సామాజిక వ్యాప్తిగా మారుతున్న కోవిడ్‌-19?

ఇన్సాకాగ్‌ అధ్యయన ఫలితాల ఆధారంగా

ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న 3వ వేవ్‌ ఓమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌ద్వారా తేలికపాటి కోవిడ్‌-19 ‌వ్యాధి లక్షణాలతో హాస్పిటల్స్ , ఐసియూ అడ్మిషన్లు తక్కువగా, మరణాలు స్వల్పంగా నమోదు అవుతున్నాయని, ఇండియాలో నేడు ‘సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌)’ ‌స్థాయికి చేరిందని ‘‘ఇండియన్‌ ‌సార్స్-‌కోవ్‌-2 ‌జీనోమిక్స్ ‌సీక్వెన్సింగ్‌ ‌కన్సార్టియమ్‌, ఇన్సాకాగ్‌’’ ‌తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారత ప్రభుత్వ కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగాల సహకారంతో సియస్‌ఐఆర్‌, ఐసియంఆర్‌, 38 ‌లాబొరేటరీల సౌజన్యంతో నిర్వహించిన కోవిడ్‌-19 ‌వ్యాప్తి అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడైనాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ప్రకారం కొరోనా వ్యాప్తి వేగంగా జరుగుతూ, స్థానికంగా సామాజిక వ్యాప్తి జరుగుతూ, వ్యాప్తి శృంఖలాన్ని గుర్తించుట కష్టం అవుతుంది. కొరోనా పరీక్షల్లో అధిక పాజిటివ్‌ ‌రేటుతో కొరోనా వ్యాప్తి ఫలితాలు ఆయా ప్రాంతాల్లో బయటపడుతూ ఉంటాయి. ప్రస్తుత ఓమిక్రాన్‌ ‌వేరుయంట్‌ ‌వేగంగా వ్యాపించినప్పటికీ వ్యాధి లక్షణాలు లేకుండా ‘ఎసిమ్టమాటిక్‌’ ‌దశ లేదా స్వల్ప రోగ లక్షణాలతో సులభంగా రికవరీ కావడం కనిపిస్తున్నదని, మరణాల రేటు అత్యల్పంగా ఉంటున్నదని ఇన్సాకాగ్‌ ‌నివేదిక వివరిస్తున్నది.

మహానగరాలే వ్యాప్తి కేంద్రాలు:
ప్రస్తుతం దిల్లీ, ముంబాయ్‌ ‌లాంటి పలు మహానగరాల్లో డెల్టా వేరియంట్‌ ‌కన్న ఓమిక్రాన్‌ ‌వ్యాప్తి అతి వేగంగా జరుగుతూ, సామాజిక వ్యాప్తి దశకు చేరిందని వివరిస్తున్నారు. విదేశస్థుల నుంచి కాకుండా స్థానికుల నుంచి అంతర్గతంగా ఓమిక్రాన్‌ ‌వేగంగా విస్తరిస్తున్నదని, ఇండియాలోకి కొన్ని ప్రాంతాల్లో బిఏ.2 ఓమిక్రాన్‌ ‌సబ్‌-‌వేరియంట్‌ ఉం‌దని తేలింది. ఇటీవల ఫ్రాన్స్‌లో మాత్రమే గుర్తించిన బి.1.640.2 లీనియోజ్‌ను పర్యవేక్షంచగా, దాని వ్యాప్తి రేటు తక్కువగా ఉంటూ, వేరింట్‌ ఆఫ్‌ ‌కన్సర్న్‌గా కాకుండా ఉంటున్నదని తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఇన్సాకాగ్‌ ‌ద్వారా 1.51 లక్షల సాంపుల్స్ ‌సీక్వెన్సింగ్‌లో 1.28 లక్షలు విశ్లేషించబడినవి. నేడు నమోదవుతున్న కొరోనా కేసుల్లో దాదాపు 90 శాతం ఓమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కేసులే కనిపించాయని తెలుస్తున్నది. సామాజిక వ్యాప్తి దశలో కరోనా ఎలా, ఎవరి ద్వారా సోకిందనే ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకవు. కొరోనా వ్యాప్తి ఎవరి నుండైనా సోకే ప్రమాదకర దశకు చేరామని తెలిపారు.

పాండమిక్‌ ‌నుంచి ఎండమిక్‌ ‌దశకు చేరడం:
ఓమిక్రాన్‌ ‌వ్యాప్తి రాబోయే రెండు వారాల్లో, అనగా ఫిబ్రవరి 06, 2022 వరకు గరిష్ట దశకు చేరి తరువాత క్రమంగా తగ్గుతుందని మద్రాస్‌ ఐఐటి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. జనవరి 14 – 21 మధ్య ఆర్‌-‌విలువ (ఒకరి కరోనా సోకిన వ్యక్తి నుంచి ఎందరికి వ్యాపిస్తుందనే విలువ) 1.57గా ఉందని, జనవరి 07 – 13 మధ్య ఆర్‌- ‌విలువ 2.2 నమోదైందని, 01 – 06 మధ్య ఆర్‌-‌విలువ 4.0, డిసెంబర్‌ 25 – 31 ‌మధ్య ఆర్‌-‌విలువ 2.9 ఉందని విశ్లేషించారు. కలకత్తా నగరంలో ఆర్‌-‌విలువ 0.56, ముంబాయ్‌లో 0.67, ఢిల్లీలో 0.98, చెనైలో ఆర్‌-‌విలువ 1.2 ఉందని తెలుస్తున్నది. ఆర్‌-‌విలువ 1.0 కన్న తక్కువగా ఉన్నపుడు మహమ్మారి వ్యాప్తి తగ్గిందని అర్థం చేసుకోవాలి. నేడు కలకత్తా, ముంబాయ్‌ ‌నగరాల్లో కరోనా ఉదృతి ‘పాండమిక్‌ (‌మహమ్మారి)’ దశ నుంచి ‘ఎండమిక్‌ (‌స్థానికమైన)’ దశకు మారుతున్నదని విశ్లేషించారు.

కొరోనా క్రమశిక్షణలే రక్షణ మార్గాలు:
నేడు ఓమిక్రాన్‌ ‌వారం పాజిటివ్‌ ‌రేటు అధికంగా 16.87 శాతం నమోదు కావడం, టీకా వేసుకోని వారిలో మరణాల రేటు అధికంగా ఉండడం గమనించారు. నేడు ఓమిక్రాన్‌ ‌వ్యాప్తి పెరిగినా మరణాల రేటు మ్నెదటి రెండు అలలతో పోల్చితే, 3వ అలలో ఓమిక్రన్‌ ఆధార మరణాలు అతి తక్కువగా నమోదు కావడం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నది. కోవిడ్‌-19‌తో తీవ్రమైన వ్యాధి లక్షణాలతో హా స్పిటల్స్ , ఐసియూలు అవసరం అయినపుడు అది డెల్టా వేరియంట్‌ ‌కారణం కావచ్చని భావించాలి. ఓమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కేసుల్లో సాధారణ రోగ లక్షణాలు లేదా లక్షణాలు లేకపోవడం గమనించారు. నేడు పలు రాష్ట్రాల్లో ఓమిక్రాన్‌ ‌గరిష్ట స్థాయికి చేరిందని, నేడు రికవరీ దారిన పడుతున్నదని వివరిస్తున్నారు. నేడు కఠిన కరోనా నియమనిబంధనలైన మాస్కుల ధారణ, భౌతిక దూరాలు, టీకాలు వేయించుకోవడం, సమూహాలను నిరోధించడం, సానిటైజర్లు వాడడం లాంటి జాగ్రత్తలే కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తాయని తెలుసుకోవాలి. కొరోనా వేరియంట్‌ ఓమిక్రాన్‌తో ప్రాణాపాయం లేనప్పటికీ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన జాగ్రత్తలు విధిగా తీసుకుంటూ, సకాలంలో టీకాలను వేయించుకుంటూ, కొరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుందాం.

Insakag‌ study resultsOmicron virus
Comments (0)
Add Comment