడుగా సమీపంలో గల ఎకరం స్థలం, మంత్రపురి కాలనిలో 50 వేల మొక్కల నాట డం వారం రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు. భూభాగం లో 33 శాతం పచ్చధనం ఉండాలనే లక్ష్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి హరితహారం అనే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌శ్రీకారం చుట్టారన్నారు. వర్ధన్నపేట శానసభ్యులు ఆరూరి రమేష్‌ ‌మాట్లా డుతూ ఆకుపచ్చ తెలంగాణ, ఆరోగ్యవంతమైన తెలంగాణ ఉండాలనే ఉదేశంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కెటిఆర్‌ ‌జన్మదినం సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగిందన్నారు. చింతగట్టు ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా మొక్కలు పెద్దయెత్తున నాటుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక దృష్టి పెట్టి పట్టణంలోని అన్ని ఖాళీ స్టలాల్లో పూల, పండ్ల మొక్కలతో చెట్లను పెంచుటకు చర్యలు తీసుకొంటున్న మేయర్‌ ‌కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుగులోతు దివ్యరాణి రాజు నాయక్‌, ‌జక్కుల రజిత శ్రీను, సిరంగి సునిల్‌, అదనపు కమిషనర్‌ ‌నాగేశ్వర్‌, ‌జిల్లా హార్టికల్చర్‌ అధికారి శ్రీనివాసరావు,సిహెచ్‌ ఓ ‌సునీత, ఎస్‌ ఈ ‌సత్యనారాయణ, ఉప కమిషనర్లు జోనా, రవీందర్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

andhrapradeshprajatantra newstelanganatelugu articlestelugu facts
Comments (0)
Add Comment