రాబందుల రెక్కల చప్పుడు పొగ గొట్టపు భూంకార ధ్వని శ్రీశ్రీ నినదించిన మేడే అంటే ఏమిటి

భాయీలు పారిపోతున్నారు. మేరా భారత్‌ ‌మహాన్‌ అనుకొని నోరుమూసుకోవడం పెన్ను మూసుకోవడం తప్ప ఏం జెద్దాం బ్రదర్‌.

 

‌పొలాలనన్నీ ,

హలాల దున్నీ ,

ఇలాతలంలో హేమం పిండగ ••-

జగానికంతా సౌఖ్యం నిండగ ••-

 

నరాల బిగువూ ,

కరాల సత్తువ

వరాల వర్షం కురిపించాలని ,

ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని •••

 

 

నిరపరాధులై దురదృష్టంచే

చెరసాలలో చిక్కే వాళ్ళు ….

లోహ రాక్షసుల పదఘట్టనచ్చే

కొనప్రాణంతో కనలేవాళ్లు ….

కష్టంచాలక కడుపుమంటలే

తెగించి సమ్మెలు కట్టేవాళ్లు ….

 

శ్రమ నిష్పలమై ,

జని నిష్టురమై ,

నూతిని గోతిని వెదికే వాళ్ళు బిబిబిబి

అనేకులింకా అభాగ్యులంతా ,

అనాథలంతా ,

అశాంతులంతా

ధీర్ఘశ్రుతిలో , తీవ్ర ధ్వనితో

విప్లవ శంఖం వినిపిస్తారోయ్‌ !

 

‌రాబందుల రెక్కల చప్పుడు

పొగ గొట్టపు భూంకార ధ్వని

అరణ్యమున హరీంద్ర గర్జన

పయోధర ప్రచండ ఘోషం

ఝంఝానిల షడ్జధ్వానం

ఖడ్గమృగోదగ్ర విరావం

కావాలోయ్‌ ‌నవ కవనానికి

 

మే డే గుర్తుంచుకోండి. శ్రీశ్రీ ని గుర్తుంచుకోండి.

– మాడభూషి శ్రీధర్‌

Comments (0)
Add Comment