ఇప్పటికైనా కళ్ళుతెరువమ్మా

అమ్మ మనీషా
మనువు చెక్కిన మానవ మృగాలు మధ్య
భద్రత లేని బతుకు లు ఎప్పుడు
తెల్లారుతాయోననే
భయం భయంగా గడిపిన రోజులే కదా
బుసలు కొట్టే విషపు నాగులు
మాటువేసి కాటువేసే  కాలమున మహిళకు రక్షణ లేదమ్మా
తల్లి స్తన్యాన్ని గ్రోలిన నీచులు
ఆడపిల్లలను చూస్తే అమ్మ తనమును మరిచి అధములు గా
మారుతున్న రమ్మా
నీ ఆశలు సౌధాన్ని కూల్చిన పాపం ఎవడిదంటే
కళ్ళు లేని న్యాయదేవత కలవరపడుతుందమ్మా
వికృత వ్యవస్థ కు జనించిన అక్రమార్కుల రక్షణకై ఆరాటపడుదమ్మా
వేదాలు పుక్కిట బట్టిన పుణ్యభూమి కదమ్మా
వాదాలకు తావియ్యక
న్యాయాన్ని నుండి బజారులో అమ్మేస్తుందమ్మా
అయినా
మన భరతమాతకు ఎంత సహనమ్మా
రాయాలంటేనే నాచేతులు వణుకుతున్నాయి

నీ నాలుకను  తెగ గోస్తున్న నీచులను చూస్తూ
అంతరాయిలా మారిందేమమ్మా
మనిషి మనిషికి మధ్య ఈ వివక్ష
ఇంకె న్నాళ్ళు
అమ్మా భారతమ్మా
కుట్రలతో కులాలను నీ  కొంగుకు ముడేసిన
నీవు కొమ్ము కాస్తున్నదెవరికమ్మా
మనీషాకు జరిగిన ఘోరం
మా గుండెలను పిండేస్తున్న
నీ స్పందన ఏదమ్మ
కూడు లేని కులములో పుట్టినందుకు
పాడెగట్టడమే పాడియనుకున్నావా
నిర్భయ దిశల పట్ల నీవు చూపిన అనురాగం
మనీషా పట్ల మాయమైనదేమమ్మా
నిమ్న కులాల్లో జనించిన ఎన్ని ముత్యాలు
నీ మెడలో హారాలై మెరువలేదూ
ఇప్పటికైనా కళ్ళు తెరువమ్మా
నీ మౌనం మనీషా లాంటి మరో
ముత్యాన్ని కోల్పోయే అరాచకానికి అంకురార్పణ కానియ్యకు
– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 9494789731

Comments (0)
Add Comment