నా చావుకి కారణమైన వారిని శిక్షించాలి సూసైడ్‌ ‌నోట్‌ ‌లో మృతుడు వెంకటేశ్వర్లు

నా చావుకి కారణమైన వారిని శిక్షించాలి: సూసైడ్‌ ‌నోట్‌ ‌లో మృతుడు వెంకటేశ్వర్లు
కొత్తగూడెం,జూలై 30 (ప్రజాతంత్ర ప్రతినిధి) : పాల్వంచ పట్టణ పరిధిలోని జయమ్మ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలించగా వైద్యం పొందుతూ మృతి చెందాడు.పాల్వంచ పట్టణంలో ఫైనాన్స్ ‌వ్యాపారస్తుడు గా వెంకటేశ్వర్లు కొంత కాలంగా జయమ్మ కాలనీ లొ నివసిస్తున్నాడు. ఆత్మహత్యకు ముందు తను రాసిన సూసైడ్‌ ‌నోట్లో నా చావుకి కారణం పోలీస్‌ అధికారులు మరియు రాజకీయ నాయకులు అంటూ 43 మంది పేర్లను సూసైడ్‌ ‌నోట్లో లో రాయడం జరిగింది. చిట్టిల వ్యవహారంలో తనపై ఒత్తిడి తెచ్చారని,తన ఇంటిపై దాడి చేశారని, తనపై హత్య యత్నం చేసినకి పోలీసులు మరియు రాజకీయ నాయకులు సహకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

నా చావుకు కారణమైన అందరినీ కఠినంగా శిక్షించి తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. గత కొంత కాలంగా చిట్టీల వ్యవహారంలో తనకు సదరు సభ్యుడు చిట్టి డబ్బులు నిమిత్తము 50 లక్షలు గల భూమిని తన పేరిట రాసిచ్చారా అని ఆ నేపథ్యంలో మరలా తిరిగి ఆ భూమిని ఇవ్వమంటూ వనమా రాఘవేంద్ర రావుకి 25 లక్షలు ముట్ట చెప్పినట్టు సూసైడ్‌ ‌నోట్లో మృతుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాజకీయ నాయకులు మరియు పోలీసుల వల్ల కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నారని తన మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని సూసైడ్‌ ‌నోట్లో పేర్కొనడం జరిగింది.

political updatesprajatantra news onlinesuicide notetelangana updatestelugu news todayVenkateshwar died
Comments (0)
Add Comment