పర్యాటక రంగానికి మోడి ప్రభుత్వం పెద్దపీట

“నరేంద్ర మోడి తెలంగాణకు ఇచ్చిన గొప్ప బహుమతి కూడా,తెలంగాణ చారిత్రక గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు నలూమూలలా తెలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోడిది,రామప్ప దేవాలయాని యునేస్కో గుర్తించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడుతూ,రామప్ప దేవాలయం ఇప్పుడు విశ్వవ్యాప్తం అయింది దేశ,విదేశాల నుండి పర్యాటకులు తరలివచ్చి ఈ రామప్ప దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయ్యాల్సిన అవసరం ఉంది అని పిలుపు ఇవ్వడం జరిగింది,అందుకు అనుగుణంగానే పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పర్యాటకలు సందర్శించే ప్రాంతంగా రామప్ప దేవాలయాన్ని తీర్చి దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది,అంతేకాక ప్రపంచ స్థాయిలో గొప్ప కట్టడంగా నిలిచినప్పుడు,దేశీయంగా, అంతర్జాతీయంగా పర్యాటకులు విచ్చేసి పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చెయ్యాల్సిన అవసరం ఉంది. గొప్ప స్థాయిలో నిలవాల్సిన అవసరం ఉంది.”

భారతీయ జనతాపార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రతిసారీ దేశ భద్రత,దేశ సమగ్రత,దేశ సార్వభౌమత్వము మీద దృష్టి పెడుతూనే,భారతదేశ ఖ్యాతిని,ప్రసిద్ధిని,భారతదేశ చరిత్రను మరొకసారి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత ప్రధాని నరేంద్రమోడి నాయకత్వనా బిజెపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది, నరేంద్ర మోడి భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదలు నేటి వరకు భారతదేశ ప్రతిష్టత అంతకంతకు పెరుగుతుంది అందులో భాగంగానే ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ‌కు అధిక ప్రాధాన్యత పెరగడం,జూన్‌ 21 అం‌తర్జాతీయ యోగా దినం ద్వారా భారతదేశానికి మరింత విలువ పెరిగింది,అంతేకాక క్రీ.శ 1213 లో గణపతిదేవుని సైన్య అధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప దేవాలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలోనే ప్రపంచ వారసత్వ సంపదగా నిలిచిన ఏకైక కట్టడంగా రామప్ప దేవాలయం నిలిచింది, అందుకు ప్రధాన కారణం భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం చేసిన కృషే,భారతీయ జనతాపార్టీ ఎల్లపుడూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటుందనడానికి రామప్ప గుడికి ఇచ్చిన గౌరవమే నిదర్శనం,అంతేకాక నరేంద్ర మోడి తెలంగాణకు ఇచ్చిన గొప్ప బహుమతి కూడా, తెలంగాణ చారిత్రక గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు నలూమూలలా తెలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోడిది,రామప్ప దేవాలయాని యునేస్కో గుర్తించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడుతూ,రామప్ప దేవాలయం ఇప్పుడు విశ్వవ్యాప్తం అయింది దేశ,విదేశాల నుండి పర్యాటకులు తరలివచ్చి ఈ రామప్ప దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయ్యాల్సిన అవసరం ఉంది అని పిలుపు ఇవ్వడం జరిగింది,అందుకు అనుగుణంగానే పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పర్యాటకలు సందర్శించే ప్రాంతంగా రామప్ప దేవాలయాన్ని తీర్చి దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది,అంతేకాక ప్రపంచ స్థాయిలో గొప్ప కట్టడంగా నిలిచినప్పుడు,దేశీయంగా, అంతర్జాతీయంగా పర్యాటకులు విచ్చేసి పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చెయ్యాల్సిన అవసరం ఉంది. గొప్ప స్థాయిలో నిలవాల్సిన అవసరం ఉంది.

కాకతీయుల పాలన, సామ్రాజ్యం అనేది యావత్‌ ‌భారతదేశంలో గొప్ప చరిత్రను సృష్టించడమే కాకుండా దక్షిణ భారతదేశాని పరిపాలించిన గొప్ప రాజవంశాలలో ఒకటిగా నిలిచి ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా,సామాజికంగా అభివృద్ధి చెందేందుకు గట్టి పునాది వేయ్యడం జరిగింది,ఇంతటి గొప్ప పేరు ప్రతిష్టలు కల్గిన కాకతీయుల సామ్రాజ్యానికి చిరునామానే రామప్ప దేవాలయాని 2020 సంవత్సరానికి గానూ ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడం . కాకతీయుల అద్భుతమైన శిల్పకళ,నైపుణ్యానికి రామప్ప దేవాలయం ప్రతీక….

దేశంలో దాదాపు 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశం మొత్తాన్ని సర్దార్‌ ‌వల్లభాయి పటేల్‌ ఐక్యం చేసినందుకు గుర్తుగా గుజరాత్‌ ‌లోని నర్మదనది తీరాన ఐక్య చిహ్నంగా సర్దార్‌ ‌వల్లభాయి పటేల్‌ ‌విగ్రహాని భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహంగా నిర్మించి గుజరాత్‌ ‌రాష్ట్రాని మరింత వృద్ది చెందేలా చెయ్యడమే కాకుండా ప్రస్తుతం దేశంలోనే పేరుగాంచిన,అత్యధికంగా పర్యాటకులు విచ్చేసేలా చేసి దేశంలో పర్యాటకులు సందర్శిస్తున్న గొప్ప ప్రాంతాలలో సర్దార్‌ ‌వల్లభాయి పటేల్‌ ‌విగ్రహం ఒక్కటిగా నిలిచిందంటే అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోడి పర్యాటకంగా తీసుకున్న చర్యలో భాగమే తప్ప మరొకటి కాదు …..

ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన నాగరికతలుగా ఈజిఫ్ట్ ‌నాగరికత ,మోసపటోమియా నాగరికత,సింధు నాగరికతలు నిలిచాయి. ప్రాచీన భారతదేశ చరిత్రకు వెన్నముక్కగా నిలిచిన హరప్పా నాగరికత దానికి మరోపేరే సింధు నాగరికత ఆ సింధు నాగరికతలో గొప్ప స్థాయిలో విర్రజిల్లుతున్న సమయంలో ఒక ప్రముఖ పట్టణంగా,గుజరాత్‌,‌పంజాబ్‌,‌దక్షిణాసియా, పశ్చిమాసియా దేశాలకు ప్రధాన ఆర్థిక,వాణిజ్య కేంద్రంగా మరియు ఒక గొప్ప పర్యాటక కేంద్రం గా ప్రసిద్ధి చెందిన దొలవీరను నేడు యునేస్కో గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప,చారిత్రక ఘట్టాల సరసన దొలవీర చేరిందంటే ఇది భారతీయ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి, ఇదేకాక నరేంద్ర మోడీ నాయకత్వనా బిజెపి ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా సాధిస్తూన్న ఘనత అని కూడా అర్థం చేసుకోవాలి,ఈ దొలవీర పట్టణంలో, సింధు నాగరికత కాలంలో అండర్‌ ‌డ్రైనేజి వ్యవస్థ,మహస్నానవాటిక,విశాలమైన రోడ్ల నిర్మాణం, నాటి అభివృద్ధి వ్యవస్థ,రక్షణ రంగంలో తిరుగు లేని విధంగా పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను సింధు లోయ నాగరికతలో ముఖ్యంగా దొలవీర లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ,అనవసరంగా నీటిని వృధా చేసుకోకుండా పక్కా ప్రణాళికగా వ్యవహారిస్తూ నేటి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తుందంటే సింధు లోయ నాగరికత,దొలవీర ఎంత అద్భుతమైన ప్రగతిని సాధించిందో అర్థం అవుతుంది ,నాటి ప్రజల స్థితి గతులు, సింధు నాగరికత దైవం అమ్మతల్లి అని ఇటువంటి ఎన్నో రకాలైన చారిత్రాత్మక విషయాలను తెలపడానికి ఈ దొలవీర పట్టణం సాక్షంగా నిలిచింది…

ఇవ్వే కాక దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా ఉన్నటువంటి కేదార్‌నాథ్‌,‌బద్రినాథ్‌,‌ప్రధాని నరేంద్ర మోడి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి,మరియు తమిళనాడు,కేరళ వంటి అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ పర్యాటకంగా ప్రపంచంలోనే భారతదేశం ఒక చిహ్నంగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోడి చేస్తున్న చర్యలు,కృషి భారత జాతికి గర్వకారణం మరియు ప్రతి ఒక్క భారతీయుడు గర్వించ దగ్గ విషయం.

– కేతూరి శ్రీరామ్‌,
ఉస్మానియా యూనివర్సిటీ,
మొబైల్‌ ‌నంబర్‌ :9640300169.

breaking updates nowheadlines nowModi governmentshortnews in teluguspecial focus on tourismToday telangana news
Comments (0)
Add Comment