పతనం దిశగా భారత పార్లమెంటరీ వ్యవస్థ…

‘‘అత్యున్నత వ్యవస్థ గా పిలువబడిన పార్లమెంట్‌ ‌మోదీ కాలంలో చర్చలు, కమిటీ లు లేకుండా తమకు నచ్చిన పద్దతుల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ చట్టాలను చేస్తున్నారు.వివిధ సందర్భాలలో అధికార,ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యే లు 360 మందికి  పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఏ.డి.ఆర్‌(అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌డెమోక్రటిక్‌ ‌రిఫార్మస్)అనే ఎన్‌.‌జి.ఓ తన నివేదికలో తెలిపింది.ఇందులో బిజెపి ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది.బిజెపి ఎంపిలు,ఎమ్మెల్యే లు బహిరంగంగా ఇతర మతాలను కించె పరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై,హత్యా, నేర చరిత్ర తమకు ఉన్నదని స్వయంగా ప్రకటించిన వారిపై,ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పన్ను ఎగవేత దారులకు,ఆర్ధిక నేర గాళ్ళ పైన చర్యలు తీసుకోకపోగా వారికి రక్షణ చర్యలు కల్పిస్తుంది.’’

భారతదేశం  ఔన్నత్యం ఈ దేశ పార్లమెంటరీ వ్యవస్థ పై ఆధారపడి ఉంది.న్యాయమైన,పారదర్శకమైన న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పునాది.ప్రపంచంలోనే భారతదేశ ప్రజాస్వామ్యం వైవిధ్యమైనది.ప్రతిపక్ష పార్టీల పాత్ర పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది.ఈ దేశ స్వాతంత్య్రనాంతరం ‘పాలకులు’ ముక్కలు చెక్కలు కాకుండా వైవిధ్యమైన భారతదేశాన్ని కలిపి ఉంచగలిగేలా చేసింది ఈ దేశ పాలకుల దీర్ఘ దృష్టి ఆలోచనలు.2014 కంటే ముందు భారతదేశంలో స్వేచ్ఛాయుత పత్రికలు, ఉల్లాసంగా చట్టసభలు,పౌర సమాజ సంస్ధలు, కార్మిక సంఘాల విస్తరణయే అభివృద్ధి గా భారతీయులు చూశారు.అలాంటి భారతదేశ ప్రజాస్వామ్యం నేడు మోదీ పాలనలో ప్రమాదంలో పడింది.లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో వలస కార్మికులు ప్రయాణం చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇంచెత్తు ఔదార్యం చూపకుండా వారి పట్ల వివక్ష చూపింది.వ్యవసాయ సంక్షోభం,పెరుగుతున్న నిరుద్యోగం,దాని సంకీర్ణ భాగస్వాములను నిర్వహించలేకపోవడం,పెద్ద నోట్ల రద్దు,ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం,గూడ్స్ అం‌డ్‌ ‌సర్వీస్‌ ‌టాక్స్ (‌జి.ఎస్‌.‌టి)  తొందరపాటు,పేలవమైన అమలు,ప్రబలంగా ఉన్న మతపరమైన సమ్మెలు వంటి అనేక సమస్యలతో కేంద్రం సతమవుతుంది.ఈ దేశ ప్రజల సంపదను తన అననూయులకు కట్ట బెడుతున్న తీరును హిండెన్‌ ‌బర్గ్ ‌నివేదిక  ‘ఆర్థిక దోపిడీని’ బట్ట బయలు చేసి భారతదేశం ముందు దోషిగా నిలబెట్టింది.అన్ని రాష్ట్రాలలో తమ పార్టీ ప్రాబల్యం కోసం అక్కడి ప్రభుత్వాలను కూలదోసి అస్ధిర పాలనకు పాల్పడ్డారు.ఈ వికృతమైన చర్యలను మదర్‌ ఆఫ్‌ ‌డెమోక్రసీ అని మోదీ ప్రగల్భాలు పలుకుతున్నారు.

ప్రగల్భాలు తప్ప ప్రజాస్వామ్య విలువలు ఏవి.?
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశం ఎన్నడూ చూడనంత దారుణమైన మత అల్లర్లకు అధ్యక్షత వహించారు.దోషులను ప్రాసిక్యూట్‌ ‌చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు ఆయనను పదే పదే తప్పుపట్టింది.అప్పటి ప్రధానమంత్రి  అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి గోద్రా మరియు గోద్రా అనంతర సంఘటనలను’’అనాగరికం.. అమానవీయం’’గా అభివర్ణించారు.ఏప్రిల్‌ 2002‌లో పనాజీలో జరిగిన బిజెపి కార్యవర్గ సమావేశంలో  వాజ్‌పేయి తన రాజ ధర్మానికి కట్టుబడి ఉండమని మోదీ కి పిలుపునిచ్చారు.ఇదే సందరర్భంలో ఒక పాలకుడు మతం,లేదా కులం ఆధారంగా తన ప్రజల మధ్య వివక్ష చూపకూడదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవికి మోదీ రాజీనామా చేయాలన్నారు.తన స్వంత పార్టీలో మోదీ నాయకత్వం పైన సరియైన మంచి ధృఫకథం లేదనే చెప్పాలి.

ఆర్థిక నేరగాళ్ల కు లేని శిక్షలు,ఆక్రందనలు వినేవారికా..!
యావత్‌ ‌భారతదేశ ప్రజలు తెలుసుకునేందుకు ఈ దేశ ప్రజల ఆర్తనాదాలను,ఆక్రందనలను తెలుసుకునేందుకు భారత్‌ ‌జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ ‌వరకు చేశారు.ఈ యాత్ర రాహుల్‌ ‌గాంధీ ని భారతీయ హదయాలలో గూడు కట్టుకునేటట్లు చేసింది.అది అధికార బిజెపి ప్రభుత్వానికి కంఠగింపుగా మారింది.దీనితో ఆ కుటుంబం పై హెరాల్డ్ ‌కేసు విషయంలో ఈడి తదితర సంస్థల ద్వారా బెదిరింపు చర్యలకు పాల్పడుతూ వస్తుంది.రాజ్యాంగ వ్యవస్థ ల విధ్వంసం జరుగుతుంది.ఆర్థిక నేరగాళ్లకు దేశ సంపద చెందుతుందని ప్రజా ఆవేదనతో  నీరవ్‌ ‌మోదీ, లలిత్‌ ‌మోదీ,అమి మోదీ బ్యాంకు లను కొల్లగొట్టి దేశం విడిచి వెళ్లపోయిన సందర్భంలో 2019 ఎన్నికల ప్రచారంలో ‘‘దేశంలో దొంగలందరికి మోదీ అనే  పేరు ఎందుకు ఉంటుంది..? అని రాహుల్‌ ‌గాంధీ అన్నారు.ఈ వ్యాఖ్యలపై పూర్ణేష్‌ ‌మోదీ పరువునష్టం దావా వేశారు.అందుకు అంగీకరించిన సూరత్‌ ‌కోర్టు మోదీ అనే ఇంటి పేరుతో అందరిని అవమానించారని పేర్కొని మార్చి 23 ,2023 న తీర్పు ప్రకటిస్తూ రెండు సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేసింది. అంతటితో ఆగకుండా నేరారోపణ రుజువైందని సాకుగా చూపి రాహుల్‌ ‌గాంధీ పార్లమెంట్‌ ‌సభ్యుడిగా అనర్హుడని లోక్‌ ‌సభ సెక్రటరీ జనరల్‌ ‌పేరు మీద కార్యాలయం నుండి సర్క్యులర్‌ ‌పంపారు.ఇది భారత ప్రజాస్వామ్యం లో చీకటి రోజు.భారతదేశం లో పాలనా భాధ్యతలు చేపట్టిన ఏ పాలకులు ఇంత దారుణంగా వ్యవహరించలేదు.తనకు రుచించని పార్టీలను,వ్యక్తులను అనర్హత వేటు చేసి తన పంధాని నెరవేర్చుకుంటున్నారు. ఈడి,సిబిఐ లాంటి సంస్థల ద్వారా తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

రాజ్యంగం కల్పించిన అవకాశాలను కూడా ఉపయేగించుకోనివ్వరా.?
భారతీయ శిక్షాస్మృతి (ఐ.పి.సి) సెక్షెన్లు 499 మరియు 500 ప్రకారం రాహుల్‌ ‌గాంధీని దోషిగా నిర్ధారించారు,మ. దీనికి గరిష్టంగా రెండు సంవత్సరాల శిక్ష మరియు/లేదా జరిమానా విధించబడుతుంది.అయితే, కోర్టు అతనికి బెయిల్‌ ‌మంజూరు చేసి మరియు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ ‌చేసుకునేందుకు వీలుగా శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్‌ ‌చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102(1)(ఇ) ‌నిబంధనల ప్రకారం రాహుల్‌ ‌గాంధీ దోషిగా తేలిన తేదీ నుంచి ఎంపీగా అనర్హుడని సూరత్‌ ‌కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల తర్వాత లోక్‌సభ సెక్రటేరియట్‌ ‌జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.వాస్తవానికి, రాహుల్‌ ‌గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేయడానికి ముందు దోషిగా నిర్ధారించబడిన తేదీ నుండి మూడు నెలల సమయం ఇవ్వాలి. అంతకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వివరణ పొందాలి. అయితే, 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నిబంధనను పాటించలేదు.కనీసం పై కోర్టు కు అప్పీల్‌ ‌చేసుకోవడానికి రాజ్యంగం,న్యాయ వ్యవస్థ కల్పించిన అవకాశాలు ను కూడా రాహుల్‌ ‌గాంధీ ని సద్వినియోగం చేసుకోనివ్వలేదు.

క్షేత్రస్థాయిలో సుప్రీంకోర్టు తీర్పులు ఏమిటి.?
లిల్లీ థామస్‌ ‌వర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియా (2013) తీర్పు లో  సుప్రీం కోర్ట్ 1951 ‌ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(4)‌ని జతచేర్చినది.దీని ప్రకారం ఎవరైనా శాసన సభ్యులు,పార్లమెంట్‌ ‌సభ్యులు నేరానికి పాల్పడి,కనీసం రెండేళ్ల జైలుశిక్ష విధించబడితే తక్షణమే ఆ సభ సభ్యత్వాన్ని కోల్పోతారని పేర్కొంది.ఆసక్తికరంగా 2013లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న ‘ఆర్డినెన్స్‌ను రాహుల్‌ ‌గాంధీ వ్యతిరేకించారు.ఈ ఆర్డినెన్స్ ‌సిట్టింగ్‌ ఎం‌పీలు మరియు ఎమ్మెల్యేలు కొన్ని నేరాలకు పాల్పడిన సందర్భంలో అనర్హత నుండి అదనపు రక్షణన పొందడం అనేది చట్ట విరుద్దమని ఆ ఆర్డినెన్స్‌పై రాహుల్‌ ‌గాంధీ తన సొంత ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంతో ఆర్డినెన్స్ ‌రద్దు చేయబడింది.
లోక్‌సభలో రాహుల్‌ ‌గాంధి పై వేసిన  అనర్హత వేటు నుండి భయటపడడానికి గల ఏకైక మార్గం ‘సూరత్‌ ‌కోర్టు విధించిన శిక్షపై’ఉన్నత న్యాయస్థానం స్టే విధించడం గాకుండా నేరారోపణపై స్టే విధించాలి.
లోక్‌ ‌ప్రహరీ వర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియాలో 2018లో ఇచ్చిన తీర్పులో , క్రిమినల్‌ ‌ప్రొసీజర్‌ ‌కోడ్‌ (‌సి.ఆర్‌.‌పి.సి) సెక్షన్‌ 389 ‌ప్రకారం శిక్షను నిలిపివేస్తే,సెక్షన్‌ 8 ‌ప్రకారం అనర్హత అమలు చేయబడదని కోర్టు పేర్కొంది.రాహుల్‌ ‌గాంధీ విషయంలో సెక్షన్‌ 8(4)‌లోక్‌ ‌సభ సెక్రటేరియట్‌ ‌పట్టించుకోనట్లు స్పష్టమవుతుంది.
‘‘అనుకూలమైన లేదా పనికిమాలిన కారణాలపై నేరారోపణ తీవ్రమైన పక్షపాతం కలిగించేలా పనిచేయోద్దని నిర్ధారిస్తుంది’’ అని అప్పటి సి.జె.ఐ దీపక్‌ ‌మిశ్రా, న్యాయమూర్తులు ఏ.ఎం. ఖాన్విల్కర్‌ ,‌డి.వై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

అనర్హత వేటుపడ్డవారు కోర్ట్ ‌కు పోయిన సందర్భాలు  ఉన్నాయా.!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో నాలుగేళ్ల శిక్షతోపాటు జరిమానా కూడా పడింది. దాంతో ఆమె పై అనర్హత వేటు వేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆమె ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవాలిసి వచ్చింది. తదనంతరం 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి నిర్దోషిగా ప్రకటించింది. మళ్లీ ఆమె ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం జరిగింది.
ఈ ఏడాది జనవరిలో, రాజకీయ ప్రత్యర్థిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో లక్షద్వీప్‌ ఎం‌పీ మహ్మద్‌ ‌ఫైజల్‌ ‌ని దోషిగా తేల్చింది.లోక్‌సభ సెక్రటేరియట్‌ ‌ద్వారా సదరు ఎంపీపై అనర్హత వేటు పడింది.అతను అప్పీల్‌ ‌కు పోగా విధించిన శిక్షను కేరళ హైకోర్టు స్టే విధించడంతో అతని సభ్యత్వం పునరుద్దరించాలని న్యాయశాఖ లోక్‌ ‌సభ సెక్రటరీ కి సిఫార్సు చేసింది.ఇదే తరహలో రాహుల్‌ ‌గాంధీకి ఉపశమనం దొరికే అవకాశం లేకపోలేదు.

ప్రశ్నించేవారి పై ఉక్కుపాదమా..!
అత్యున్నత వ్యవస్థ గా పిలువబడిన పార్లమెంట్‌ ‌మోదీ కాలంలో చర్చలు, కమిటీ లు లేకుండా తమకు నచ్చిన పద్దతుల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ చట్టాలను చేస్తున్నారు.వివిధ సందర్భాలలో అధికార,ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యే లు 360 మందికి  పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఏ.డి.ఆర్‌ (అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌డెమోక్రటిక్‌ ‌రిఫార్మస్)అనే ఎన్‌.‌జి.ఓ తన నివేదికలో తెలిపింది.ఇందులో బిజెపి ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది.బిజెపి ఎంపిలు,ఎమ్మెల్యే లు బహిరంగంగా ఇతర మతాలను కించె పరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై, హత్యా, నేర చరిత్ర తమకు ఉన్నదని స్వయంగా ప్రకటించిన వారిపై,ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పన్ను ఎగవేత దారులకు, ఆర్ధిక నేర గాళ్ళ పైన చర్యలు తీసుకోకపోగా వారికి రక్షణ చర్యలు కల్పిస్తుంది.

’మదర్‌ ఆఫ్‌ ‌డెమోక్రసీ’పేరు మీద అంతర్జాతీయ వేదికలపై మానవ హక్కులు,వాక్‌ ‌స్వాతంత్య్రం, మతం మరియు ప్రజాస్వామ్య సూత్రాలపై భారత దేశం ఆధారపడి ఉందని అంటారు..కాని ఈ దేశంలో మానవ హక్కుల హననం, మత విద్వేషాలు, ఆదివాసీ, దళిత, మైనారిటీ, మహిళపై దాడులు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, వాక్‌ ‌స్వాతంత్రం పై దాడి, రాష్ట్రాల హక్కుల ను హరించి వేయడం, గవర్నర్‌ ‌ల జోక్యం వంటి అంశాలు మదర్‌ ఆఫ్‌ ‌డెమోక్రసీకి నిదర్శనాలా..! బలమైన ప్రజాస్వామ్యం కోసం తాము నిలబడతామని ప్రశ్నించే వారిపై మోదీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది.ప్రశ్నించలేని అధికారానికి బలమైన కేంద్ర ప్రభుత్వానికి మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.మోదీతో విభేదించే మరియు విమర్శించే వారిని శిక్షించడం సరైనది భావిస్తున్నది కనుకనే రాహుల్‌పై ఆ చర్యను తీసుకుంది.తను కలలు గన్న భారతదేశం కోసం (చక్రవర్తి,రాజు మోదీ)అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు.కావున ప్రమాదం అంచున ఉన్న భారతదేశాన్ని, పార్లమెంటరీ వ్యవస్థ ను కాపాడాలంటే అన్ని విపక్షాలు, ప్రజాసంఘాలు, పౌరసమాజం, మహిళలు, విద్యార్థులు అన్ని రంగాల నిపుణులు ముక్త కంఠంతో ఒక్కటై మోదీ ఫాసిస్టు పాలన నుండి విముక్తి కోసం పాటుపడాలని కోరుకుంటున్నాము.

పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment