సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక..

  • పువ్వులను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ
  • ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బతుకమ్మ పండుగా సందర్భంగా జిల్లా, రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్‌రావు బుధవారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుగపుకున్న ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం వొచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం తరపున బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువుల వద్ద ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.

happy Batukamma festivalhuzurabad by election countingminister harish raotelagana bathukamma festivaltelugu updates now
Comments (0)
Add Comment