ఉక్కు సంరక్షణ లక్ష్యంగా …
నిరసన జెండా ఎత్తండోయ్
హక్కుల పరిరక్షణ ధ్యేయంగా…
సమర శంఖం పూరించండోయ్
జన ప్రభనజమై హోరెత్థండోయ్
ఉక్కు
అమర వీరుల ఆత్మార్పణం
కార్మిక యోధుల రక్తతర్పణం
దయామధుల భూసమర్పణం
పోరాట యోధుల త్యాగధనం
ఆంధ్ర పుత్రుల పరాక్రమ ఫలం
అంబానీ ,ఆదానీలకు అమ్మజుస్తే
సహించేది లేదంటూ తెగేసి చెప్తూ
ఆత్మ గౌరవ పోరుకు తరలండోయ్
పార్టీలు జెండాలు పక్కనెట్టి
ఇజాలు నైజాలు పాతర పెట్టి
కలతలు, కలహాలు కట్టిపెట్టి
ఇజాలు నైజాలు పాతర పెట్టి
ప్రాంత విభేదాలు విడిచిపెట్టి
తెలుగు జాతి ఐక్యంకండోయ్
ధర్మ పోరుకు సత్తువకండోయ్
నేతల చీకటి కుట్రల చీల్చగ
ఢిల్లీ పీఠాలు బీటలువార్చగ
నిరంకుశ పాలన కడతేర్చగ
దోపిడీ రాజ్యం కుప్పకూల్చగ
ఉక్కు పరిశ్రమ పరిరక్షించగా
జాతి జాతిగా ఏకంకండోయ్
చారిత్రక పోరుకు కదలండోయ్
తెలుగు పౌరుషం చాటండోయ్
(విశాఖ ఉక్కు పరిరక్షణోద్యమానికి మద్దతుగా)
కోడిగూటి తిరుపతి,9573929493