మానవ హక్కులు విశ్వజనీనం

ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబరు 10న విశ్వమానవ హక్కుల ప్రకటన చేసినన్దువల్ల డిసెంబర్‌ 10‌వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా జరుపుకొంటున్నాం. మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులను తక్షణ పరిష్కారంకోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటైనాయి. ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ‘విశ్వ మానవ హక్కుల తీర్మానం’ భారత రాజ్యాంగ రచయితల్లో స్ఫూర్తి నింపింది. వివక్షత లేని మానవ సమాజ నిర్మాణమే అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం.

మానవ హక్కులు అంటే ఎలాంటి వివక్ష, అసమానత, వ్యత్యాసం లేకుండా, సమానత్వంతో ప్రతి వ్యక్తికీ శాశ్వతంగా ఉన్నతమైన గౌరవాన్ని కల్పించడం. 1789 లో రుపొందించిన ‘‘ద డిక్లరేషన్‌ ఆఫ్‌ ‌ద రైట్స్ ఆఫ్‌ ‌మ్యాన్‌ అం‌డ్‌ ‌ద సిటిజన్‌’’ ‌ప్రేరణతో 1948 లో మరోసారి రూపొందించారు. కెనడాకి చెందిన జాన్‌ ‌పీటర్స్ ‌హంఫ్రీ ఈ బిల్లును స్వదస్తూరితో రాశారు. ఫ్రాన్స్ ‌కి చెందిన రెనే క్యాస్సినే తుది మెరుగులు దిద్దారు. పారిస్‌ ‌లో 1948 డిసెంబర్‌ 10 ‌న జరిగిన ఐక్యరాజ్య సమితి మూడో జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఆమోదం పొందింది. 1947 – 48 లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి కమిషన్‌ ‌సమావేశానికి భారత్‌ ‌తరపున మహిళా ప్రతినిధి హంస మెహతా హాజరయ్యారు. భారత్‌ ‌లోనూ, విదేశాల్లోనూ మహిళల హక్కుల కోసం ఆమె పోరాడారు. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన రూపకల్పనలోనూ ఆమె పాలుపంచుకున్నారు. రెండు ప్రపంచ యుద్ధాలతో అపార నష్టం జరిగింది. ఆఫ్రికా దేశాల నుంచి ప్రజలను బానిసలుగా ఎగుమతి చేయడం, మహిళలపై అరాచకాలు, పిల్లలను బానిసలుగా, బాల కార్మికులుగా ఉపయోగించడం, నిర్దిష్ట జాతి లేదా మతానికి చెందిన వారిని చిన్నచూపు చూడడం, వర్ణ విచక్షణ వంటి విషయాలు ప్రపంచ దేశాలను కలవర పరచాయి. 1944లో వాషింగ్టన్‌ ‌లోని జార్జిటౌన్‌లో అగ్రదేశాల ప్రతినిధులు సమావేశమై ఇలాంటి చర్యలు అరికట్టకపోతే ప్రపంచ వినాశనం తప్పదని హెచ్చరించిన ఫలితంగా ఐక్యరాజ్య సమితి ఉద్భవించింది.

పెద్ద, చిన్న దేశాలన్న తారతమ్యం లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలని మానవ హక్కుల కమిషన్‌ ‌హాజరైనఏర్పాటైంది. 1946 ఏప్రిల్‌ ‌లో ఎలోనార్‌ ‌రూజ్వెల్డ్ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో తాత్కాలిక బృందం ఏర్పాటై మానవ హక్కుల అంతర్జాతీయ బిల్లు సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని సూచించింది. 1947 జనవరిలో 18 మంది సభ్యులు గల నూతన మానవ హక్కుల కమిషన్‌ ‌మొదటిసారిగా సమావేశమై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను పరిశీలించింది. మానవ హక్కుల అభివృద్ధికి తోడ్పడే అంతర్జాతీయ బిల్లు కోసం ముసాయిదా రూపకల్పనను ప్రారంభించింది.

భారత రాజ్యాంగంలో సమగ్రంగా సమసమాజ స్థాపన లక్ష్యంగా మానవ హక్కుల ప్రస్తావన జరిగింది. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మానవ హక్కుల ప్రకటనను యధాతథంగా అంగీకరిస్తూ భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మానవ హక్కుల ఒప్పందాలపై సంతకం చేసింది. చరిత్ర పరిశీలిస్తే సామాన్య జనుల ప్రాథమిక హక్కులు నిరంతరం అణచివేతకు గురవురునే ఉన్నాయి జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఏవిధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు, చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు, స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాల్లో పర్యటించే హక్కుబీ సురక్షిత ప్రాంతంలో ఒంటరిగా జీవించే హక్కు, వెట్టిచాకిరీ, బానిసత్వం దురాచాలు, ఇతర ఇబ్బందుల నుండి రక్షణ పొందే హక్కులను మానవ హక్కులుగా పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన మానవ హక్కులు, పౌరహక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ హక్కులు అందరికి సమానంగా వర్తించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
– జాజుల దినేష్‌, 9666238266
ఎంఏ. (‌బీఈడీ) సెట్‌,ఉస్మానియా విశ్వవిద్యాలయం

Comments (0)
Add Comment