ఆర్యన్‌ ‌ఖాన్‌ ‌బెయిల్‌కు అనర్హుడా…?

చట్టంలోని సెక్షన్‌ 35. ఇది ‘‘అపరాధం చేయాలనే మానసిక స్థితి కలిగి ఉండటం అనే ఊహ’’ నియమాన్ని వివరిస్తుంది. అంటే ఎన్‌డిపిఎస్‌ ‌చట్టం కింద అరెస్టయిన నిందితుడు ఉద్దేశ్య పూర్వకంగా నేరం చేసినట్లు NDPS చట్టం అమలు చేసే అధికారులు భావిస్తారు. అతను లేదా ఆమెపై అభియోగాలు మోపబడిన డ్రగ్స్ ‌సంబంధిత నేరంకి సంబంధించి నిందుతులకి తెలుసనీ పూర్తీ అవగాహనతో నేరం చేశారు చట్టం భావిస్తుంది. అంచేత నిందితుడు బెయిల్‌ ‌పొందాలి అంటే కోర్టు ముందు తనకు ‘‘నేరం చేయాలనే మానసిక స్థితి’’ లేదని నిరూపించుకోవాలి.

బాలీవూడ్‌ ‌నటుడు షారుక్‌ ‌ఖాన్‌ ‌కొడుకు ఆర్యన్‌ ‌కు బెయిల్‌ ఎం‌దుకు దొరకటం లేదంటే..   రాజ్యాం గంలోని  ఆర్టికల్‌ 21 ‌జీవించే మరియు స్వేచ్ఛా హక్కు భారత ప్రజలకి ఇస్తుంది. దీని    అమలు కోసం సుప్రీం కోర్టు 1970 లలో ఒక చట్టపరమైన సిద్ధాంతం రూపొందించింది. దీని ప్రకారం బెయిల్‌ ఒక నియమం, జైలు మినహాయింపు. ఈ సూత్రాన్ని అమలు చేస్తూ క్రిమినల్‌ ‌ప్రొసీజర్‌ ‌కోడ్‌ CrPC) లోని సెక్షన్‌ 439 ‌ప్రకారం నేరం చేసిన వ్యక్తికి కోర్టులు బెయిల్‌ ‌మంజూరు చేస్తూ వస్తున్నాయి.  అయితే, డ్రగ్స్ ‌కేసులో, ఈ చట్టపరమైన సిద్ధాంతం రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.

మాదకద్రవ్యాల సంబంధిత కేసులు నార్కోటిక్‌ ‌డ్రగ్స్ అం‌డ్‌ ‌సైకోట్రోపిక్‌ ‌సబ్‌స్టాన్స్ (NDPS) చట్టం 1985 కిందకి వస్తాయి. మాదకద్రవ్యాల సాగు, డాగ్స్ ‌వినియోగం, తక్కువ నిషా ఉన్న డ్రగ్స్ ‌వినియోగం, డ్రగ్స్ అమ్మకం లేదా లావాదేవీలుNDPS చట్టం కింద జాబితా చేయబడిన నేరాలు.

ఎన్‌డిపిఎస్‌ ‌చట్టం ప్రకారం నేరస్థుడిని జైలు నుండి పునరావాస కేంద్రానికి పంపడం వరకు, ఒక సంవత్సరం కాలం జైలు శిక్ష మరియు జరిమానా వరకు ఈ చట్టం ద్వారా శిక్షను ఖరారు చేయవచ్చు.

NDPS చట్టంలోని సెక్షన్‌ 37 ‌డ్రగ్స్ ‌కేసులో అరెస్టైన నిందితుడికి బెయిల్‌ ‌మంజూరు చేసే నియమాలను నిర్ధారిస్తున్నది. ఈ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడిన వ్యక్తిని ‘‘బెయిల్‌పై లేదా అతని స్వంత బాండ్‌పై విడుదల చేయకూడదు. బెయిల్‌ ‌లేదా స్వంత బాండ్‌ ‌లపై విడుదల కోసం నిందితుడు దరఖాస్తు ప్రయత్నం చేస్తే పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌వ్యతిరేకించడానికి NDPS చట్టంలోని సెక్షన్‌ 37 అవకాశం ఇస్తుంది.

పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌దరఖాస్తు తిరస్కరణకు గురి అయ్యేది ఎప్పుడంటే నేరస్తుడు నేరానికి పాల్పడలేదని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని కోర్టు సంతృప్తి చెంది, బెయిల్‌ ‌దొరికితే నేరస్తుడు ఏ నేరం చేయనని కోర్టుకి నమ్మకం కలిగిస్తే కానీ ముద్దాయికి బెయిలు దొరకదు.

సరళంగా చెప్పాలంటే, ఒకవేళ ముంబై క్రూయిజ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో పోలీసులు లేదా నార్కోటిక్స్ ‌కంట్రోల్‌ ‌బ్యూరో NCB) కోర్టుకు బెయిల్‌ ‌మంజూరు చేయడం వలన కేసు దర్యాప్తుకు ఆటంకం కలగవచ్చని కోర్టుకు చెబితే… తన నిర్దోషిత్వాన్ని నిరూపిం చుకోవడం అనేది నిందితుడి బాధ్యత అయిపోతుంది. సరిగ్గా ఇదే ముంబై డ్రగ్స్ ‌కేసులో జరుగుతున్నది. ఈ కేసులో బాలీవుడ్‌ ‌నటుడు షారూఖ్‌ ‌కొడుకు ఆర్యన్‌ ‌ఖాన్‌ ‌సహా మరో 20 మంది అక్టోబర్‌ 3 ‌నుండి కస్టడీలో ఉన్నారు. వీరందరూ తమ నిర్దోషిత్వాన్ని సొంతంగా నిరూపించుకోవటం చేసి కోర్టు నమ్మేలాగా చేసుకుంటేనే బెయిల్‌ ‌వస్తుంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 22 ‌న, అలహాబాద్‌ ‌హైకోర్టు ఒక నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలహాబాద్‌ ‌హైకోర్టు నిందితుడికి బెయిల్‌ ఇవ్వటానికి కారణం, ఎన్‌డిపిఎస్‌ ‌చట్టం కింద అభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి, అయితే సదరు వ్యక్తి దోషి కాదని నమ్మడానికి ‘‘సహేతుకమైన కారణాలు’’ నిస్సందేహంగా వున్నాయి అని అలహాబాద్‌ ‌హైకోర్టు నమ్మింది.

ఆర్యన్‌ ‌ఖాన్‌ ‌కేసు లాగానే, డిఫెన్స్ ‌కౌన్సెల్‌ ‌నిందితుడి వద్ద నుండి ఎలాంటి డ్రగ్‌ ‌రికవరీ కాలేదని  ఉత్తర ప్రదేశ్‌ ‌కేసులోని నిందితుడు శరీరంపై ఎలాంటి డ్రగ్స్ ‌గాట్లు కనిపించలేదని వాదించారు.

జస్టిస్‌ ‌డివై చంద్రచూడ్‌ ‌మరియు బివి నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది.  ‘‘హైకోర్టు ప్రతివాదికి సంబందించిన వ్యక్తిపై నిషేధిత డ్రగ్స్ ‌గాట్లు కనిపించక పోవటం అనేది పరిశీలన స్థాయికి సరిపోదని మేము అభి ప్రాయ పడ్డాము.అంచేత NDPS చట్టంలోని సెక్షన్‌ 37  (1) (b) (ii) కింద పరిశీలన చేయవలసిన అవసరం వుంది.’’

ఈ చట్టాలలో ఇంకా చాలా అంశాలు  ఉన్నాయి.NDPS చట్టంలోని సెక్షన్‌ 35. ఇది ‘‘అపరాధం చేయాలనే మానసిక స్థితి కలిగి ఉండటం అనే ఊహ’’ నియమాన్ని వివరిస్తుంది. అంటే ఎన్‌డిపిఎస్‌ ‌చట్టం కింద అరెస్టయిన నిందితుడు ఉద్దేశ్య పూర్వకంగా నేరం చేసినట్లు NDPS చట్టం అమలు చేసే అధికారులు భావిస్తారు. అతను లేదా ఆమెపై అభియోగాలు మోపబడిన డ్రగ్స్ ‌సంబంధిత నేరంకి సంబంధించి నిందుతులకి తెలుసనీ పూర్తీ అవగాహనతో నేరం చేశారు చట్టం భావిస్తుంది. అంచేత నిందితుడు బెయిల్‌ ‌పొందాలి అంటే కోర్టు ముందు తనకు ‘‘నేరం చేయాలనే మానసిక స్థితి’’ లేదని నిరూపించుకోవాలి.

ముంబైలోని డ్రగ్స్ ‌బస్ట్ ‌కేసులో నిందితులందరినీ అదుపులో ఉంచడం కోసం ఎన్‌సిబి వెర్షన్‌ ‌ప్రకారం ఎన్‌డిపిఎస్‌ ‌కోర్టు ఎందుకు ముందుకు వెళ్లింది అనేది NDPS చట్టంను పరిశీలిస్తే  మనకు స్పష్టంగా అర్ధం అవుతున్నది.

– అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ.

Aryan Khanbailineligible
Comments (0)
Add Comment