‌దేశీ ఉత్పత్తి పరిశ్రమలకిక మంచిరోజులు

ఇంతకాలంగా నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్న దేశీ ఉత్పత్తి పరిశ్రమలకు త్వరలో మంచి భవిష్యత్‌ ఉం‌డబోతున్నట్లు స్పష్టమవుతున్నది. కొరోనా కారణంగా ఏర్పడ్డ సంక్లిష్ట పరిస్థితిలో దేశీయ ఉత్పత్తులు ప్రజలను ఆదుకున్న తీరుకు, ఇకనుండి దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదనకు, దేశ హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆచరణలో పెట్టిన తీరు కేంద్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉందన్న విషయాన్ని చెబుతున్నది. కేంద్ర సాయుధ బలగాల(సిఏపిఎప్‌) ‌క్యాంటిన్లలో స్వదేశీ ఉత్పత్తులనే విక్రయించాలని షా ఆదేశాలు కూడా జారీచేయడమే ఇందుకు నిదర్శనం. అదికూడా జూన్‌ ఒకటవ తేదీ నుండే అమలు కావాలని సూచించడం నిజంగానే అభినందనీయం. పెరుగుతున్న నాగరికత అవసరాలకు తగినట్లుగా విదేశీ తయారీ వస్తు కాంక్ష కూడా ప్రజల్లో క్రమేణా పెరుగుతూ వస్తున్నది. ఎంత వ్యయమైనా వాటిని కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. దీంతో స్వదేశీ వస్తుతయారీ సంస్థలు క్రమేణా మూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతికంగా మనదేశం ఎంతో అభివృద్ధి చెందినట్లు చెబుతున్నా ప్రజల అవసరాలకు తగినట్లుగా వస్తువులను ఉత్పత్తి చేయకపోవడం కూడా స్వదేశీ సంస్థలు క్షీణించిపోవడానికి ఒక కారణమవుతు న్నదన్నది ఆరోపణ. ఉదాహరణకు మనదేశంలో కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థలో విస్తారంగా వ్యాపించి, వేళ్ళూనుకున్న బిఎస్‌ఎన్‌ఎల్‌ ‌సంస్థ ప్రజల అవసరాలకు తగినట్లుగా సాంకేతికతను పెంచుకో కపోవడం. ఇవ్వాళ అత్యవసర వస్తువుల్లో ఒకటిగా భావిస్తున్న సెల్‌ఫోన్లను ఆ సంస్థ అందించలేక పోయింది.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈసంస్థ అన్ని హంగులున్నా ప్రగతిని సాధించకపోగా క్రమేణా ఒక్కో విభాగాన్ని ప్రైవేటు పరం చేస్తూవస్తున్నది. ఫలితంగా కొన్ని దేశీయ ప్రైవేటు సెల్‌ ‌సంస్థలు ఉద్భవించినా విదేశీ కంపెనీల పోటీని తట్టుకోలేక పోతున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ సాంకేతికతను జొప్పించి అందిస్తున్న చైనా లాంటి దేశాల తయారీ సెల్‌లపైనే ప్రజలు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. చివరకు చిన్నపిల్లల ఆటవస్తువుల ఉత్పత్తిలో కూడా చైనా ప్రపంచ మార్కెట్‌లో దూసుకువెళ్తోంది. మన దగ్గర ప్రతీ సంక్రాంతికి ఎగురవేసే గాలిపటం(పతంగ్‌)‌ల విషయంలో కూడా చైనా తయారీనే డామినేట్‌ ‌చేస్తున్నది. ప్లాస్టిక్‌తో తయారవుతున్న గాలిపటాలు, వాటికి కట్టే మంజాదారాన్నే ఇష్టపడుతున్నారు. ఆ దారం వల్ల పక్షుల, మానవ ప్రాణాలకు కూడా ప్రమాదక •మైందని తెలిసినా దాన్నే వాడడానికి ఇష్టపడుతు న్నారు. మన ప్రభుత్వాలు దాన్ని వాడవద్దని చెబుతాయే గాని, దాని దిగుమతిని మాత్రం నిషేధించదు. ఫలితంగా కాగితంతో తయారుచేసే స్వదేశీ గాలిపటాలకు, దూదితో తయారయ్యే మాంజా దారానికి మార్కెట్‌ ‌లేకుండా పోతున్నది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. చైనా మనకు శత్రుదేశం. నేటికీ దేశసరిహద్దుల్లో ఆదేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నప్పటికీ, ఆదేశం నుండి ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ ‌వస్తువులతోపాటు వ్యవసాయరంగానికి సంబంధించిన యంత్రాలు, వివిధ రకాల ఇతర సామగ్రిని మనదేశం దిగుమతిచేసుకుంటూనే ఉంది. గత పదేళ్ళ కాలంలో ఈ దిగుమతులు మరింత పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. 2017-18లో భారతదేశం చేసుకున్న మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 16.4 శాతం. అలాగే 2018-19లో 13.69గా ఉంది. కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు చైనా ఉత్పత్తులపైనే ఆధారపడ్డాయి. అయితే చైనా ఉత్పత్తిగా చెప్పుకుంటున్న కొరోనా ఇప్పుడు చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్న అన్ని దేశాలను ఆలోచనలో పడేసింది. అన్ని దేశాలు కూడా స్వయం సమృద్ధిని సాధించుకోవడమే మార్గమన్న నిర్ణయాని కొస్తున్నాయి. భారత దేశం కూడా స్వయం ఆధారిత దేశంగా ఎదగాలన్న కృతనిశ్చయా నికొచ్చినట్లు మంగళవారం ప్రధాని మోదీ చేసిన ప్రసంగం స్పష్టం చేస్తున్నది. ఇది నిజంగా హర్షించదగిన విషయం.

ఎప్పుడూ స్వదేశీ గురించి ఉపన్యాసాలిచ్చే భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండే స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహిస్తుందన్న ఆశ ఉండింది. వాజ్‌పాయ్‌ ‌ప్రధాని అయినప్పుడు, ఆ తర్వాత మోదీ ప్రధాని అయినప్పుడు ప్రజలు దాన్నే ఆకాంక్షించారు. కాని, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా మనదేశానికి ఒకరకంగా మేలుచేసిందేమోనని పిస్తున్నది. పాలకుల దృష్టి ఇన్నాళ్ళకైనా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిం చాలన్న వైపుకు మళ్ళింది. ప్రపంచ దేశాతో పోలిస్తే భారతదేశం అతితక్కువ నష్టంతో కొరోనా కోరల్లో నుండి బయటపడింది. ఇంతటి సంక్లిష్ట పరిస్థితిలో ప్రజల అవసరాలన్నిటినీ తీర్చింది కూడా ఈ స్థానిక ఉత్పత్తులేననడంలో అతిశయోక్తిలేదని ప్రధాని మోదీ అన్న మాటలు దేశం ఇక స్వయం ఆధారితంగా తయారవుతుందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నది. ఇవ్వాళ మనం ఏదైతే గ్లోబల్‌ ‌బ్రాండ్స్ అనుకుంటున్నామో అవన్నీ ఒకప్పుడు స్థానిక తయారీ వస్తువులేనని, క్రమేణా ప్రజలే వాటిని గ్లోబలైజ్‌ ‌చేశారని మోదీ గుర్తు చేశారు. అందుకే స్థానికతను మన జీవన మంత్రంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని కాలమే మనకు నేర్పిందంటూ స్వదేశీ ఉత్పత్తులను కేవలం వాడుకోవడమే కాదు వాటిని ప్రచారం చేయాల్సిన దాయిత్వం కూడా మనకుందంటూ ‘ఓకల్‌ ‌ఫర్‌ అవర్‌ ‌లోకల్‌’ అన్న నినాదాన్నిచ్చాడాయన. ఇంతవరకు పౌష్టికాహార లోపాన్ని అధిగమించడంలో, పోలియో నిర్మూలనంలో విజయం సాధించడం ద్వారా ప్రపంచ ముఖచిత్రాన్నే మార్చిన భారత్‌ ‌త్వరలో కోవిడ్‌ ‌సంక్షోభం నుండి బయటపడేసే కీలక ఔష•ధాన్ని అందించడం ద్వారా విశ్వమానవ కల్యాణాన్ని ఆకాంక్షించే భారత్‌గా తన పేరును సార్థకం చేసుకుంటుందన్న మోదీ ఆశాభానికి మనమంతా గర్వించాల్సిన విషయమే అయినప్పటికీ, స్వదేశీ ఉత్పత్తులపై, ఇకనైనా కేంద్రం శ్రద్ధతీసుకోవడం ద్వారా మేకిన్‌ ఇం‌డియా పేరును సార్థకం చేసుకుంటుందని భావిద్దాం.

local industrieslocal manufacturingmanufacturing industrymanufacturing industry in india
Comments (0)
Add Comment