డేంజర్‌ ‌జోన్‌లో జనగామ…!

తప్పిదం ఎవరిది…? ఎవరినీ వదిలిపెట్టని కొరోనా…!

కొరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టగం లేదు. సర్వత్రా భయం…పోలీస్‌, ‌రెవెన్యూ, ప్రజాప్రతినిధులు, వ్యాపారులను, సామాన్య ప్రజలను సైతం వదిలిపెట్ట కొరోనా వదలడం లేదు. మార్చి 22నుండి నేటి వరకు కొరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం విధితమే. ఆరంభంలో జిల్లాలోని నర్మెట మండలంలోని వెల్దండ గ్రామానికి చెందిన మటన్‌ ‌వ్యాపారి ఖాజుద్దీన్‌, ‌జనగామ డీఆర్‌డీఏలో పనిచేసే ఉద్యోగి ఖాజాలు ఢిల్లీలోని మర్ఖజ్‌ ‌యాత్రకు వెళ్లి రాగా వారికి కొరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ ‌వచ్చింది. వెంటనే జిల్లా యంత్రాంగం వైరస్‌ను నియంత్రించడంతో కొరోనా కట్టడి అయినట్లు కనబడి తిరిగి విజృంభించింది. వెల్దండ మటన్‌ ‌వ్యాపారి వద్ద ఉగాది నాడు మటన్‌ ‌తీసుకెళ్లిన 73మందిని గుర్తించి వారిని జనగామ సోషల్‌ ‌వెల్ఫేర్‌ ‌పాఠశాలకు తరలించి పరీక్షలు నిర్వహించి కొరోనా నెగిటివ్‌ ‌రావడంతో తిరిగి వారిని పంపించడం జరిగింది. అలాగే ఉద్యోగి ఖాజా కుటుంబాన్ని గాంధీ హాస్పిటల్‌కి తరలించి పరీక్షలు నిర్వహించి తిరిగి వారి ఇంటికి వారిని పంపించడం జరిగింది. అంతటితో కొరోనా కట్టడి అయిందని జిల్లా యంత్రాంగం సంతోషంగా ఉన్న అనతికాలంలోనే తిరిగి వైరస్‌ ‌వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలలో భయం నెలకొంది. జనగామలోని జేకేఎస్‌ ‌యజమాని సంతోష్‌కు కొరోనా పాజిటివ్‌ ‌వొచ్చి అతను నిర్లక్ష్యం వహించడంతో అందులో పనిచేసే కార్మికులకు, మిగతా యజమానులకు వైరస్‌ ‌సోకింది. అంతవరకే పరిమితం కాకుండా సుమారు 2వేల మంది రైతులు ఆ షాపు నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన వారిని కూడా ప్రైమరీ కాంటాక్ట్ ‌కింద అనుమానించడం జరిగింది. దీంతో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు కొరోనా పాజిటివ్‌ ‌రావడం మొదలైంది. ప్రస్తుతం జనగామలో కొరోనా పరీక్షలను నిర్వహిస్తే వేలసంఖ్యలోనే ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. వైరస్‌ ‌సోకి జిల్లా కేంద్రంలో నలుగురు, మండల కేంద్రాలలో మరో నలుగురు మృతిచెందినట్లు ప్రచారం జరిగింది. దీంతో జనగామ డేంజర్‌ ‌జోన్‌లోకి వచ్చిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, పోలీసులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు నిద్రాహారాలు లేక కొరోనా కట్టడి చేయగా జేకేఎస్‌ ‌వ్యాపారుల అలసత్వంతో తిరిగి వైరస్‌ ‌విజృంహించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే కాకుండా వేరే ప్రాంతం నుంచి జనగామ మీదుగా వెళ్లే వారితో కూడా వైరస్‌ ‌వ్యాప్తి చెందిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. హైధరాబాద్‌లో లాక్‌డౌన్‌ ‌పాటించగా అక్కడ ఉండే వారంతా జనగామ మీదుగా వెళ్లేవారని అంతేగాకుండా జీవనోపాధి లేక జనగామ నుంచి ప్రతినిత్యం రాష్ట్ర రాజధానికి వెళ్లివచ్చేవారితోనే ఈ ప్రమాదం పొంచిఉందని చర్చ కూడా జరిగింది. మొదటి లాక్‌డౌన్‌లో సుదూర ప్రాంతమైన ముంబై, మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ ‌లాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కొరోనా విజృంభించిందనే ప్రచారం కూడా జరిగింది. మరొక తప్పిదం ఏమిటంటే కొరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తామని అధికారులు ప్రకటించడంతో లక్షణాలు కనిపించే వరకు మరికొంత మందికి వ్యాపించడంతో అదుపు తప్పిందనే వాద•న కూడా ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ప్రజలు కూడా స్వీయనియంత్రణ, మాస్క్‌లు వంటివి ధరించకుండా విచ్చలవిడిగా తిరుగడం వల్లే కట్టడి కాలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కిరాణ, బట్టల, కూరగాయల, పెట్రోల్‌ ‌బంక్‌లు, ఫర్టిలైజర్‌ ‌షాపులు, బ్యాంకుల, వైన్స్‌షాపుల వద్ద తండోపతండాలుగా గుమిగూడడం వల్ల కూడా వ్యాధి నిరోధించలేని స్థాయికి పోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. నియంత్రణ లేకపోవడం, వివాహ, శుభ, అశుభ కార్య వేడుకలలో గుంపులు గుంపులుగా వందలాది మంది గుమికూడడంతో వైరస్‌ ‌మరింత విజృంభించింది. పరీక్షలను నిర్వహించకపోవడంతో అదుపు తప్పడమే గాకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల శంకుస్థాపనలు, అభివృధ్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు, ప్రతిపక్ష నాయకులు చేపట్టిన ధర్నాలకు, రాస్తారోకోలకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం వల్లనే కొరోనా వ్యాప్తి చెందిందనే విమర్శలు వెలెవెత్తాయి.

ప్రభుత్వానిది బాధ్యత కాదని లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ప్రజలు ఇష్టానురీతిలో వ్యవహరించడంతో నేడు జనగామకు ఈ దుస్థితి పట్టింది. ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్‌ ఎలాంటి భయం లేకుండా ప్రతి నిత్యం పల్లెలు, పట్టణాలలో పర్యటిస్తూ కొరోనా కట్టడి చేయాలని సలహాలు, సూచనలు అందిస్తూనే ఉన్నారు. పోలీస్‌ అధికారులు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, ‌సీఐలు మల్లేష్‌ ‌యాదవ్‌, ‌సంతోష్‌ ‌కుమార్‌, ‌రాజిరెడ్డి, బాలాజి, రమేష్‌నాయక్‌లతోపాటు ఎస్‌ఐలు, పోలీస్‌ ‌సిబ్బంది, వైద్య సిబ్బంది ఆర్డీవోలు మధుమోహన్‌, ‌రమేష్‌, ‌తహశిల్దార్లు ప్రతినిత్యం •ఒరోనా కట్టడికి కృషి• చేస్తున్నప్పటికి చేయి దాటిపోయింది. ఇందుకు పరీక్షలు నిర్వహించకపోవడం ఒక కారణమైతే, మరొకటి విచ్చలవిడిగా తిరుగడమే. నాలుగు నెలలలో కట్టడిగాని కొరోనా పట్టణాల నుండి పల్లెల వరకు పాకడం జరిగింది. ప్రస్తుతం తరిగొప్పుల మండలం స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ‌ప్రకటించుకోవడం గమనార్హం. ఇప్పటికీ కొరోనా కట్టడి చేయకపోతే ఏ శాఖ అధికారి కూడా విధులకు రారనే ప్రచారం కూడా జరుగుతుంది. బ్రతికుంటే బలుసాకు తినవచ్చు, చస్తే తమ కుటుంబ పరిస్థితి ఏంటనే భయంలో కూడా రోజురోజుకు అధికారుల ముందు సవాల్‌గా నిలిచింది. ప్రజలకు కంట్రోల్‌ ‌చేయాల్సిన పోలీస్‌లకే కొరోనా భయం వెంటాడుతుందని సమాచారం. వారుగనుక వెనకడుగు వేస్తే జిల్లా పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇద్దరితో మొదలైన కొరోనా సంఖ్య రోజురోజుకు పెరిగి వందలు, వేలలోకి చేరడం జిల్లాను ఆందోళనకు గురిచేయడమే గాకుండా డేంజర్‌ ‌బెల్స్ ‌మోగేందుకు సిద్ధంగా ఉందని అంగీకరించక తప్పదు.

janagama in Danger Zone
Comments (0)
Add Comment