నగరంలో చెరువుల సుందరీకరణకు పెద్దపీట

  • చుట్టూ వాకింగ్‌ ‌ట్రాక్‌ ఏర్పాటు… మురుగు కాల్వల మళ్లింపు
  • సభ్యుల ప్రశ్నలకు మంత్రి కెటిఆర్‌ ‌సమాధానం
  • రెండ్రోజుల విరామం తరువాత సోమవార మళ్లీ ప్రారంభమైన అసెంబ్లీ
  • చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో పెరగనున్న భూగర్భ జలాలు : మండలిలో సభ్యలు ప్రశ్నలపై మంత్రి హరీష్‌ ‌రావు సమాధానం

నగరంలోని చెరువులను పర్యవేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నామని, చెరువుల చుట్టూ వాకింగ్‌ ‌ట్రాక్‌, ‌సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు చేపట్టామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 185 చెరువులలో 127 చెరువులను అభివృద్ధి పరిచేందుకు గుర్తించి, అందులో 48 చెరువులను అభివృద్ధి చేశామన్నారు. రెండు రోజుల విరామం అనంతరం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి సోమవారం ప్రారంభించిన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ‌నగరంలో చెరువుల సుందరీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం ఇచ్చారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ. 407 కోట్ల 30 లక్షలను మంజూరు చేశాం. ఇప్పటికే రూ. 218 కోట్లను ఖర్చు చేశామని ఆయన తెలిపారు. రూ. 94 కోట్ల 17 లక్షల అంచనా వ్యయంతో 63 చెరువుల సుందరీకరణను జీహెచ్‌ఎం‌సీ చేపట్టి 48 చెరువుల పనులను పూర్తి చేసింది. మిగతా 15 చెరువుల పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 282 కోట్ల 63 లక్షల అంచనా వ్యయంతో మిషన్‌ ‌కాకతీయ అర్బన్‌ ‌కింద 19 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టామన్నారు. రూ. 30 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో 45 చెరువుల అభివృద్ధి, వరద వల్ల దెబ్బతిన్న మరమ్మతులను జీహెచ్‌ఎం‌సీ చేపట్టిందని కేటీఆర్‌ ‌తెలిపారు. దశాబ్దాలుగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో చెరువుల అభివృద్ధికి ఒక డివిజన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఒక స్పెషల్‌ ‌కమిషనర్‌ను నియమిస్తాం. చెరువుల అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్‌లో వొచ్చే రెండేళ్లలో 31 సీవరేజ్‌ ‌ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. నాలాలపై ప్రత్యేక దృష్టి సారించాం. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించి, వారికి వెంటనే పునరావాసం కల్పించాలని ఆలోచిస్తున్నాం. నాలాల విస్తరణకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి, సీఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్‌ ‌చెప్పారు.

చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో పెరగనున్న భూగర్భ జలాలు : మండలిలో సభ్యలు ప్రశ్నలపై మంత్రి హరీష్‌ ‌రావు సమాధానం


ప్రతి నది, వాగుల మిద చెక్‌డ్యాంలు కట్టి ఎక్కడికక్కడ వరద నీరు ఒడిసిపట్టాలనేదే సీఎం కేసీఆర్‌ ‌సంకల్పమని మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. చెక్‌డ్మాలను కట్టడం ద్వారా నీటిని నిల్వ చేస్తామని అన్నారు. దీంతో భూగర్భ జలాలు కూడా అందుబాటులోకి వొస్తాయన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో చెక్‌ ‌డ్యాంల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్‌ ‌రావు సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్ల కోసమేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సాగునీటిపై దృష్టి సారించకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు పెరిగాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ‌సాగునీటిపై దృష్టి పెట్టి పెండింగ్‌ ‌ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తి చేశారు. రాష్ట్రంలో భారీ రిజర్వాయర్లను నిర్మించి.. వరద నీటిని వాటిలో నిల్వ చేసి రాష్ట్ర ప్రజలకు 365 రోజులు సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడటమే కేసీఆర్‌ ‌ధ్యేయమని మంత్రి చెప్పారు. వాటిలో భాగంగానే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, జలాశయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మిషన్‌ ‌కాకతీయ పథకం అమలు చేయడం, చెక్‌ ‌డ్యాంల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 3.09 మిటర్ల భూగర్భ జలాలు పెరిగాయని, అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6.03 మిటర్లు పెరిగాయని మంత్రి వెల్లడించారు.

600 కోట్లతో త్వరలోనే సోమశిల బ్రిడ్జి నిర్మాణం: అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నకు మంత్రి వేముల జవాబు
కొల్లాపూర్‌ ‌నియోజకవర్గంలోని సోమశిల గ్రామం వద్ద కృష్ణా నదిపై నిర్మించబోయే బ్రిడ్జి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో కొత్త బ్రిడ్జిలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి సమాధానం ఇచ్చారు. సోమశిల బ్రిడ్జికి రూ. 600 కోట్లు కేటాయించడం జరిగింది. దీనికి సర్వే జరుగుతుంది. ఒక నెలలో సర్వే పూర్తవుతుంది. అనంతరం డీపీఆర్‌ ‌తయారీ తర్వాత, భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభిస్తామన్నారు. మొత్తంగా తొమ్మిది నెలల లోపు సోమశిల బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామన్నారు. కొల్లాపూర్‌ ‌ప్రజల చిరకాల వాంఛ త్వరలోనే నెరవేరుతుందని మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 629 వంతెనలను మంజూరు చేశాం. ఇప్పటికే 372 వంతెనలు పూర్తయ్యాయి. 257 వంతెనలు పురోగతిలో ఉన్నాయి. పురోగతిలో ఉన్న వంతెనలు 2022, జూన్‌ ‌నాటికి పూర్తవుతాయి. వంతెనల కోసం రూ. 3,050 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో అనేక కొత్త బ్రిడ్జిలు వొచ్చాయి. స్టేట్‌ ‌రోడ్డు డిపార్ట్‌మెంట్‌ ‌తరపున 384 కొత్త బ్రిడ్జిలు, నాబార్డ్ ‌నుంచి 50 కొత్త బ్రిడ్జిలు, ఆర్డీఎప్‌ ‌నుంచి 43 కొత్త బ్రిడ్జిలు, ఆర్‌ అం‌డ్‌ ‌బీ నాన్‌ ‌ప్లాన్‌ ‌నుంచి 119 కొత్త బ్రిడ్జిలను మంజూరు చేసుకున్నాం. కొత్త బ్రిడ్జిల కోసం ఈ ఆరు నెలల కాలంలో రూ. 1539 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కొల్లాపూర్‌ ‌నియోజకవర్గంలోని సోమశిల బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీకి పలుమార్లు నివేదికను ఇచ్చాం. మన ప్రతిపాదనకు మన్నించి ఈ బ్రిడ్జితో పాటు కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్‌, ‌కొల్లాపూర్‌, ‌కృష్ణా నదిపై సోమశిల మిదుగా నంద్యాలకు మొత్తం 170 కి.మి. పొడవునా జాతీయ రహదారి నంబర్‌ 167‌ను నోటిఫై చేశారని అన్నారు.

beautificationhuzurabad live updatesponds in hyderabad cityprajatantranewsread pdf onlinetelugu articlestelugu epaper
Comments (0)
Add Comment