అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌

‌కొచ్చి, సెప్టెంబర్‌ 2 : అభివృద్ధి చెందిన దేశం దిశగా మరో ముందడుగు పడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోనే డిజైన్‌ ‌చేసి, నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇలాంటి నౌకలను అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే నిర్మిస్తూ ఉండేవన్నారు. కొచ్చిన్‌ ‌షిప్‌యార్డు లిమిటెడ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మోదీ ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించారు. ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో రూపొందించిన కొత్త నావికా దళ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి చెందిన దేశం దిశగా మరో ముందడుగు పడిందని తెలిపారు. ఇటువంటి విమాన వాహక నౌకలను అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే నిర్మించేవన్నారు. వాటి సరసన చేరడం ద్వారా భారత దేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి మరో ముందడుగు వేసిందని చెప్పారు. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌కేవలం యుద్ధ యంత్రం కాదన్నారు. భారత దేశ నైపుణ్యం, ప్రతిభలకు ఇది నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. ఇది చాలా ప్రత్యేకమైనదన్నారు. ఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను రూ.20,000 కోట్లతో నిర్మించారు. ఈ నౌక నుంచి విమానాలు బయల్దేరడానికి 262 వి•టర్ల పొడవు, 62.4 వి•టర్ల వెడల్పుగల ప్లయింగ్‌ ‌డెక్‌ ఉం‌ది.

మన దేశంలోని ప్రధాన పరిశ్రమలు, 100 ఎంఎస్‌ఎంఈలు సరఫరా చేసిన మెషినరీతో ఈ నౌకను నిర్మించారు. దీంతో అమెరికా, రష్యా, బ్రిటన్‌, ‌చైనా, ఫ్రాన్స్ ‌సరసన భారత దేశం కూడా చేరింది. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్‌ ‌సోనోవాల్‌, ‌కేరళ గవర్నర్‌ అరిఫ్‌ ‌మహమ్మద్‌ ‌ఖాన్‌, ‌ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌పాల్గొన్నారు. స్వదేశీయంగా తయారైన ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌భారతీయ నౌకాదళంలోకి చేరింది. ప్రధాని చేతుల వి•దుగా ఆ యుద్ధ నౌకను జలప్రవేశం చేయించారు. భారతీయ నౌకాదళ చరిత్రలో గతంలో ఇంత పెద్ద యుద్ధ నౌకను స్వదేశీయంగా తయారు చేయలేదు. యుద్ధ విమానాలను మోసుకెళ్లే ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను నౌకాదళంలోకి చేర్చుతున్న సందర్భంగా కొచ్చిన్‌ ‌షిప్‌యార్డులో గ్రాండ్‌ ‌సెర్మనీ నిర్వహించారు. 45వేల టన్నుల యుద్ధ విమానాన్ని సుమారు 20 వేల కోట్ల ఖర్చుతో నిర్మించారు. విక్రాంత్‌ ‌చాలా పెద్ద సైజ్‌లో ఉందని, చాలా గ్రాండ్‌గా ఉందని, చాలా విశిష్టమైందని, ఓ ప్రత్యేకమైందని ప్రధాని మోదీ అన్నారు. విక్రాంత్‌ ‌కేవలం యుద్ధనౌక కాదు అని, హార్డ్‌వర్క్, ‌ట్యాలెంట్‌కు ఇది నిదర్శనమని ఆయన అన్నారు.

మారిటైమ్‌ ‌జోన్‌ను ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌రక్షిస్తుందని, నేవీలో ఉన్న మహిళ సైనికులు ఆ విధుల్లో చేరుతారని, అపరిమితమైన సముద్ర శక్తి, హద్దులు లేని మహిళా శక్తి.. కొత్త ఇండియాకు ఐడెంటిటీగా మారుతుందని ప్రధాని అన్నారు. ఇదిలావుంటే దేశీయంగా తయారైన తొలి ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌యుద్ధనౌక నౌకా దళంలోకి చేరిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ ‌పార్టీ తప్పుపట్టింది. 1999 నుంచి పలు ప్రభుత్వాల సమిష్టి ప్రయత్నాలతోనే ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌నౌకాదళంలోకి తీసుకురాగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారా అని కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి జైరామ్‌ ‌రమేష్‌ ‌ప్రశ్నించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌నేడు నౌకా దళంలోకి ప్రవేశించడం 1999 నుంచి పలు ప్రభుత్వాలు సాగించిన సమష్టి కృషికి ఫలితం కాదా అని ఆయన ప్రధాని మోదీని నిలదీశారు. 1971 యుద్ధంలో భారత్‌కు ఎంతో ఉపయోగపడిన అసలైన ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను కూడా గుర్తుచేసుకోవాలని అన్నారు. బ్రిటన్‌ ‌నుంచి దానిని తీసుకురావడంలో కృష్ణ వి•నన్‌ ‌కీలక పాత్ర పోషించారని జైరామ్‌ ‌రమేష్‌ ‌ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

India vs developed countriesprajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment