జగన్‌ ‌సంక్షేమ పాలనకు అద్దంపట్టిన ఫలితాలు

  • వైసిపి ఖాతాలో 98 శాతంపైగా ఫలితాలు
  • డియా సమావేశంలో సలహాదారు సజ్జల

అమరావతి,సెప్టెంబర్‌ 24 : ‌పరిషత్‌ ‌ఫలితాలతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 98 శాతానికి పైగా స్థానాల్లో వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ గెలుపొందిందని, భారతదేశ చరిత్రలో ఇదొక రికార్డుగా చెప్పవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకు ఈ ఫలితానే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..  సీఎం జగన్‌ ‌పాలను ప్రజలు విశ్వసించ బట్టే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. పదవుల్లో అని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

పార్టీతోపాటు నేతలంగా క్రమశిక్షణగా ఉన్నారన్నారు.జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 69.55 శాతం ఓట్లు వచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 64.8 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. టీడీపీ తప్పుడు విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని, చంద్రబాబు కుట్రలను ప్రజలు నమ్మడం లేదని మండిపడ్డారు. కుప్పంలోనే టీడీపీ బోర్లా పడిందని, కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును విశ్వసించడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్ని అడ్డగోలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదని, ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికే ఎల్లో డియా పరిమితమైందని విమర్శించారు. మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పక్రియ కొనసాగుతోందని, సుధీర్ఘ ఎన్నికల పక్రియ ఈ రోజుతో ముగుస్తుందన్నారు.  రేపు జిల్లా పరిషత్‌ ‌పక్రియ కూడా ముగుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా పార్టీ, ప్రభుత్వం వైపు నుంచి తమ బాధ్యత ఎంతగా పెరిగిందో స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇంత విజయం సాదించినప్పుడు నాయకత్వం కోసం పోటీ సహజంగా జరిగేదేనని తెలిపారు. తమ పార్టీ బడుగు వర్గాలకు పెద్ద పీట వేస్తోందని, మొత్తంగా పరిశీలిస్తే భేదాభిప్రాయాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షం,ఒక వర్గం డియా ఆశించినట్లుగా లేదని, పూర్తి క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని పేర్కొన్నారు.

Comments (0)
Add Comment