మకర సంక్రమణం

విశ్వ కాంతుల దీప భానుడు
మకర రాశిలో ప్రభాకర ప్రవేశాలు
రాసులుగా సాగు ఫలసాయాలు
నిండు చూలాలులైన గుమ్ములు
తోడ్కొని రావాలి భోగ భాగ్యాలు
గృహమంతా సంతోష తోరణాలు
సకినాలు, అరిసెలు, గారెలు
పొంగల్‌ ‌వంటల ఘుమఘుమలు
సం’క్రాంతి’ సరదాల ఊటలు !

అత్యాచార దురాలోనల్ని..
అమానవీయ దుశ్చర్యల్ని..
అనైతిక వికృత పోకడల్ని..
అవినీతి భావకాలుష్యాల్ని..
రాగద్వేషాది దుర్గుణాల్ని..
కోపతాపాల చపల చిత్తాల్ని..
కరోనా మహమ్మారి విషకోరల్ని..
అగ్ని కీలలకు ఆహుతి చేస్తూ..
భస్మం చేద్దాం భోగి మంటల్లో..
వెలిగిద్దాం మనో మందిరాల్ని !

గోదా రంగనాథుడి కళ్యాణ శోభలు
ఆకసాన ఎగిరే ఆశల పతంగులు
దిష్టిని పోగొట్టే భోగిపళ్ళ తానాలు
వాకిట వాలిన ముత్యాల ముగ్గులు
ముఖాల్లో విరబూసిన నవ్వులు
హరిదాసుల భజనల సురాగాలు
ఊళ్లన్నీ కోడి పందాల క్షేత్రాలు
నవధాన్యాల నడుమ గొబ్బెమ్మలు
ఇంటింటా క్రాంతిమయ సింగిడులు
మకర సంక్రాంతి సరదాల విందులు !

– మధుపాళీ
9949700037

makara sankrantiprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment