ఆందోళనలకు దిగిన మహిళా రైతులు

అం‌తర్జాతీయ మహిళా దినోత్సవం

న్యూఢిల్లీ,మార్చి8: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రైతులు చేపడుతున్న ఉద్యమం కొనసాగుతోంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళన వందరోజులను పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. భారీ సంఖ్యలో మహిలా రైతులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. టిక్రీ, ఘాజీపూర్‌ ‌సరిహద్దుల్లో నిరసనలు చేపట్టారు.

దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు, హర్యానా, ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌జాతీయ రహదారులను మూసివేశారు. కిసాన్‌ ఆం‌దోళన్‌లో భాగంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పంజాబ్‌ ‌నుండి భారీ సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్న మహిళలు టిక్రీ ప్రాంతానికి చేరుకున్నారు. వేల సంఖ్యలో మహిళా రైతులు, వారి కుటుంబ సభ్యులు నిరసనల్లో పాల్లొన్నారు.

ఫలితంగా తొమ్మిదో నెంబర్‌ ‌జాతీయ రహదారి 9తో పాటు ఎన్‌హెచ్‌-24 ‌పై ఇరువైపుల భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. ముందుజాగ్రత్తగా ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌గేట్‌ ‌వద్ద జాతీయ రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. ఢిల్లీ మెట్రో సంస్థ కూడా అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా టిక్రీ కలాన్‌ ‌నుంచి బ్రిగేడియర్‌ ‌హోషియార్‌ ‌సింగ్‌ ‌మార్గంలోని మెట్రోస్టేషన్లను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు.

international womens day
Comments (0)
Add Comment