మానసిక క్షోభలో మానవాళి ..!

  • వెంటాడుతున్న భయం ..ఒంటరితనం
  • అనిశ్చితిలో ఆర్థిక రంగం ..
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

ప్రపంచవ్యాప్తంగా కోవిద్‌ ‌కేసులు పెరుగుతూనే ఉన్నందున, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆందోళన , ఒంటరితనం, మరణం,పేదరికం,నిరాశకు గురిఅవుతున్నారు. ‘‘ఒంటరితనం, భయం, అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం వీటి వలన ప్రపంచ మానవాళి మానసిక క్షోభకు గురి అయితున్నది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ ‌దేవోరా కెస్టెల్‌ ఓ ‌న్యూస్‌ ‌పేపర్‌ ‌కి చెప్పారు. మానసిక అనారోగ్యంతో బాధపడేవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్రతలో పెరిగే అవకాశం ఉందని, దీని గురించి అన్ని దేశాల ప్రభుత్వాలు ఆలోచించాలి అని దేవోరా కెస్టెల్‌ అన్నారు. మహమ్మారి వలన వచ్చిన మానసిక ఆరోగ్య సమస్యల కోణాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం అత్యవసరంగా కలిసి రావాలని యుఎన్‌ ‌సెక్రటరీ జనరల్‌ ఆం‌టోనియో గుటెర్రెస్‌ ‌కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కోవిద్‌ -19 ‌మానసిక ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావంపై చర్యల కోసం యుఎన్‌ ‌పాలసీ ప్రకటనను చేస్తూ, యుఎన్‌ ‌చీఫ్‌ ‌మాట్లాడుతూ ఇలా అన్నారు ‘‘ముందున్న కాలంలో మానసిక ఆరోగ్య సమస్యల వలన ఫ్రంట్‌లైన్‌ ‌ప్రజల మానసిక ఆరోగ్యం కోసం పూర్తిగా నిధులు సమకూర్చాలి అని యుఎన్‌ అధికారుల చెబుతున్నారు. మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నప్రజలకి మద్దతునిచ్చే ప్రభుత్వ విధానాలకు పెద్ద పీట వేయాలని అలాగే మానవ హక్కులను కాపాడి ప్రజల గౌరవాన్ని కాపాడాలని యుఎన్‌ ‌చీఫ్‌ ‌పిలుపునిచ్చారు. మనస్తత్వవేత్తలు పిల్లలు ఆందోళన చెందుతున్నారని పిల్లలో మాంద్యం కేసులు అనేక దేశాలలో అనేక రెట్లు పెరిగాయని నివేదించారు. దీనితో పాటు గృహ హింస కూడా అధిక స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది అని యుఎన్‌ ‌తెలిపింది.

ఆరోగ్య సంరక్షణ కార్మికులు, మానసిక సహాయం కావాలని నిరంతరం అడుగుతున్నారు. కోవిద్‌ -19 ‌రోగులతో వ్యవహరించే వైద్యులు నర్సులు భయం, ఆందోళన, దుఃఖం, నిరాశ, చిరాకు, నిద్రలేమి పీడకలు వంటి సమస్యలు అనుభవిస్తున్నారు. %ఔ••% నివేదించిన దాని ప్రకారం, కరోనా వైరస్‌ ‌వలన మాత్రమే కాకుండా, చాలా మంది ప్రజలు మానసిక అనారోగ్యం వాటి ప్రభావాలు, ఒంటరితనం వలన చోటు చేసుకున్న పరిణామాలతో బాధపడుతున్నారు, మరికొందరు వ్యాధి సంక్రమణ జరుగుతుందేమో అని భయపడుతున్నారు.రోగులు మరణిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు అయినవారు కోల్పోయి వేదన అనుభవిస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చాల మంది పనులు పోయి నష్టపోయారు.అత్యధిక ప్రజలు జీవనోపాధిని కోల్పోయి ఆకలి ప్రమాదంకి గురి అయ్యారు . ఈ సమస్యలతో పాటు పుకార్లు, తప్పుడు సమాచారం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.ప్రజలు తమ భవిష్యత్తు గురించి కలతలో వున్నారని యుఎన్‌ అధికారులు చెబుతున్నారు. హెల్త్‌కేర్‌ ‌కార్మికులు, వృద్ధులు, కౌమారదశలో వున్నవారు, యువకులు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి అయ్యే ప్రమాదం వుంది.’’ మహమ్మారి అదుపులోకి వచ్చిన తర్వాత కూడా ఈ దుఃఖం ప్రజలలో ఆందోళన, నిరాశ రేపి సమాజాలను ప్రభావితం చేయనున్నది అని ఆయన హైలైట్‌ ‌చేశారు.

Comments (0)
Add Comment