కౌముది కుసుమం విరిసింది!

అంబరమంతా సంబరాలు
కౌముది కుసుమం విరిసిందని!
అంబుధి అంతా కేరింతలు
పున్నమి రేడు తనవాడేనని!
వేడి పుట్టించిన సూరీడు
చీకటి దివ్వెను చూసి
కాస్తంత సెద తీరాడేమో?
వెన్నెల చూపించిన అమ్మ
కమ్మటి బువ్వను తినిపించి
కొండంత మురిపించిందేమో?
మురిసిపోయిన కలువ
చంద్రిక రాకతో అలుక వీడిందేమో?
మదనుడు మల్లెలమాలల
సాయం అక్కరలేదన్నాడేమో!
జటాజూటధారి సిగలో
అఖండజ్యోతి దర్శనమేమో?
అమ్మలుగన్నయమ్మ మోములో
అల్లరిసిగ్గుల నిదర్శనమేమో?
యుగాంతాల తరబడి
నెలవెలుగు హేలల్లో
నేలంతా మురుస్తూనే ఉంది!
చంద్రబాల మాయాల్లో
అచ్చేరువు అవుతూనే ఉంది!

ఉషారం, 9553875577

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment