మా అమ్మకూడా నన్ను డాక్టర్ కావాలనుకుంది
ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్‌లో మంత్రికెటిఆర్
హైదరాబాద్,ప్రజాతంత్ర: వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. వారి సేవలు అమోఘమన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగగించి సేవలు చేశారని అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారు. అలానే నేనూ డాక్టర్ అవ్వాలని మా అమ్మ కోరుకుందని మంత్రి చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో జరిగిన ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్‌కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యులు కుటుంబ జీవితాన్ని త్యాగం చేస్తారన్నారు. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ ఉన్నా అటెండ్ అవుతారని తెలిపారు. వైద్య రంగంలో మహిళలు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. వైద్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అన్నిరంగాలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పారు.
తెలంగాణ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు.మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి వీ-హబ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. జెండర్ ఈక్వాలిటీ పాలించే రాష్టాల్ల్రో తెంగాణ ఒకటన్నారు. కొన్నేండ్లుగా భారతీయ వైద్యరంగం ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. కరోనా సమయంలో ఏఐజీ ఆస్పత్రి మంచి సేవలు అందించిందని చెప్పారు. మహిళలు వ్యాపారంలో రాణించేలా విహబ్ ఏర్పాటు చేయడంతో పాటు తగిన ప్రోత్సాహం అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. కొత్త టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడు అంటుంటారని చెప్పారు.