భార్యను బజారుకీడ్చిన చిల్లరనాయుడు బాబు

  • ఎన్టీఆర్‌ ‌కుటుంబ మద్దతు కోసం చిల్లర రాజకీయాలు
  • మేమెప్పుడూ భువనేశ్వరిపై కామెంట్స్ ‌చేయలేదు
  • చంద్రబాబు తీరుపై ఘాటు విమర్శలు చేసిన కొడాలి నాని

అమరావతి, నవంబర్‌ 25 : ‌టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోమారు మండిపడ్డారు. శవాల ద చిల్లర ఏరుకునే చిల్లర నాయుడు రాష్ట్రంలో ఉండటం దురదృష్టమంటూ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు చేసింది మానవ తప్పిదం..భార్యను అల్లరి చేసుకుంటున్న పచ్చి రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. ఓ పదిమందిని మా ఇంటికి పంపితే నేనెందుకు క్షమాపణ చెప్పడం ఏమిటి..? అతని భార్యను అతను అల్లరి చేసుకుంటూ నన్ను క్షమాపణ చెప్పమంటా డేమిటి అంటూ నిలదీశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు తమకు సంబంధం ఏమిటి? అని మంత్రి కొడాలి నాని షాకింగ్‌ ‌కామెంట్స్ ‌చేశారు. గురువారం డియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌గురించి మాట్లాడుతూ.. ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘ఒకప్పుడు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు విడిపోయాం. ఆయన చెబితే మేమెందుకు వింటాం? ఇప్పుడు నేను, వంశీ జగన్‌తో ఉన్నాం. ఆయన కోసం పని చేస్తున్నాం‘ అని కొడాలి నాని వెల్లడించారు. ఎన్టీఆర్‌ ‌కుటుంబం మద్దతు కోసం చంద్రబాబు ఆయన భార్యను రోడ్డు దకు లాగారని కొడాలి అన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్లు నందమూరి కుటుంబం చంద్రబాబును నమ్ముతూనే ఉందని కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ ‌కుటుంబం మాటలు చూస్తే తనకు జాలేసిందని కొడాలి ఎద్దేవా చేశారు.

జగన్‌ను వేధించిన సోనియా నుంచి ఎర్రన్నాయుడు, శంకర్రావు, లోకేష్‌ ‌పరిస్థితి ఏంటో అందరూ చూశారని చెప్పారు. చంద్రబాబుకు తానెందుకు క్షమాపణ చెప్పాలని కొడాలి ప్రశ్నించారు. తాను సెక్యూరిటీ పెంచుకోవడం లేదు..నేను వదిలేస్తా..ఆయన్ని జడ్‌ ‌ప్లస్‌ ‌వదిలేయమనండని సవాల్‌ ‌విసిరారు. అలా వదిలేసివిజయవాడలో తిరుదాం రమ్మన ఇసవాల్‌ ‌చేశారు. ఈరోజుకీ వైఎస్సార్‌ ‌ప్రజల గుండెల్లో బతికున్నారు. నువ్వు జగన్‌తో పోరాటం చేయలేక పిచ్చి వాగుడు వాగుతున్నావు. నువ్వు బతికున్నా సచినట్లే లెక్క? పాపి చిరాయువు.. ఒక్కో సీఎం విధానం ఒక్కోలా ఉంటుంది? అన్నీ సహాయక చర్యలు పూర్తయినాక చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి? ఏది పబ్లిసిటీ చేసుకోవాలో కూడా తెలియదంటూ చురకలు అంటించారు. గురువారం ఉదయం డియా ముందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే ఆయన మాటలపై స్పందించిన మంత్రి కొడాలి నాని.. శవాల ద చిల్లర ఏరుకునే చిల్లర నాయుడు రాష్ట్రంలో ఉండటం దురదృష్టం మంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జిల్లాల్లో జరిగిన నష్టం అందరికీ తెలుసు? సీఎం వెంటనే స్పందించి అన్నీ చేస్తున్నారని ఆయన అన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారు? పునరుద్ధరణకు అధికారులు, మంత్రులతో సక్షిస్తున్నారన్నారు.

చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎదో అన్నారని కుంటి సాకులు చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఆయన భార్య పేరు తెస్తే ఆ కుటుంబం మద్దతు ఇస్తుందని చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. ఆయన, ఎల్లో డియా ఆమెను అల్లరి అల్లరి చేస్తున్నారని, ఎక్కడ కూడా ఆమెను అసెంబ్లీలో కానీ, బయట కానీ మేము ప్రస్తావించలేదని అన్నారు. ఇలాంటి భర్త, కొడుకు దొరకడం ఆమె దురదృష్టమన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏడుపు ముఖం పెడతాడు. అక్కడ వరదల్లో కష్టపడుతుంటే వాళ్ళ దగ్గరకు వెళ్లి నీ సొల్లు పురాణం ఎందుకు. అక్కడ పరిష్కారం కానివి ఎమున్నాయో మాకు చెప్పు? వాటన్నిటినీ వదిలేసి నా భార్యను అవమానించారు అని చెప్తాడు. జగన్‌ ‌ను ఇబ్బంది పెట్టి సోనియా నుంచి నీ కొడుకు వరకు సర్వ నాశనం అయ్యారు. జగన్‌ ‌పై కేసులు వేసిన వారు ఏమయ్యారో మనం చూశాం. జగన్‌ను వేధించిన వాళ్ళకి చంద్రబాబు లాంటి నీచమైన గతి పడుతుంది. వైఎస్సార్‌ ‌మరణం చాలా గొప్ప మరణం? నీది నీ కొడుకుది కుక్క బతుకు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.నువ్వు జగన్‌ ‌తో పోరాటం చేయలేక పిచ్చి వాగుడు వాగుతున్నావు.

చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఏది పబ్లిసిటీ చేసుకోవాలో కూడా తెలియదు. మేమేమి పుష్కరాల్లో గేట్లు మూసేసి షూటింగ్‌ ‌పెట్టలేదు.. అక్కడ జరిగిన సంఘటనకు ఈయన్ని ఏమి చేయాలి. ఒక్క సారి స్థాయికి మించి వరద వస్తే ఎవరు ఆపగలరని అంటూ కొడాలి నాని మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం భార్యను రోడ్డు దకు తేవడం అన్యాయం. చంద్రబాబు మాదిరిగానే లోకేష్‌ ‌వ్యవహరిస్తున్నారు. ఏదోలా రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు తాపత్రయం. చంద్రబాబు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ వదిలేసి కుంటిసాకులతో బయటకెళ్లిపోయారు. చంద్రబాబు, ఎల్లో డియా కలిసి భువనేశ్వరి పరువు దిగజార్చారు. వరదల్లో బాధితులపరామర్శకు వెళ్లి..నన్ను అవమానించారంటూ చంద్రబాబు ఏడుస్తున్నారని మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు.

cbn wifechandrababu naidukodali naniprajatantra newstelangana updatestelugu kavithalu
Comments (0)
Add Comment