నెత్తిమీద లక్షల అప్పు ..! అన్నదాత ఆగమాగం ..

  • దేశంలో 50 శాతం వ్యవసాయ కుటుంబాలు రుణగ్రస్తులే
  • వ్యవసాయ రంగంలో రుణగ్రహీతల సంఖ్య ఐదేళ్ళలో 58 శాతం పెరిగిందిః ఎన్‌ ఎస్‌ ఓ ‌సర్వే

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌బ్యూరో : దేశంలో కుటుంబాల రుణాలు పెరిగిపోతున్నాయి. 2012-13 ప్రాంతంలో కుటుంబానికి 47 వేల రూపాయిల రుణం ఉంటే 2018-19 లో అది 74,121కి పెరిగింది. సగటున వ్యవసాయ కుటుంబాలు 50 శాతం రుణగ్రస్తమై ఉన్నాయి. వ్యవసాయ కుటుంబాల రుణాలు గడిచిన ఐదేళ్ళలో 58 శాతం పెరిగినట్టు ఎన్‌ ఎస్‌ఒ ‌సర్వే వెల్లడించింది.2018లో వ్యవసాయ కుటుంబాల రుణం 2013తో పోలిస్తే 57.7 శాతం పెరిగినట్టు నేషనల్‌ ‌స్టాటస్టికల్‌ ఆఫీసు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలో 50 శాతం వ్యవసాయ కుటుంబాల రుణాలు సగటున 2013లో 47,000 ఉంటే, 2018లో అవి 74,121 రూపాయిలకు పెరిగాయి. ఆంధప్రదేశ్‌ ‌లో అత్యధికంగా 2.45 లక్షలు కాగా, నాగాలాండ్‌ ‌లో 1, 750 రూపాయిలు. ఈ రుణాలలో 69.6 శాతం బ్యాంకులు, సహకార సంఘాలు, ప్రభుత్వ సంస్థలనుంచి తీసుకున్నవి కాగా, 20.5 శాతం వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవిగా ఆ సర్వే వివరించింది. వ్యవసాయ అవసరాల కోసం 57.5 శాతం రుణాలు తీసుకున్నట్టు వెల్లడించింది. 2019లో గ్రామీణ భారతంలో వ్యవసాయ కమతాలు, కుటుంబాల వారిగా కమతాలుపై కార్యక్రమ అమలు, గణాంక మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

వ్యవసాయ కార్యకలాపాల ద్వారా నాలుగువేల రూపాయిలకు పైగా ఆదాయం కలిగిన వారిని వ్యవసాయ కుటుంబాలుగా నిర్వచించడం జరిగింది. ఈ కుటుంబాల్లో ఒకరు వ్యవసాయం లేదా అనుబంధ రంగాల్లో స్వయం ఉపాధి కలిగి ఉండటాన్ని ప్రమాణికంగా తీసుకుని నిర్వచించడం జరిగింది. నేషనల్‌ ‌స్టాటిస్టికల్‌ ఆఫీసు ఈ మాదిరి సర్వేను 77వ సారి నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులు, వ్యవసాయ సేవలు అందించేవారిని వ్యవసాయ కుటుంబాలుగా పరిగణించలేదు. ఈ సర్వే పరిధిలో వారు లేరు. 2019 జనవరి ఆగస్టు మధ్య, అదే సంవత్సరం సెప్టెంబర్‌ ‌డిసెంబర్‌ ‌మధ్య ఈ సమాచారాన్ని సేకరించారు.

2018-19లో సగటు వ్యవసాయ కుటుంబ ఆదాయం 10, 218 రూపాయిలు. 2012-13 కన్నా 6, 426లు ఎక్కువ. వ్యవసాయ ఆదాయం 2018-19లో 2012-13లో కన్నా 2,071 రూపాయిలు ఎక్కువ. నెలవారీ వేతనాలు పెరగడం వల్ల. దేశంలో వ్యవసాయ కమతాలు కలిగిన వారి సంఖ్య 9.39 కోట్లు. వీరిలో ఇతర వెనకబడిన తరగతుల వారు 45.8 శాతం కాగా, షెడ్యూల్డ్ ‌కులాల వారు 15.9 శాతం, తెగల వారు 14.2 శాతం ఇతరులు 24.1 శాతం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర కుటుంబాలు 7. 39 కోట్లు కాగా, ఒక హెక్టార్‌ ‌కన్నా తక్కువ భూమి కలవారు 83.5 శాతం మంది. 10 హెక్టార్లను 0.2 శాతం మంది మాత్రమే. ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ, కేరళ, పంజాబ్‌, ‌హర్యానా, కర్నాటక, రాజస్థాన్‌, ‌తమిళనాడు,. హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌ ‌లలో జాతీయ సగటుతో పోలిస్తే సగటున కుటుంబానికి అప్పులు గలవారు ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో ఆంధప్రదేశ్‌ 2.45 ‌లక్షలు, తెలంగాణ 1.52 లక్షలు రుణం కలిగిన వారున్నారు.

Lakhs of debt on farmersPrajatantraTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment