సిలబస్‌ ‌తగ్గింపులో ..విద్యా మౌలిక లక్ష్యాలను విస్మరించరాదు

“మనం ప్రస్తుతం చేర్చిస్తున్న అంశం మాధ్యమిక  తరగతుల గురించి.దీనికి సంబంధించి భారత ప్రభుత్వం సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌కమిషన్‌ ‌పేరుతో డా.లక్మణస్వామి మొదలియర్‌ అధ్యక్షతన ఒక కమిషన్‌ (1952 – 53) ఏర్పాటు చేసింది.ఈ కమిషన్‌ ‌ సిఫార్సులో మొదటి మాధ్యమిక విద్యాలక్ష్యం బలమైన జాతీయత మరియు సామాజిక భావనాలతో నిండిన ఆదర్శ పౌరులను తయారు చేయడమే అని పేర్కొంది.ఈ కమిషన్‌ ‌సిఫార్సులో మూడవ లక్ష్యం మాధ్యమిక విద్యా స్థాయి విద్యార్థుల్లో నాయకత్వాన్ని పెంపొందించాలని ఈ గుణం ప్రజాస్వామ్యం కోసం  మరియు దేశం మొత్తం అభివృద్ధికి చాలా అవసరం. అని పేర్కొంది.అంటే విద్యార్థులకు జాతీయత, పౌరసత్వం, ప్రజాస్వామ్యం అనే పాఠ్య అంశాలు అందుబాటులో ఉండాలి.”

కొరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అది సృష్టిస్తున్న విస్ఫోటనం విద్యా వ్యవస్థ పై కూడా పడింది. మార్చి22 న మూతపడ్డ పాఠశాలలు ఇప్పటికీ తెరిచే పరిస్థితి లేదు,ఎప్పుడు తెరుస్తారో అన్న విషయంపై కూడా స్పష్టత లేదు.కొందరైతే ఈ విద్య సంవత్సరం జీరో ఇయర్‌ అవుతుందని ఊహాగానాలు సృష్టిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైతే జూలై 31 నాటి వరకు పాఠశాలలు తెరువకూడదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించి ది,అంటే జులై31 నాటికి సుమారు 40 రోజుల పనిదినలు నష్టపోతున్నట్లు.కొరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆగస్టు,సెప్టెంబర్‌, అక్టోబరు వరకు తెరిచే అవకాశం లేకపోవచ్చు.దీని ప్రకారం సుమారు 80 నుంచి 90 రోజుల పనిదినాలు నష్టపోయే ప్రమాదం ఉంది.విద్యాసంవత్సరం మొత్తం 220 పనిదినాలలో 80 నుంచి 90 రోజులంటే సుమారు 25 శాతం నుంచి 30 శాతం పనిదినాలు నష్ట పోతున్నట్లు. దీనికై నష్టపోతున్న పని దినాలకు తగినట్లుగా తొమ్మిదో తరగతి నుంచి పన్నెండోవ తరగతి వరకు 30శాతం సెలబస్‌ ‌తగ్గిస్తునట్లు సి బి యెస్‌ ఇ ‌వారు ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే సిలబస్‌ ‌తగ్గించే విషయంలో పాఠ్య అంశాలలో అత్యంత మౌలికమైన జాతీయవాదం,ప్రజాస్వామ్యం- హక్కులు, లౌకికవాదం, పౌరసత్వం, సమైక్య వ్యవస్థ, ఉద్యమాలు, మొదలైనవి ఏక మొత్తంగా తగ్గించడం ఇప్పుడు వివాదాస్పదమై, పెద్ద చర్చకు దారితీసింది.
ఈ తగ్గింపు ఈ విద్య సంవత్సరానీకె అని సి బి యెస్‌ ఇ ‌వారు తరువాత వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఏక మొత్తంగా ఆయా ఆయా పాఠ్య అంశాలు పూర్తిగా తొలగించడం సమంజసం కాదు.దాని ఆవశ్యకత గూర్చి ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉంది.అసలు ఈ విద్యా పాఠ్య ప్రణాళిక ఏ ఉద్దేశాలు,లక్ష్యాలతో తయారు చేయబడుతుందో ఒక పూర్తిస్పష్టత ఉంటే ఈ సంవత్సరానికి 30% పాఠ్య అంశాలను ఎలా తగ్గించవచో ఒక్క అభిప్రాయానికి రావొచ్చు.

మనం ప్రస్తుతం చేర్చిస్తున్న అంశం మాధ్యమిక తరగతుల గురించి.దీనికి సంబంధించి భారత ప్రభుత్వం సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌కమిషన్‌ ‌పేరుతో డా.లక్మణస్వామి మొదలియర్‌ అధ్యక్షతన ఒక కమిషన్‌ (1952 – 53) ఏర్పాటు చేసింది.ఈ కమిషన్‌ ‌ సిఫార్సులో మొదటి మాధ్యమిక విద్యాలక్ష్యం బలమైన జాతీయత మరియు సామాజిక భావనాలతో నిండిన ఆదర్శ పౌరులను తయారు చేయడమే అని పేర్కొంది.ఈ కమిషన్‌ ‌సిఫార్సులో మూడవ లక్ష్యం మాధ్యమిక విద్యా స్థాయి విద్యార్థుల్లో నాయకత్వాన్ని పెంపొందించాలని ఈ గుణం ప్రజాస్వామ్యం కోసం మరియు దేశం మొత్తం అభివృద్ధికి చాలా అవసరం. అని పేర్కొంది.అంటే విద్యార్థులకు జాతీయత, పౌరసత్వం, ప్రజాస్వామ్యం అనే పాఠ్య అంశాలు అందుబాటులో ఉండాలి. భారత విద్యా వ్యవస్థలో అతి ముఖ్యమైన కమిషన్‌ ‌కొఠారి కమిషన్‌.‌కొఠారి కమిషన్‌ (1964) ‌ ముఖ్యమైన నాలుగు సిఫార్సు లో సామాజిక మరియు జాతీయత సమైఖ్యతను ప్రోత్సాహించడం,సామాజిక,నైతికత మరియు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి ప్రాధాన్యతను ఇవ్వడం. ఇక్కడ కూడా జాతీయత, సమైక్యత, పాఠ్యఅంశాలకు ప్రాధాన్యతను ఇచ్చారని గుర్తించాలి.ఇందిరాగాంధీ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడ్డ మొదటి జాతీయ విద్య విధానం-1968 కూడ రాడికల్‌ ‌పునర్నిర్మాణం. మరియు జాతీయత సాధించడానికి సమైక్యతకు సాంసృతికతకు, మరియు ఆర్థికాభివృద్ధి కోసం పిలునిచ్చింది.1986 జాతీయ విద్యా విధానం సిఫార్సులో కూడా ఒకటవ సిఫార్సులొనే విద్యా లక్ష్యం సర్వతోముకాభిరుద్ది అని పేర్కొంటూ జాతీయ సమైక్యతకుశాస్త్రీయ నిగ్రహం మరియు మనస్సు మరియు ఆత్మ యొక్క అవగాహనలను విద్యా మెరుగుపరుస్తుంది, తద్వారా రాజ్యాంగంలో పెందుపరచిన సోసిలిజం,లౌకికవాదం మరియు ప్రజాస్వామ్యంలి యొక్క లక్ష్యాలను మరింత పెంచుతుందని పేర్కొంది.మాధ్యమిక విద్యా లక్ష్యాల్లో చరిత్ర పిల్లలకు జాతీయదృక్పదస్పూర్తిని అందిస్తుంది మరియు పౌరులుగాలి వారి రాజ్యాంగ విధులుమరియు హక్కులనులి అర్థము చేసుకునే అవకాశాలను ఇస్తుంది.

ఈ విధంగా సి బి యెస్‌ ఇ ‌వారు ఏ అంశాలనైతే ఈ సంవత్సరానికి తొలగించారో అవే అంశాలను అత్యంత ముఖ్యమైన విద్యా లక్ష్యాలుగా పై కమీషన్స్ ‌పేర్కొంటున్నాయి.సెలబస్‌ ‌తగ్గించడం లో భాగంగా ముఖ్యమైన మౌళికాంశాలైన జాతీయవాదం ప్రజాస్వామ్యం-హక్కులు జాతీయసమైక్యత లౌకికవాదం పౌరసత్వం సమైక్య వ్యవస్థ ఉద్యమాలు మొదలైన అంశాలు సి బి యెస్‌ ఇ ‌వారు ఏకమొతంగా కాకుండా పాఠ్యాంశాల నిడివిలో 30శాతం తగ్గిస్తే సరిపొయేది,ఇంత వివాదాస్పదం అయ్యిఉండేది కాదు.ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది.అన్ని పాఠ్యాంశాల నిడివిని తగ్గిస్తే,కొత్త పాఠ్యపుస్తకాలను వ్రాయాల్సి ఉంటుంది,అందుకు సమయం లేదు,భవిష్యత్‌ ‌లో అవి ఉపయోగించుకునే అవకాశం ఉండదు.అటువంటప్పుడు పాఠ్యాంశాలను ప్రాధాన్యత క్రమంలో అమర్చి,ప్రాధాన్యత క్రమంలో చివరి అంశాలలో 30శాతం అంశాలను ఈ విద్యా సంవత్సరానికి తగ్గిస్తే సరిపోతుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్యాంశాలు తగ్గించే అంశాన్ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సందర్భంగా సి బి యెస్‌ ఇ ‌వారి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విద్యా లక్ష్యాల్లో అత్యంత మౌలిక అంశాలనుఏకమొత్తంగా కాకుండా, ప్రాధాన్యత క్రమంలోఉన్న చివరిఅంశాలను ఈ విద్య సంవత్సరానికి రద్దు చేయడం మంచిది.దానికి ఈ సూచనలు పాటించవచ్చు.

ముందుగా పాఠ్యాంశాలను క్రింది తరగతుల నుంచి పైతరగతుల వరకు ఒకే పాఠ్యాంశాల నిడివి పెంచుతూ ఉన్న పాఠ్యాంశాలను గుర్తించి ఏదో ఒక సంవత్సరంలో అట్టి పాఠ్యాంశాలను ఈ విద్య సంవత్సరానికి మాత్రమే ప్రక్కకు పెడితే సరి పోతుంది.ఇంటర్మీడియట్‌ ‌లో అధ్యయనం చేసే అంశాలు కేవలం ప్రాథమిక గానే విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో చేర్చిన పాఠ్య అంశాలను గుర్తించి,ఈ ఒక్క విద్యా సంవత్సరానికి ప్రక్కకు పెడితే సరిపోతుంది.మాధ్యమిక తరగతులలో ప్రపంచ చరిత్ర,భారతదేశ చరిత్రను ప్రాథమికంగా చర్చిస్తూ పాఠ్య అంశాలు ఉంటాయి.అందులో ప్రపంచ చరిత్రకు తక్కువ ప్రాధాన్యతను ఇస్తూ,భారతదేశ చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే సరిపోతుంది. సాధారణంగా మూల్యాంకనాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠ్య అంశాలకు బారత్వాన్ని ఇస్తుంటాం,దాని ప్రకారం బారత్వంలో తక్కువ బారత్వం ఉన్న పాఠ్య అంశాలను ఈ ఒక్క సంవత్సరానికి తొలగిస్తే సరిపోతుంది.పై సూచనల ప్రకారం తగ్గించడం వల్ల విద్య మౌలిక లక్ష్యాలకు ఎటువంటి విఘాతం ఏర్పడదు. ఒక తరగతిలో ఒక లక్ష్యం తొలగించబడిన,మరొక తరగతిలో అదే లక్ష్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. మనం ఉదాహరణకు ఇక్కడ పదవ తరగతి సాంఘిక శాస్త్రానికి గూర్చి చూద్దాం.

పదవతరగతిలో మొదటి భాగంలో 11 పాఠ్యాంశాల ఉన్నాయి. అందులో పై సూచనల ప్రకారం,అభిరుద్ది భావనలు,భారతదేశం- జనాభా, ప్రజలు నివాస ప్రాంతాలు, రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ,మొదలైన పాఠ్యాంశాలను ఈ విద్య సంవత్సరానికి ప్రక్కకు పెట్టవచ్చు.ఇక రెండవభాగలో చూస్తే మొత్తం 10పాఠ్యాంశాలలో పై సూచనల ప్రకారము చూస్తే, భారతదేశంలో జాతీయ ఉద్యమం,భారతదేశంలో ఎన్నికల పక్రియ, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం: భారతదేశం, మొదలైన పాఠ్యాంశాలు ఈ విద్యా సంవత్సరానికి ప్రక్కకు పెట్టవచ్చు. తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్రం విషయానికి వస్తే మొత్తం 22 పాఠ్యాంశాల్లో ,ధరలు-జీవన వ్యయం, పారిశ్రామికీకరణ సామాజికమార్పు, లాటిన్‌ అమెరికా ఆసియా ఆఫ్రికా లో వలసవాదం,విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం, విపత్తు నిర్వహణ,రోడ్డు భద్రత విద్య,మొదలైన పాఠ్యాంశాలు ఈ సంవత్సరం వరకు ప్రక్కకు పెడితే సరిపోతుంది. ఎనిమిదో తరగతి మొత్తం 24 పాఠ్యాంశాలలో పటాల అధ్యయనం విశ్లేషణ, ద్రవ్యం బ్యాంకింగ్‌, ‌జీవనోపాదులు-సాంకేతిక విజ్ఞాన ప్రభావం,పార్లమెంట్‌-‌కేంద్ర ప్రభుత్వం, పేదరికం- అవగాహన, సినిమా-ముద్రణ మాధ్యమాలు, క్రీడలు: జాతీయత వాణిజ్యం మొదలైన పాఠ్యాంశాలను ఈ సంవత్సరానికి రద్దు చేస్తే సరిపోతుంది. కేవలం 30శాతం సిలబస్‌ ‌తగ్గించడమే మన ఉద్దేశంకానీ, పాఠ్యాంశాల విద్యమౌలిక అంశాలు,వాటి లక్ష్యాలు తగ్గించడంకానీ, రద్దు చేయడంకానీ కాదని స్పష్టం చేయాలి. కాబట్టి పాఠ్యఅంశాల కూర్పుపై సెమినార్స్, వర్క్ ‌షాప్స్‌, మొదలైనాయి ఆన్లైన్‌ ‌లో నిర్వహించి, సబ్జెక్టస్ ‌నిష్ణాతుల,మనోవిజానవేతల సలహాల ప్రకారం ఒక లిఫ్రేమ్‌ ‌వర్క్ ‌తయారుచేయాలి. అట్టి ఫ్రేంవర్క్ ‌ప్రకారం విద్యామౌలిక లక్ష్యాలు దెబ్బతినకుండా 30శాతం సిలబస్‌ ఈ ‌సంవత్సరానికి మాత్రమే తగిస్తే మన విద్యా లక్ష్యాలను చేరుకోవడంలో ఎటువంటి. విఘాతం ఉండదు,వివాదాస్పదం కాదు.

– జుర్రు నారాయణ,
టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్ నగర్ ‌, 9494019270

basic objectives of educationCitizenshipdemocracyNationalismsyllabus reductionT TU District Presidents MahabubnagarZurru Narayana
Comments (0)
Add Comment