‘‘మత్తు సేవిస్తున్న వారిలో అధిక శాతం యువత ఉన్నట్లు పలు నివేదికలలో వెల్లడైంది. మత్తుకు బానిసై మానసిక కుంగుబాటుకు లోనై బలవన్మరనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా యువతను పెడదోవ పట్టిస్తున్నది పబ్ లనే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మద్యం మత్తులో రోడ్లపై పరిమితికి మించి స్పీడ్ లో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతూ తర్వాత కటకటాల పాలు అవుతున్నారు.’’
దేశ యువత మద్యం మత్తులో తూలుతూ పబ్ ల వెంట తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో శాంతి, అహింసల ద్వారా ముందుకు పోయి బానిస సంకెళ్లను తెంచుకుని బ్రిటిష్ వలసవాద పాలన నుండి విముక్తి పొందారు. ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమకారుల నుండి నేటి రాజకీయ నాయకుల వరకు నినాదం ఒక్కటే దేశ భవిష్యత్తు యువకుల చేతిలో ఉందని.. దానిలో వాస్తవం లేక పోలేదు..! ఎందుకంటే ప్రపంచ ప్రతి వంద మందిలో ఒక భారతీయుడు ఉన్నాడు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసి భయ పడుతున్నాయి. మనం ఇతర దేశాలపై దాడి చేస్తామని కాదు.. మన దేశం శాంతి, అహింసకు పెట్టింది పేరు. కానీ.. దేశ యువకులు అనుకుంటే రాజకీయ, సామాజిక, ఆర్థికంగా దేశాన్ని అగ్రగామిగా నిలుప వచ్చు.. దీంతో ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తుందని భావిస్తున్నాయి. కానీ మన దేశ యువత మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి పబ్ లు బార్లలో గడుపుతున్నారు. పబ్ యాజమాన్యాలు యువతను ఆకర్షించడానికి విదేశి అమ్మాయిలతో డ్యాన్స్ లు ఆడిస్తూ అధిక సంపాదనకు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయి. బర్త్ డే ల పేరిట అర్థ రాత్రి దాకా చిందులు వేస్తూ డగ్స్ ఆనవాళ్లు పబ్ లో దొరికిన పరిస్థితిని చూశాం.
దాంట్లో కూడా ప్రముఖుల పిల్లలు ఉండటం గమనార్హం.. ఆ కేసు విచారణ మొదలు కాకమందే మరో పబ్ లో సెలబ్రేషన్ అనంతరం మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగడం నిందితులలో మైనర్లు కూడా ఉండటం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేసింది. అంతకు ముందు జరిగిన పార్టీకి హాజరైన వారిలో సగం మంది పైగా ఇంటర్ మీడియట్ పిల్లలు ఉండటం పబ్ లలో మైనర్ ల అనుమతిపై పోలీసులు ఆరా తీశారు. మిగతా పబ్ లపై తనిఖీలు మమ్మరం చేస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం.. వారి వ్యక్తిత్వ వికాసం పెంపొదడానికి మనం ఏం చేస్తున్నాం.. వారి ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి..? పిల్లలకు కావాలసిన వస్తువులు చదువు నేర్పిస్తే సరిపోతుందా ? దేశం కోసం ఉపయోగపడాలని ఎవ్వరు చెప్పడం లేదు.. ఎందుకంటే భయం పిల్లలు సమాజ సేవకు అంకితమై పోతారని. దేశానికి సేవ చేయాలని తపన ఉంటే మొదట సేవ చేసేది సమాజంలో గౌరవం తీసుకు వచ్చేది మీ కుటుంబానికే అని గమనించండి. పిల్లలకు మంచిని బోధించండి. వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది. పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పిల్లలు విద్యా రంగంలో రాణించాలంని తల్లి దండ్రులు సాంకేతిక మాధ్యమాలు అందుబాటులో ఉంచుతున్నారు. దాంతో పిల్లలు వీడియో గేమ్స్, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారని పలు నివేదికలు తెలుపుతున్నాయి.
అదే కాకుండా ఆన్ లైన్ వేదికగా సైబర్ నేరాలు, డగ్స్ మాఫియా యువతకు వల వేస్తూ మత్తు వైపు ఆకర్షిస్తుంది. పిల్లల చదువుకు సకల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తల్లి దండ్రులది. ఏ తల్లి దండ్రులు అయినా పిల్లల స్వేచ్ఛ కోరుకుంటారు.. దానిలో తప్పు లేదు కానీ, అది శృతి మించితేనే ఊహించరాని అనర్థాలు జరుగుతాయి అని అనేక సందర్భాలలో చూస్తునే ఉన్నాం. పిల్లలను పద్ధతిగా పెంచాల్సిన కర్తవ్యం తల్లిదండ్రులపై ఉంది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారిలో చాలా వరకు మత్తుకు బానిసైన వాళ్ళే ఉన్నారు. దేశంలో మహిళల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకు రావడం జరిగింది అయినా స్త్రీలపై దాడులు ఆగడం లేదు. దానికి ప్రధాన కారణం మత్తు. ప్రపంచ మాదకద్రవ్యాల దురలవాటు అక్రమ రవాణ వ్యతిరేక దినం 1989 జూన్ 26 ప్రతి సంవత్సరం పాటించుట ఆనవాయితీ అయింది. దేశంలో మాఫియా మహిళలను మత్తుకు బానిసలుగా చేసి ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తూ మరి కొంత మందిని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. వీటి నియంత్రణకు ప్రభుత్వాలు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
వాటి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమారాలను ఏర్పాటు చేసి అధికారులతో ఎప్పుడు పర్యవేక్షిస్తుంది. నేటి యువత పెడదారి పట్టకుండా వారికి మానసిక వ్యక్తిత్వ వికాసానికి క్లాసులు నిర్వహిస్తూ వారి నైపుణ్యాన్ని వెలికి తీసి వారికి ఆసక్తి ఉన్న రంగంలో నిరంతరం శిక్షణ ఇచ్చి వారి సంక్షేమానికి బాటలు వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను నిరంతరము పరిశీలిస్తూ ఉండటం ద్వారా పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండేట్టు చూడవచ్చు. మత్తు పానీయాలకు ఎక్కువగా అధిక డబ్బు ఉన్న వాళ్ళు, ప్రముఖుల పిల్లలు, సెలబ్రిటీలు వాడుతున్నట్లు చాలా సందర్భాల్లో చూశాము. వాటి నియంత్రణకు ఉన్నత అధికారులు దృష్టి సారించారు. వీటి వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ ఉంది. వీటిని ఎవ్వరు ప్రోత్సహించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మత్తు సేవిస్తున్న వారిలో అధిక శాతం యువత ఉన్నట్లు పలు నివేదికలలో వెల్లడైంది. మత్తుకు బానిసై మానసిక కుంగుబాటుకు లోనై బలవన్మరనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా యువతను పెడదోవ పట్టిస్తున్నది పబ్ లనే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మద్యం మత్తులో రోడ్లపై పరిమితికి మించి స్పీడ్ లో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతూ తర్వాత కటకటాల పాలు అవుతున్నారు. నేడు పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యువత కూడా మార్పు చెందాలి. ఈ పోటీ ప్రపంచంలో కాలంతో యువకులు పరుగు తీయాలి.. అప్పుడే ఎన్నుకున్న లక్ష్యం చేరగలము. మత్తు నియంత్రణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరామ కృషి చేస్తున్నాయి.. దానికి తోడు పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది.