ఫేస్‌ అథెంటిఫికేషన్‌ ‌ద్వారా పెన్షనర్ల గుర్తింపు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌ఫేస్‌ ఆథెంటిఫికేషన్‌ ‌టెక్నాలజీ ద్వారా డిసెంబర్‌ 8‌వ తేదీ వరకు సుమారు 3.7 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్‌ ‌సర్టిఫికేట్లను సమర్పించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌తెలిపారు. రాజ్యసభలో ఆయన దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

లైఫ్‌ ‌సర్టిఫికేట్ల సమర్పణ కోసం 2021 నవంబర్‌లో ప్రభుత్వం ఫేస్‌ అథెంటిఫికేషన్‌ ‌టెక్నాలజీని ప్రారంభించిందన్నారు. నిరంతరాయంగా పెన్షన్‌ ‌వచ్చేందుకు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్‌ ‌సర్టిఫికేట్‌ ‌సమర్పించా ల్సిన విషయం తెలిసిందే. ఫేస్‌ ‌టెక్నాలజీ ఆధారంగా ఇప్పటి వరకు 3.7 లక్షల మంది లైఫ్‌ ‌సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

Comments (0)
Add Comment