ఎం‌సెట్‌ ‌ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత

  • ఇంజినీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు
  • త్వరలోనే కౌన్సిలింగ్‌ ‌మొదలు పెడతామని వెల్లడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్12 : ‌తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ‌ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, అ‌గ్రికల్చర్‌లో టాప్‌-10 ‌ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు. హైదరాబాద్‌ ‌జేఎన్‌టీయూహెచ్‌ ‌ప్రాంగణంలో మంత్రి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, అ‌గ్రికల్చర్‌లో టాప్‌-10 ‌ర్యాంకులను మంత్రి వెల్లడించారు. ఇంజినీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు, సాయిదీపికకు రెండో ర్యాంకు, కార్తికేయకు మూడో ర్యాంకు సాధించినట్లు వివరించారు. త్వరలోనే కౌన్సెలింగ్‌ ‌ప్రారంభిస్తామని మంత్రి సబిత తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎంసెట్‌ ‌కౌన్సెలింగ్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంసెట్‌ ‌కౌన్సెలింగ్‌ ‌సెంటర్‌లో కళాశాలలు, కోర్సుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సబిత ఇంద్రారెడ్డి అన్నారు. అగ్రికల్చర్‌లో నేహాకు మొదటి ర్యాంకు, రోహిత్‌కు రెండో ర్యాంకు, తరుణ్‌కుమార్‌కు మూడో ర్యాంకు సాధించారు. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్‌, 30, 31‌న అగ్రికల్చర్‌, ‌ఫార్మా ఎంసెట్‌ ‌పరీక్షలు నిర్వహించారు.

ఇంజినీరింగ్‌కు 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ‌ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఎంసెట్‌ ఇం‌జనీరింగ్‌ ‌విభాగంగా లక్ష్మీసాయి లోహిత్‌ ‌రెడ్డి ఫస్ట్ ‌ర్యాంక్‌ ‌సాధించగా.. సాయి దీపిక సెకండ్‌, ‌కార్తికేయ థర్డ్ ‌ప్లేస్‌ ‌లో నిలిచారు. ఇక అగ్రికల్చర్‌ ‌విభాగంలో నేహాకు ఫస్ట్ ‌ర్యాంక్‌ ‌రాగా.. రోహిత్‌ ‌సెకండ్‌ ‌ర్యాంక్‌ ‌సాధించారు. ఎంసెట్‌ ‌కౌన్సెలింగ్‌ ‌సెంటర్లలో కాలేజీల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.  మరోవైపు ఈ సెట్‌ ‌ఫలితాలను సైతం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్‌ ‌చేశారు. ఈసెట్‌ ‌లో 90.69శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 22,001 మంది పరీక్ష రాయగా 19,953 మంది క్వాలిఫై  అయ్యారు.జులై 18 నుంచి 21 వరకు ఎంసెట్‌ ఇం‌జనీరింగ్‌ ‌స్ట్రీ ఎగ్జామ్స్ ‌జరిగాయి. జులై 30, 31వ తేదీల్లో అగ్రికల్చర్‌, ‌ఫార్మా ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ ‌నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్‌, ‌మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు సెకండ్‌ ‌సెషన్‌ ‌లో పరీక్ష జరిపారు. ఎంసెట్‌ ఇం‌జనీరింగ్‌ ‌స్ట్రీ ‌పరీక్షలకు 1,56,812 మంది హాజరుకాగా, అగ్రికల్చర్‌ అం‌డ్‌ ‌ఫార్మా కోర్సులకు నిర్వహించిన పరీక్షను 80,575 మంది రాశారు.

Minister Sabita indra reddyprajatantra newsState Education Minister Sabita Indra Reddytelangana updatesTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment