జూలైలో కాకతీయ ఉత్సవాలు

  • ప్రపంచానికి కాకతీయ కళావైభవం చాటుతాం
  • అధికారులతో మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌సమీక్ష
  • ఖిలాషాపూర్‌ ‌కోట నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి తెలిపేందుకు కేసిఆర్‌ ‌సంకల్పించి నట్లు మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. కాకతీయుల ఉత్సవాల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్న ఆయన ఉత్సవాలకు కాకతీయ వారసులను అధికారికంగా ఆహ్వానిస్తామన్నారు. వారోత్సవాల నిర్వాహణ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సవి•క్ష నిర్వహించారు. జూలై 7నుంచి ఏడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. పర్యాటకులకు మరింత సౌకర్యం కోసమే హరిత హోటల్స్ ‌ను ప్రైవేట్‌ ‌వాళ్లకు ఇచ్చామన్నారు. ఇక హైదరాబాద్‌ ‌తరువాత తెలంగాణలో అతి పెద్ద నగరంగా వరంగల్‌ ‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అనేక పరిశ్రమలను వరంగల్‌ ‌కు తెచ్చేందుకు కేటీఆర్‌ ‌కృషి చేస్తున్నారని చెప్పారు.

వారం పాటు కాకతీయ ఉత్సవాలుఘనమైన చరిత్ర కలిగిన నగరం వరంగల్‌ అని చీఫ్‌ ‌విప్‌ ‌వినయ్‌ ‌భాస్కర్‌ అన్నారు. గొలుసుకట్టు చెరువులలో సాగు, తాగు నీటి సమస్య లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఘనత కాకతీయులకే దక్కిందన్నారు. వారం పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. కాకతీయ వంశానికి చెందిన 22వరాజు అయిన కమల్‌ ‌చంద వాసుదేవ్‌ ‌ను కాకతీయ ను ఉత్సవాలకు ఆహ్వాని స్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయ కాలం నాటి సంప్రదాయాలు, పద్ధతులను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

జిల్లా పర్యటనలో భాగంగా అంతకుముందు మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌రఘనాధపల్లి మండలం ఖిలాపురం గ్రామంలో గల సర్వాయి పాపన్న కోట నిర్మాణ పనులను పరిశీలించారు. కోట కూలి ఇల్లు ధ్వంసమైన దళిత కుటుంబాలకు వారం రోజుల్లో ఇంటి స్థలం కేటాయించి ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి హావి•నిచ్చారు. అలాగే ఖిలాషాపూర్‌ ‌కోట అభివృద్ధి తరహాలో తాటికొండలోని పాపన్న కోటకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌పేర్కొన్నారు. సర్దార్‌ ‌సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల నాటికి కోట పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Kakatiya festivals in Julyprajatantra newstelangana updatesToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment