కాలంవెంట పరుగెడుతూ..

ఎంత పరుగెత్తినా అందడంలేదు.

జింకవెంట పులి పరుగుగెడుతున్నట్లు..

నింగినుండి జారుతున్న నీరులా..

తుపానులా మారి వీస్తున్న గాలిలా..

పరుగులుతీస్తూనే ఉన్న.

అయిన నా వేటకు చిక్కడం లేదు.

కనుచూపుమేర కూడా కనిపించడం లేదు.

జింక పులికి చిక్కాల్సిందే..!

నాకు విజయం ఎప్పటికైనా దక్కాల్సిందే..!

అందుకే అలసిపోని మనిషినై..

కాలం వెంట పరుగులు తీస్తూనేవున్న.

 

దేహంనిండా రంగులు పులుముకున్న.

అందమైన మనుషులున్నారు ఇక్కడ.

ఊసరివెళ్లిలా రంగులుమారుస్తూ…

పూటకో వేషం వేసే మహనటులున్నారు.

ఏ ఎండకు ఆ గొడుగుపట్టే..

మహా మోసగాళ్లకు కొదవలేదు ఇక్కడ.

నా తోటి మనుషులందరు గొప్పపుస్తకాలే నాకు.

వాళ్ళందరిని చదువుతూ…

గుణపాఠాలు నేర్చుకుంటూ..

పరుగులుతీస్తున్నాను కాలం వెంట.

 

కాలం నాపై ఎప్పుడూ కన్నెర్రజేస్తూనే ఉంటుంది.

నాలుగు చినుకులై వాన కురుస్తుందేమోనని ఆశ.

మేఘాల చాటున దాగిన మబ్బులై మురిపిస్తుంది.

తడి ఆరిపోయిన గుండెకు కాసింత …

నీటితడైన దొరుకుతుందేమోనని…

నా తనువునంత పిండేస్తున్నా.

దేహం నుండి స్వేదపు చుక్కలన్నీ రాలుతూ..

వరదకాలువలై పారుతున్నాయి.

ప్రవహిస్తున్న నీరంతా ఇపుడు..

ప్రయత్నం అనే విత్తులను తడుపుతున్నాయి.

 

అలసిన హృదయానికి ఇపుడు…

పచ్చని పలకరింత తోడైనట్లు..““2

విజయపు చిగురులు పూస్తున్నాయి.

ఏమూలనో దాక్కున్న నా ఆశల స్వప్నాలు..

ఇపుడు ఒక్కొక్కటిగా వరుసకట్టి

వరినాట్ల పైరులై చల్లని గాలిని వీస్తున్నాయి.

గడిచిన కాలమంతా గడ్డుకాలమే.

ప్రయత్నం అనే రెక్కలు తొడుక్కొని..

పరుగెడుతూనే ఉన్నా.. కాలం వెంట.

అందమైన మనుషుల మనసులను చదువుతూ.

నా గమ్యాన్ని ముద్దాడాలని.

అశోక్ గోనె

9441317361

ashok goneprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment