పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోండి…కుప్పంను వీడి ఎక్కడికీ పోయేది లేదు

  • ఓటిఎస్‌ ‌కట్టకండి..టిడిపి వచ్చాక రెగ్యులరైజ్‌ ‌చేస్తా
  • కుప్పం పర్యటనలో చంద్రబాబు వెల్లడి

చిత్తూరు, జనవరి 6 : పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోండి.. ప్రతి పల్లె తిరుగుతా.. అన్ని ప్రక్షాళన చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కుప్పంలో మనం అంతా ఏకం ఐతే పోలీసులు ఏమి చెయ్యగలరని, కుప్పంలో కార్యకర్తల ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటానన్నారు. కుప్పంలో రు వద్దన్న నేతలను, నష్టం చేసే వారిని ఉపేక్షించనన్నారు. నేను నియోజకవర్గం మార్చలా.. ఆ అవసరం ఉందా..? నేను కుప్పానికి ముద్దు బిడ్డను.. కుప్పం వదిలి ఎక్కడికి పోను అని కూడా చంద్రబాబు ప్రకటించారు. అవతలివాళ్లు కుప్పంపై హేళన చేస్తే నాకు బాధకలిగిందని, కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబును సభలో చూడాలని జగన్‌ అన్నాడని ఆయన గుర్తు చేశారు. చివరికి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేసి ఆనందం పొందుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో వైసీపీ తనను ఎంతగానో అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా దేవరాజపురంలో చంద్రబాబు పర్యటించారు. దేవరాజపురంలో భారీ ఎత్తున తరలివచ్చి టీడీపీ శ్రేణులు, అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తా..కార్యకర్తలు, ప్రజలను కలుస్తానని ఆయన తెలిపారు. నేను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించే ఆలోచించానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 2019 నుంచి అరాచక పార్టీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ఇన్ని ఇబ్బందులు, అరాచకాలు ఎప్పుడూ చూడలేదని, అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు.

ప్రజలను జగన్‌రెడ్డి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఓటీఎస్‌ ఎవరూ కట్టొద్దు.. టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దోచుకున్న డబ్బులను ఓటర్లకు వేలకు వేలు పంచి పెట్టారని ఆరోపించారు. టీడీపీ అలా అనుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. సీఎం జగన్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు హెచ్చరించారు. తన కార్యకర్తపై దెబ్బ పడిందంటే అది తనద పడినట్టేనని చంద్రబాబు తెలిపారు. తాను ఎవరినీ వదలి పెట్టానని హెచ్చరించారు. వైసీపీ ఒకింత ఇబ్బందులు పెడితే తాను పదింతలు ఇబ్బందులు పేడతానని తెలిపారు. తాను కుప్పంను సరిచేస్తాను కానీ వదలి పెట్టానని చంద్రబాబు హెచ్చరించారు.

ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా రెండు ఘటనలు కుప్పంలో నన్ను బాధించాయని ఆయన అన్నారు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు నన్ను బాధపెట్టాయని, కుప్పంలో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. వెయ్యి, రెండు వేలు పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ అని, కుప్పంలో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే.మిమ్మల్ని అన్నట్లు కాదా. అని వ్యాఖ్యానించారు. మనం కూడా ప్రలోభాలకు లొంగిపోతే ఎలా..? మనం బాగా పనిచేయాలి.. కుప్పంలో కోవర్ట్ ‌లను పంపేస్తా.. ప్రక్షాళన చేస్తా అని ఆయన అన్నారు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు.. మేము అనుకుంటే ఇంట్లోంచి బయటకు రాలేరని ఆయన మండిపడ్డారు. మళ్ళీ సీఎంగానే శాసనసభకు వెళ్తానని చెప్పాను. సభా గౌరవం కాపాడుతా. ప్రతిపక్షం పట్ల తమిళనాడులో స్టాలిన్‌ ఎం‌త గౌరవంగా ఉన్నారు.. ఇక్కడ జగన్‌ ఎలా ఉన్నాడు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా.. క్యాడర్‌ను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టను అని ఆయన హెచ్చరించారు.

వడబ్బ సొమ్మని ఓటీఎస్‌కు 10 వేలు కట్టమని అడుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు బెదిరిస్తే భయపడకండి. టీడీపీ వచ్చిన తరువాత పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్టేష్రన్‌ ‌చేస్తామని ఆయన హా ఇచ్చారు. నన్ను కూడా బుతులు తిట్టే పరిస్థితికి వచ్చారని, రౌడీయిజం చెయ్యడం ఒక్క నిమిషం పని. కానీ అది మన విధానం కాదని ఆయన అన్నారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నా అందరి లెక్కలు తేల్చుతామని ఆయన వార్నింగ్‌ ఇచ్చారు.

bjpCongresslatest newspm modiprajatantra newspaperpresent issuestelugu articlestrs party
Comments (0)
Add Comment