రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనున్న హుజురాబాద్‌ ఉపఎన్నికలు

హుజురాబాద్‌ ఉపఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది. కోట్లాది మంది అత్యంత ఆసక్తిగా ఈ ఎన్నికల వైపు చూస్తున్నారు. మొదటి తెలంగాణ క్యాబినెట్‌లో నెంబరు 2గా చలామణి అయిన ఈటల రాజేందర్‌ ‌రెండవ క్యాబినెట్‌ ‌వచ్చేటప్పటికి ప్రాధాన్యత లేని వ్యక్తిగా మిగిలి పోయారు. రెండవ సారి చివరి క్షణంలో మంత్రి పదవి లభించింది. మే 1న భూకబ్జా ఆరోపణలపై క్యాబినెట్‌ ‌నుండి భర్తరఫ్‌ ‌చేయడం ఆ తర్వాత కొన్ని రోజులకు పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. అంతకంటే కొన్ని నెలల ముందు నుంచే ఈటల అధిస్టానంతో ఉప్పు-నిప్పుగా ఉండడంతో ఆయన కొత్తగా పార్టీని స్థాపిస్తారని, ప్రచారం జరిగింది. ఆయన వ్యవహార శైలి కూడా అలానే కనిపించింది. పొమ్మనలేక పొగపెడుతున్నారని ఏదో ఒక రోజు ఉద్వాసనకు గురవుతానని ఊహించిన ఆయన అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లలో మునిగిపోయి ఉన్నారు. అనేక రకాల మేధోమదనాలు చేశారు.

హుజురాబాద్‌ ఉపఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది. కోట్లాది మంది అత్యంత ఆసక్తిగా ఈ ఎన్నికల వైపు చూస్తున్నారు. మొదటి తెలంగాణ క్యాబినెట్‌లో నెంబరు 2గా చలామణి అయిన ఈటల రాజేందర్‌ ‌రెండవ క్యాబినెట్‌ ‌వచ్చేటప్పటికి ప్రాధాన్యత లేని వ్యక్తిగా మిగిలి పోయారు. రెండవ సారి చివరి క్షణంలో మంత్రి పదవి లభించింది. మే 1న భూకబ్జా ఆరోపణలపై క్యాబినెట్‌ ‌నుండి భర్తరఫ్‌ ‌చేయడం ఆ తర్వాత కొన్ని రోజులకు పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. అంతకంటే కొన్ని నెలల ముందు నుంచే ఈటల అధిస్టానంతో ఉప్పు-నిప్పుగా ఉండడంతో ఆయన కొత్తగా పార్టీని స్థాపిస్తారని, ప్రచారం జరిగింది.

ఆయన వ్యవహార శైలి కూడా అలానే కనిపించింది. పొమ్మనలేక పొగపెడుతున్నారని ఏదో ఒక రోజు ఉద్వాసనకు గురవుతానని ఊహించిన ఆయన అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లలో మునిగిపోయి ఉన్నారు. అనేక రకాల మేధోమదనాలు చేశారు.
కె.సి.ఆర్‌ ఒక్క సారిగా విరుచుకుపడడంతో బీతిచెందిన ఆయన అంతకు ముందు అనుకున్న కార్యచరణ పక్కన పెట్టి ప్రతిపక్షపార్టీల నాయకుల మద్దతుకోసం తిరిగారు. వారు అందరు కూడా ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అయితే ముట్టెట దాడి నుండి బయట పడడానికి ఆయనకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కనిపించింది.

పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసిన తర్వాత తామే స్వయంగా రాజకీయపార్టీ స్థాపించి, తెరాస అసంతృప్తి వాదులను, ఉద్యమకారులను, ఏకం చేస్తారని భావించిన వేలాది మంది అంచనాలు తలక్రిందులై పోయాయి. భాజపాలో చేరికకు మహూర్తం పెట్టుకున్న తర్వాత ఈటలను కలిసిన ప్రో।।కోదండరాం, మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర్‌రెడ్డిలు ఇంకా కొన్ని రోజులు ఏ పార్టీలో చేరకుండా ఉండమని ఎంతగానో చెప్పారు. తాను అరెస్టు కాకుండా ఉండడానికి, ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే భాజపాలో చేరాడని, బి.సి సంఘాలు తీవ్రంగా విమర్శించాయి.ఈటల రాజీనామ కంటె ముందే నష్టనివారణ కొరకు తెరాస మంత్రులను, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జులుగా నియమించి తన శ్రేణులను కాపాడుకునే ప్రయత్నాలు మ్మురం చేసింది. తెరాసా ప్రజాప్రతినిధులను కట్టడి చేసే పనిలోఉండగా అవేవి పట్టించుకోకుండా ఆయన ప్రజల్లోకి వెల్లడం జరిగింది. ఇదే అంశం ఈటలకు బాగా కలిసివచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 2004 నుండి ఇప్పటి వరకు ఈటల ఏనాడు కూడా ద్వితియశ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించలేదు. అధికారుల జోలికి ఏనాడు పోలేదు. అన్ని శాఖల అధికారులు అమ్యామ్యాలు దండుకుంటున్నారని ప్రజలు ఎంతగా మొత్తుకున్నా అయన వారిని కట్టడి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో విసిగి పోయిన ప్రజలు ఈ నియోజకవర్గంలోని జమ్మికుంట, హుజురాబాద్‌, ఇల్లందకుంట, రెవెన్యూ అధికారులను నేరుగా ఎ.సి.బికి పట్టించారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని కూడా చూడకుండా అందరిని చేరదీయడం ఆపతికి సాపతికి అక్కరకు రావడం ఈ 17 ఏండ్లలో ఆయన నుండి ఆర్థికంగా సమాయం పొందిన వాళ్ళు దాదాపు 10వేల మంది వరకు ఉంటారని అంచనా.

తమ శ్రేణులను తమవైపు పూర్తిగా తిప్పుకున్న తెరాసా, కాంగ్రెస్‌, ‌బీజేపీ, నాయకులవైపు దృష్టిసారించి తమవైపుతిప్పుకునే పరపర ఇప్పటికి కొనసాగిస్తున్నారు. ఈ పోరు తేరాసా అభ్యర్థి విద్యార్థి ఉద్యమనాయకుడు గెల్లు శ్రీనివాస్‌ ‌బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ల మధ్య కాకుండా కెసిఆర్‌ -‌త ఈటల మధ్య పోరుగా ప్రాచుర్యం పొందింది. అందుకే ఈ ఉప ఎన్నిక వైపు అందరు చూస్తున్నారు. ఈ ఉదంతం తర్వాత కెసిఆర్‌ ‌గ్రాఫ్‌ ‌తగ్గిందని నేషనల్‌ ‌సర్వేలు కూడా చెబుతున్నాయి. నియోజకవర్గంలో పేరుకు పోయిన పెండింగ్‌లో ఉన్న వందలాది పనులను చేసి ఇంకా చేస్తున్న జమ్మికుంట హుజురాబాద్‌ ‌పట్టణాలను కలిపి అర్భన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారటీ చేస్తామన్న ప్రచారం ఈ రెండు పట్టణాల మధ్య మెడికల్‌ ‌కాలేజి ఏర్పాటు చేస్తామన్న ప్రచారం కూడా టిఆర్‌ ఎస్‌ ‌శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెల్లాల్సినంతగా  తీసుకుపోలేదనే చెప్పాలి.

జమ్మికుంటకు గుదిబండగా తయారైన ప్లైఓవర్‌ ‌బ్రిడ్జి తీసివేత అంశం కూడా అంతగా ప్రాచుర్యం పొందలేదు. దళితబంధు గట్టెక్కిస్తుందా పాతాళంలో పడేస్తుందా అనే అనుమానం కూడా ఉన్నది. మేము ఇన్ని వందల కోట్లు వెచ్చించి ఇన్ని చేసినా మాకు రావాల్సినంత మైలేజి ఇంకా రాలేదని గెలుపు ధీమా కూడా అంతంత మాత్రంగానే ఉందని తాము ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నామని చెబుతూ ధీటుగా ఎదుర్కొంటున్న ఈటల ప్రచారానికి ఆశ్చర్యాం వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉండగా నామినేషన్‌ ‌గడువు ముగిసే సమయానికి వచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి బలుమారి వెంకట్‌ ‌నామమాత్రంగా మిగిలిపోవల్సిన పరిస్థితి ఎర్పడ్డది. గత సార్వాత్రిక ఎన్నికల్లో 64 వేల వోట్లు సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి  టిఆర్‌ఎస్‌ ‌ప్రలోభాలకు గురి కాకుండా ఉండి ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనడంలో సందేహం లేదు.  పిసిసి చీప్‌ ‌రేవంతరెడ్డి ఈటలను వెనుకేసుక రాకుండా ఆయన గురించి మాట్లాడకుండా కౌశిక్‌రెడ్డినే అభ్యర్థిగా నిలిపి ఉంటే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తమ సత్తా చాటుకునే అవకాశం ఉండేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్న ఈ తరుణంలో వచ్చిన సువర్ణ అవకాశాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ చేజేతులా జారవిడుచుకున్నట్లైయిందని ఆ పార్టీ సభలు సమావేశాలకు వస్తున్న స్పంద•న బట్టి చూస్తే అనిపిస్తున్నది.

ఆ 72 గంటలే కీలకం ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం ఎన్నికలు జరిగే 72 గంటల ముందు నియోజకవర్గంలో స్థానికేతరులైన బయటి నుంచి వచ్చిన అన్ని రాజకీయపార్టీల నాయకులు ఉండ కూడదు. ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల 30న ఈ నియోజకవర్గ ఎన్నికలు జరుగుతాయి. అధికార పార్టీ, బిజెపి హోరాహోరిగా సభలు సమావేశాలు రోడ్‌షోలు, నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెల్తుతండగా ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్‌ ‌తన పార్టీ స్టార్‌ ‌కాంపేనర్‌లను దించి ఆ రెండు పార్టీలకు తీసిపోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నది.

అధికారపార్టీ తరపున మంత్రి హరీష్‌రావు నాయకత్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ అగ్ర నాయకులు అనేక మంది పాల్గొంటుండగా బిజెపి పార్టీ యంత్రాంగంతోపాటు ఈటల అభిమానులు వేలాది మంది ఇక్కడ తిష్టవేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావులు కూడా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఆ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మాజి మంత్రులు ప్రస్థుత ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. ఇలా అన్ని పార్టీల నాయకులు ఈ నెల 27న వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇన్ని రోజుల ప్రచారం ఒక లెక్క ఆ 72గంటలు ఒక లెక్కగా మారింది. రాజకీయ విశ్లేషకులు అందరు ఆ 72 గంటలలో జరిగే పరిణామాలను అంచనా వేస్తున్నారు. ఆయా పార్టీల నాయకులు డబ్బు మద్యం పంపిణీ•పై ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఆ 72 గంటలకు ఆంత ప్రాధాన్యత ఏర్పడ్డది. ఇప్పటి వరకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీని ఎదుర్కొంటూ మొక్కవోని ధైర్యంతో ఉన్న బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆ 72‌గంటలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాననే సంకేతాలను తన అనుచర గణానికి పంపినట్టుగా తెలుస్తున్నది.
– పబ్బు శ్రీనివాస్‌,
‌సీనియర్‌ ‌జర్నలిస్టు.

Comments (0)
Add Comment