దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్

కేంద్ర వైద్యారోగ్య శాఖ అత్యవసర భేటీ
న్యూ దిల్లీ, ఆగస్టు 4 : దేశంలో మంకీపాక్స్ ‌విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా..కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ ‌మేనేజ్‌మెంట్‌ ‌గైడెలైన్స్‌ను సవరించేందుకు గురువారం ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎమరెన్జీ మెడికల్‌ ‌రిలీఫ్‌ ‌డైరెక్టర్‌ ఎల్‌ ‌స్వస్తి చరణ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసీజ్‌ ‌కంట్రోల్‌, ఆల్‌ ఇం‌డియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైసెన్స్, ‌ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు సైతం భేటీకి హాజరయ్యారు. ఈఎంఆర్‌ ‌కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఓ విభాగం. ఇది జాతీయ, అంతర్జాతీయంగా ప్రజారోగ్య విషయాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. దేశంలో మంకీపాక్స్ ‌కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గైడెల్స్‌ను సవరించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

బుధవారం దిల్లీలో నైజీరియాకు చెందిన 31 సంవత్సరాల మహిళకు మంకీపాక్స్ ‌నిర్దారణైన విషయం తెలిసిందే. ఈ మహిళ మంగళవారం లోక్‌ ‌నాయక్‌ ‌హాస్పిటల్‌లో చేరగా.. బుధవారం మంకీపాక్స్ ‌పాజిటివ్‌గా తేలింది. అయితే, సదరు మహిళకు ఎలాంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేదని అధికారులు తెలిపారు. గతంలో పాజిటివ్‌గా తేలిన ముగ్గురు నైజీరియన్‌ ‌రోగులకు ఒకరితో ఒకరికి పరిచయం లేదని, వీరంతా వేర్వేరు చోట్ల నివసిస్తున్నారని హాస్పిటల్‌ అధికారులు ధ్రుకవీరించారు. ఇప్పటి వరకు కేరళలో అత్యధికంగా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. మంకీపాక్స్ ‌వ్యాప్తి నేపథ్యంలో గతంలోనే కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

MonkeypoxMonkeypox spreadingprajatantra newstelangana updatesToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment