కేసీఆర్‌ ‌మరోసారి గమ్యం ముద్దాడేనా..?

‘‘‌మరోవైపు ప్రాంతీయ పార్టీల నేతల మధ్య ఐక్యతను తీసుకురావడం అనుకున్నంత ఈజీ కూడా కాదు. విపక్ష పార్టీల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ప్రజల ముందుకు వెళ్లడం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ప్రజలను సంఘటిత పరచడం కేసీఆర్‌ ‌ముందున్న పెద్ద సవాల్‌. అన్నిటికీ మించి దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూ ఇన్నాళ్లుగా చెబుతూ వచ్చిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. అప్పులు పుట్టక ప్రాజెక్టులు పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి. మరోవైపు అభివృద్ధి పనులు బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, సర్పంచ్‌ ‌లు ఆందోళనకు దిగుతున్నారు.. ’’

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన లైన్‌ ‌చెప్పేశారు..! తెలంగాణ ఎజెండానే దేశ ఎజెండా కావాలని స్పష్టం చేశారు. అందుకోసం తాను రూపొందిస్తున్న కార్యాచరణలో తెలం గాణ ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. నీళ్లు నిధులు నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమం తరహాలో దేశ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ తరహా ఉద్యమం తీసుకురావాలనేది కెసిఆర్‌ ‌లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదవ ఏట అడుగుపెడుతున్న సందర్భంలో హైదరాబాదులో లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో సిఎం తన ఆలోచన ఏమిటో చెప్పారు. భవిష్యత్‌ ఉజ్వల భారతావని నిర్మాణానికి తెలంగాణ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కొన్నాళ్లుగా దిల్లీ బాట పడుతూ ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్న కేసీఆర్‌ ‌వివిధ వర్గాల మేధావులతో సమావేశం అవుతూ భారీగానే ఎక్ససైజ్‌ ‌చేశారు. ఫాం హౌస్‌ ‌కు రెగ్యులర్గా వెళ్తున్న కేసిఆర్‌ ‌రెస్ట్ ‌తీసుకుంటున్నాడని విపక్షాలు విమర్శించినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రం వైఖరి పైన ఒక్కో అంశాన్ని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో సమైక్య పాలకులు వివక్ష ప్రదర్శించి తెలంగాణకు అన్యాయం చేశారని ఫలితంగా స్వరాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని కెసిఆర్‌ ‌చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి చెందకుండా వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశానికే రోల్‌ ‌మోడల్‌ ‌గా మారిన తెలంగాణ పై వివక్ష ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

‘75 ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్య్రబాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది ? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి కాదు ముఖ్యం. అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి’ ఇది సిఎం కెసిఆర్‌ ఆకాంక్ష. విద్వేష రాజకీయాలతో దేశం విలవిలాడుతున్నది. మనాలాగే స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు సూపర్‌ ‌పవర్లుగా ఎదుగుతుంటే మనం కులాలు, మతాల కొట్లాటల్‌ ‌రాజకీయాలు తో కొట్టుకుపోతున్నం. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తులు ఇదేవిధంగా పెట్రేగి పోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. దేశ ప్రజలకు కావాల్సింది కరెంటు, మంచినీళ్ళు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు వ్యవహార శైలి పట్ల బేధాభిప్రాయాలు ఉండవచ్చు కానీ నీ ఆయన ఆకాంక్షలు మాత్రం వాస్తవ రూపం దాల్చాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా భారత్‌ ‌రూపొందాలనీ ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలు చెప్తున్నాయి. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే కేసీఆర్‌ ‌చెప్తున్న గుణాత్మక మార్పు సాధ్యమవుతుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెరుగుతూ ఉంది. బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసమూ ఉంది. అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయమని ప్రజలు భావించడం లేదు. వాస్తవానికి మన దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా. ఇది బిజెపి అధికారంలోకి రాకముందు సంగతి. కాంగ్రెస్‌ ‌డీలా పడిన సందర్భంలో కిచిడి ప్రభుత్వాలు ఏర్పడినా సుస్థిర పాలనను అందించలేక పోయాయి. ఇప్పుడా పరిస్థితి లేదు కూడా. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సుస్థిరతతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చెబుతున్నట్లుగా అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాల్సి ఉంది. పార్టీల మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉండాలి కానీ ప్రత్యర్థి పార్టీలుగా చూసే విధానం మంచిది కాదు. అన్ని ప్రాంతాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం విధానాలు ఉండాలని అందరూ అంటున్న మాట. కొన్నాళ్లుగా కెసిఆర్‌ ఇమేజిని డామేజ్‌ ‌చేసే ప్రయత్నం తెలంగాణలో జరుగుతున్నది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, సంయమనం కోల్పోయే నేతల తిట్ల పురాణం రాజకీయాలపై అసహ్యం కలిగేలా చేస్తున్నాయి. అవినీతి పరుడు కెసిఆర్‌ అం‌టూ సాక్షాత్తు ప్రధాని మోడీ తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్‌ ‌లో చేసిన ఆరోపణలు బిజెపి వర్సెస్‌ ‌టిఆర్‌ఎస్‌ … ‌కేంద్రం వర్సెస్‌ ‌రాష్ట్రం… మోడీ వర్సెస్‌ ‌కెసిఆర్‌గా మారిపోయింది. ఇన్నాళ్లూ విశ్వసనీయత లేని వాడు కెసిఆర్‌ అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అనే వారు. ఇప్పుడు అవినీతి పరుడు కూడా అంటున్నారు. తెలంగాణను దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రచారాన్ని కెసిఆర్‌ ఎలా తిప్పి కొడతారో చూడాలి.

మరోవైపు ప్రాంతీయ పార్టీల నేతల మధ్య ఐక్యతను తీసుకురావడం అనుకున్నంత ఈజీ కూడా కాదు. విపక్ష పార్టీల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ప్రజల ముందుకు వెళ్లడం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ప్రజలను సంఘటిత పరచడం కేసీఆర్‌ ‌ముందున్న పెద్ద సవాల్‌. అన్నిటికీ మించి దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూ ఇన్నాళ్లుగా చెబుతూ వచ్చిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. అప్పులు పుట్టక ప్రాజెక్టులు పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి. మరోవైపు అభివృద్ధి పనులు బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, సర్పంచ్‌ ‌లు ఆందోళనకు దిగుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మనది ధనిక రాష్ట్రం అని కేసీఆర్‌ ఆన్న మాటలను ఉటంకిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారన్న విమర్శలు జోరందుకున్నాయి. ఈ పరిస్థితిని సిఎం కెసిఆర్‌ ఎలా చక్కదిద్దుతారు అని ప్రజలు చూస్తున్నారు. అర్జంటుగా సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు సమకూ ర్చుకోవాలి. లేకపోతే కెసిఆర్‌ ‌కు పాలించడం రాదని ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే తెలంగాణ బాగు చేయలేని వాడు దేశాన్ని ఎలా ఉద్ధరిస్తాడు..అంటూ సాగే ప్రశ్నల పరంపరను సిఎం కెసిఆర్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది.ప్రధాని మోడీ తో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు తర్వాత అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని రాజకీయ పరిశీలకులు కేసీఆర్‌ ‌కు గుర్తు చేస్తూ ఉన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి ఉంది. ఇన్ని ప్రతికూలతలు, అడ్డంకులను అధిగమించి సిఎం కెసిఆర్‌ ‌తను అనుకుంటున్న లక్ష్యానికి ఎలా చేరుతారు. జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తారు అన్న విషయాల పట్ల రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment