కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమ లేదు… !

తన 25 ఏళ్ల ప్రస్తావించుకుంటూ ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ..25 ఏళ్ల రాజకీయం…చాలా పెద్ద ప్రయాణం. 1998 జనవరి 21న వాజ్‌ ‌పేయి, అద్వానీలను కలిశాను. నాకు బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయి. కరప్షన్‌ ‌లేని, క్రమశిక్షణ కలిగిన పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని నా నమ్మకం.  తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వొచ్చాను. నాకు పదవులపై ఆశ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కోరికే ఉండేది. ఆ రోజు సమైక్యవాద నాయకులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నారు. అందుకే సమైక్యవాదులతో పోరాడేందుకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టాను. ఆరోజు పార్టీని వీడినందుకు ఏడ్చాను. నాలుగున్నరేళ్లు పార్టీని నడిపి ఎన్నో సమస్యలపై పోరాడాను. ఆ సమయంలో ఒక రాక్షసుడు ఎదురయ్యాడు. తెలంగాణ పేరుతో ముసుగు కప్పుకుని వొచ్చి నమ్మించి మోసం చేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పూనుకున్నాడు.
విలీనం చేసినప్పటి నుండి నేను ఏనాడూ ప్రశాంతంగా లేను. టార్చర్‌ అనుభవించాను. ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఓడగట్టేందుకు కుట్ర చేశారు. 2013లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే అదేరోజు రాత్రి నన్ను సస్పెండ్‌ ‌చేశారు. నా తప్పేమిటో చెప్పలేదు. నాకు విముక్తి కలిగినందుకు ఆనందం వ్యక్తం చేశానే తప్ప బాధపడలేదు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ రాకూడదనే కేసీఆర్‌ ‌సహా చాలా మంది ఎంపీలు భావించారు. నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేసుకుంటా. ఈ ఒక్కసారి గట్టిగా పనిచేస్తే బీజేపీ అధికారంలోకి వొచ్చే అవకాశం ఉంది. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమ లేదు…తెలంగాణ సంపదపైనే కేసీఆర్‌ ‌కన్నేశాడు….ప్రజలు మేల్కోవాలి. మరోసారి అధికారం ఇచ్చారంటే అంతే..మీ భూములు లాక్కుంటారు. బండి సంజయ్‌ ‌నాయకత్వంలోనే మళ్లీ ఎన్నికల్లోకి పోతున్నాం.. మోదీ పీఎం అవుతారు. సంజయ్‌ ‌నాయకత్వంలోనే బీజేపీ అధికారంలోకి వొస్తుంది..అని పేర్కొన్నారు.
Comments (0)
Add Comment