మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామా

  • స్పీకర్‌ ‌పోచారంను కలసి పత్రం అందచేత…ఆమోదం
  • నేడు కోమటిరెడ్డి సమాచారాన్ని ఇసికి ఇవ్వనున్న స్పీకర్‌
  • ‌గుజరాత్‌, ‌హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికకు అవకాశం
  • మునుగోడు తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు
  • కెసిఆర్‌ ‌కుటుంబ పాలనపై ధర్మయుద్ధం ప్రారంభించా
  • వి•డియాతో రాజగోపాల్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి ఎట్టకేలకు తన రాజీనామాను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డికి సమర్పించారు. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్‌ ‌రెడ్డి సమర్పించిన లేఖను స్పీకర్‌ ఆమోదించారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి స్వయంగా వెల్లడించారు. ఎమ్మెల్యే పదవికి  రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్‌ ‌ఫార్మాట్‌లో రిజైన్‌ ‌లెటర్‌ ఇచ్చారు. రాజగోపాల్‌ ‌రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం తెలిపారు.తన రాజీనామాను స్పీకర్‌ ‌పోచారం ఆమోదించారని రాజగోపాల్‌ ‌రెడ్డి తెలిపారు. అంతకుముందు గన్‌పార్కుకు చేరుకున్న రాజగోపాల్‌
‌రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం వి•డియాతో మాట్లాడుతూ ..మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా వి•డియాతో మాట్లాడారు. ‘కేసీఆర్‌ ‌చుట్టూ తెలంగాణ ద్రోహులు ఉన్నారు. ఇచ్చిన ఏ హావి• సీఎం కేసీఆర్‌ అమలు చేయలేదు.ఎర్రెబెల్లి, పువ్వాడ, గంగుల తెలంగాణ ఉద్యమకారులా?!. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్‌ ‌మెంట్‌ ఇవ్వరా?!. పదవి త్యాగం చేసేది మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం కోసం. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారు.

నా రాజీనామా ప్రస్తావన తర్వాతే గట్టుప్పల్‌ ‌మండలం ప్రకటించారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎవరు చెప్పారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు సీఎంకు కనువిప్పు కలిగించాలి. తలసాని తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టించలేదా?. నేను చేసేది త్యాగం.. గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు. మునుగోడుతో పాటు చాలా నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి. మూడున్నరేళ్లుగా నియోజకవర్గానికి నిధులు ఇవ్వక పోవటం తోనే మునుగోడు అభివృద్ధి ఆగిపోయిందని రాజగోపాల్‌ ‌రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి తెలిపారు. మూడున్నరేళ్లుగా నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవటంతోనే మునుగోడు అభివృద్ధి ఆగిపోయిందని రాజగోపాల్‌ ‌రెడ్డి అన్నారు. అరాచక, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తన రాజీనామా అంశం ముందుకు వొచ్చిందన్నారు. కేసీఆర్‌ ‌చేతిలో చిక్కిన తెలంగాణ తల్లిని కాపాడుకోవాలని అన్నారు.

మునుగోడు అభివృద్ధి కోసమే తన రాజీనామా అని స్పష్టం చేశారు. సోషల్‌ ‌వి•డియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని…రాజీనామా అనగానే గట్టుప్పల్‌ ‌మండలం అయ్యిందన్నారు. సీఎంకు సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్‌ ‌తప్ప ఇంకే కనిపించడం లేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని విమర్శించారు. ఉప ఎన్నిక వచ్చాక మునుగోడు గుర్తొచ్చిందన్నారు. యుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తారని తెలిపారు. టీపీసీసీ చీప్‌  ‌భాష విని సమాజం తలదించుకుందని, జైలుకెళ్లిన వ్యక్తులు మాట్లాడితే ప్రజలు నమ్మరని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే  కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్‌ ‌కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. రాజీనామా చేసిన కొన్నినిమిషాలకే ఆమోదం లభించింది. అనంతరం గవర్నర్‌ ‌తమిళిసైని కలిసేందుకు రాజగోపాల్‌ ‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ ‌కోరారు.

నేడు కోమటిరెడ్డి రాజీనామా సమాచారాన్ని ఇసికి ఇవ్వనున్న స్పీకర్‌….‌ గుజరాత్‌, ‌హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికకు అవకాశం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.  కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్‌ ఆమోదించారు. రాజీనామా సమర్పించిన కొన్ని నిమిషాలకే స్పీకర్‌ ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. నేడు ఈసీకి స్పీకర్‌ ‌కార్యాలయం సమాచారం ఇవ్వనుంది. గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కాగా ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 21న అమిత్‌ ‌షా సమక్షంలో అధికారంగా బీజేపీలో చేరనున్నారు. అదే రోజు కోమటిరెడ్డిని మునుగోడు అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనుంది.

MLA Rajagopal Reddy resignedprajatantra newstelangana updatesToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment