సవాల్‌ ‌కెటిఆర్‌ ‌కాదు.. కెసిఆర్‌ ‌చేయాలి

అప్పుడు చెబుతా ..: బండి సంజయ్‌
‌తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని, ఎవరిది తప్పయితే వారు రాజీనామా చేయాలని మంత్రి కేటీఆర్‌ ‌విసిరిన సవాల్‌కు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌స్పందించారు. కేటీఆర్‌ ‌కాదు? కేసీఆర్‌ ‌సవాల్‌ ‌విసిరితే అప్పుడు చూస్తానని అన్నారు. యూపీఏ కంటే ఎన్డీయేనే రాష్టాన్రికి 9 శాతం అధికంగా నిధులు ఇచ్చిందని బండి సంజయ్‌ ‌స్పష్టం చేశారు.

పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుందని వెల్లడించారు. కేటీఆర్‌కు రాజ్యాంగం తెలియదని విమర్శించారు. ఒక్కో తెలంగాణ వ్యక్తిపై లక్ష రూపాయల అప్పు చేసినందుకు, ధనిక రాష్టాన్ని్ర అప్పుల రాష్ట్రంగా మార్చినందుకు కేటీఆరే రాజీనామా చేయాలని తెలిపారు. కేటీఆర్‌ ఓ అజ్ఞాని అని, తుపాకీ రాముడు అని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

bandi sanjaybreaking newscrime todayKCR should do challengeprajatantra epaperread news onlinetelugu articlestelugu vaarthalu
Comments (0)
Add Comment