పేదల గుండెచప్పుడు మహానేత వైఎస్సార్‌

  • ‌విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన నేతలు
  • పాలకుడు ఎలా ఉండాలో నిరూపించిన నేత వైఎస్‌: ‌సజ్జల

విజయవాడ,సెప్టెంబర్‌ 2 : ‌పాలకుడు ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్‌ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ 12‌వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ‌విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, ‌జూపూడి ప్రభాకర్‌, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తెలుగు అకాడె చైర్‌ ‌పర్సన్‌ ‌లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్‌ ఆచరణల్లోంచి ఓ మహావృక్షం పెరిగిందన్నారు. నాన్న వేసిన అడుగుకి పదడుగులు వైఎస్‌ ‌జగన్‌ ‌వేశారన్నారు. వైఎస్సార్‌ ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా వైఎస్‌ ‌జగన్‌ ‌పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ను బలోపేతం చేస్తూ ఆయన అడుగులో అడుగు వేద్దామని పిలుపునిచ్చారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ ‌చిరస్థాయిగా నిలిచిపోయారని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్సార్‌ ‌మరణించినా.. ఆయన జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయన్నారు. తండ్రి బాటలోనే సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నా రన్నారు.

లోకేష్‌ అసమర్థుడని.. ఎప్పటికీ నాయకుడు కాలేడని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. పేదల గుండెచప్పుడు మహానేత వైఎస్సార్‌ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. వైఎస్సార్‌ ‌ప్రవేశపెట్టిన పథకాలు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. అందరి హృదయాలు గెలిచిన మహానేత వైఎస్సార్‌ అని కొనియాడారు. వైఎస్సార్‌ ‌వర్ధంతి సందర్భంగా విజయవాడ పోలీస్‌ ‌కంట్రోల్‌ ‌రూం వద్ద వైఎస్సార్‌ ‌విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా కషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్‌ ‌రాయన భాగ్యలక్ష్మి, పైబర్‌ ‌నెట్‌ ‌చైర్మన్‌ ‌గౌతమ్‌ ‌రెడ్డి, దేవినేని అవినాష్‌, ‌కాపు కార్పోరేషన్‌ ‌చైర్మన్‌ అడపా శేషు, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌ ‌పైలా సోమినాయుడు, డిప్యూటీ మేయర్‌ ‌బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. రాజన్న పాలన ఒక స్వర్ణయుగం అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్‌ ‌బాటలు వేశారన్నారు. ఆరేళ్లలోనే వైఎస్సార్‌ 60 ఏళ్ల ప్రగతి చూపారన్నారు.

అనంతపురం జిల్లా పుట్టపర్తి వైఎస్సార్‌ ‌సీపీ కార్యాలయంలో మహానేత వైఎస్సార్‌ 12 ‌వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ ‌విగ్రహానికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ ‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ ‌వర్ధంతి సందర్భంగా ఓడిసి మండలం గౌనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మారాలలో అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దు కుంట పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డు లో దివంగత వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ ‌విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోరుమామిళ్లలోని వైఎస్సార్‌ ‌విగ్రహానికి పార్టీ మండల కన్వీనర్‌ ‌సీఎం భాష, జిల్లా అగ్రి గోల్డ్ ‌బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు చిత్తా విజయ్‌ ‌ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌ ‌వర్ధంతి సందర్భంగా ఏలూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆయన విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొఠారి అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కోయ మోషన్‌ ‌రాజు, మేయర్‌ ‌షేక్‌ ‌నూర్జహాన్‌ , ఇడా చైర్మన్‌ ఈశ్వరి ,స్మార్ట్ ‌సిటీ చైర్మన్‌ ‌బొద్దాని అఖిల, సాహిత్య అకాడ చైర్మన్‌ ‌పి. శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ap headlinescorona latest updatestoday ap govt meetingsys jagan pressmets
Comments (0)
Add Comment