తెలంగాణ జాతిపితకు జేజేలు

‘తెలంగాణ ఆశా జ్యోతి
మహోద్యమ రథ సారధి

మానవ హక్కుల వారధి
ఉన్నత విలువల జీవనది

యావత్‌ ‌జాతికి మార్గదర్శి
కొత్తపల్లి జయశంకర్‌ ‌సారు

స్వరాష్ట్ర సాధన ధ్యేయంగా
సకలజన ఉన్నతి సమస్తంగా
నిత్య కృషిచేసిన దార్శనికుడు

తెలంగాణ పట్ల జరుగుతున్న
అన్యాయాలు అసమానతలపై
ధిక్కార స్వరమెత్తిన విప్లవుడు

తొలి,మలి దశ ఉద్యమాలకు
బాసటగా నిలిచిన ధీశాలుడు

యాచించే ధీనావస్థదశ నుంచి
శాసించే మహార్దశకు రావాలని
కలలు కన్న మహాస్వాప్నికుడు

ప్రత్యేక రాష్ట్ర  ఆవశ్యకతను
జగతికి తెలిపిన ప్రసంగికుడు

సాంబార్‌ ఇడ్లి గోబ్యాక్‌ అనే
నినాదామెత్తుకున్న దీరజుడు

తెలంగాణ చైతన్యం కోసం
గ్రంధాలు రచించిన జ్ఞానుడు

సిద్ధాంతకర్త సమరనిర్మాత
వ్యూహకర్త ప్రధానాచార్యగా
బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించి
జగత్ప్రసిద్ధికెక్కిన చరితుడు

జాతిపిత జయశంకర్‌ ‌సారు
సకలజనుల హృదయాలలో
స్ఫూర్తి దీపమై  ప్రజ్వలిస్తాడు

తెలంగాణ చరిత్ర పుటల్లో
సువర్ణాక్షరమై ప్రకాశిస్తాడు

(ఆగస్టు 6న ప్రొ!! జయశంకర్‌ ‌జయంతి సందర్బంగా అక్షరప్రణతి నివేదిస్తూ..)
 – కోడిగూటి తిరుపతి, 9573929493

JJ to the father of the nation of Telangana
Comments (0)
Add Comment