అవసరమైతే కొత్త పార్టీ పెడతా ..రాజగోపాల్ రెడ్డి

టీఆరెస్ పై పోరాడటానికి  నేను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సమయం వచ్చినప్పుడు నేనే కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా మారుతనని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలోని మీడియా కార్యాలయం లో మాట్లాడుతూ ….ఢిల్లీ నుంచి పైరవీతొ వచ్చిన వారు నాయకులు కాదని ప్రజల నుండి నాయకుడు పుట్టుకొస్తాడని తెలిపారు.
కేసీఆర్ గద్దె దింపే పనిలో నేనే ముందుంటానని , కాంగ్రెస్ నాయకత్వ లోపాల వల్లనే కేసీఆర్ అధికారంలోకి వచ్చాడని , పార్టీలో మంచివారికి టిక్కెట్లు ఇస్తే పార్టీ గెలిచేదని సొంత పార్టీ పై విమర్శల జల్లు కురిపించారు.రాబోయే రోజుల్లో బీజేపీ నా,మరో కొత్త పార్టీ నా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు.నేను డెబ్భై ఏళ్ల ముసలోన్ని కాదని ఇంకా 20 యేండ్లు రాజకీయాలలో  ఉంటానని తెలిపారు.టీఆరెస్ పార్టీలో చాలా మంది నాయకులు అసంతృప్తి గా ఉన్నారని మేము రెడీ అంటే టిఆర్ఎస్ ఖాళీ అవుతుందని త్వరలో సునామీ వస్తుందన్నారు.అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం విన్న తరువాత చాలా బాధ అనిపించిందని , పాపం ఒక అత్యున్నత స్థాయి మహిళ ద్వారా టీఆరెస్ ప్రభుత్వం అన్ని అబద్దాలు చెప్పించిందని విమర్శించారు .ఈ రోజు కొంతమంది నాయకులు తమ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టారని ఆరోపించారు.ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటాన్ని కూడా కేసీఆర్ ఓర్వలేదని మండిపడ్డారు.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అని కేవలం చింతమడక,గజ్వెల్, సిద్దిపేట,సిరిసిల్లలో నే మరీ గుడిసెలో ఉండేవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
తెలంగాణ లో ఏ మంత్రి ఎక్కడుంటాడో ఎవరికి తెలియని పరిస్థితి ఉందని ఒక మంత్రి బొగ్గులకుంటా ఒక మంత్రి సికింద్రాబాద్, ఇంకో మంత్రి ఎక్కడనో అని ఎద్దేవా చేశారు.
Tags: congress,mla Komatireddy,Rajagopal Reddy,teresa
Congressmla KomatireddyRajagopal Reddyteresa
Comments (0)
Add Comment