ప్రజలకు ఎమ్మెల్యే వనామా బహిరంగ లేఖ

కొత్తగూడెం,జనవరి 06(ప్రజాతంత్ర ప్రతినిధి) : కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబంలో జరిగిన విషాదాంతం నన్ను తీవ్రంగా కలచివేసిందని, ఈ సంఘటనలో వనమా రాఘవేందర్రావు పాత్ర ఉందనే ఆరోపణల నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావు నియోజకవర్గ ప్రజలకు బహిరంగంగా ఓ లేఖ రాశారు. రామకృష్ణ ఆరోపణలు చేసినట్లు వొచ్చిన సూసైడ్‌ ‌నోట్‌, ‌రామకృష్ణ పేరుతో సోషల్‌ ‌మీడియాలో తిరుగుతున్న వీడియో నన్ను మరింత క్షోభకు గురి చేస్తుందని,  పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

ఈ ఘటనలో  పోలీస్‌, ‌న్యాయవ్యవస్థలు నిష్పక్షపాతంగా విచారణ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు వెలుగు చూసేవరకు రాఘవను నియోజకవర్గానికి దూరంగా పెడుతున్నట్లు చెప్పారు. పాల్వంచ ఘటనను సాకుగా చూపి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ, ప్రభత్వంపై బురాజల్లే ప్రయత్నాలు విపక్షాలు చేస్తున్నాయని ఈ లేఖలో పేర్కొన్నారు.

bjpCongresslatest newspm modiprajatantra newspaperpresent issuestelugu articlestrs party
Comments (0)
Add Comment