ఎపిలో కరోనా విలయతాండవం

కరోనాతో సచివాలయుద్యోగి మృతి
కృష్ణా జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత
అమరావతి, మే 27 : ఏపీ సచివాలయంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్‌ ‌బారిన ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో సచివాలయ ఉద్యోగి కరోనాతో మృతి చెందాడు. మున్సిపల్‌ ‌శాఖలో ఏఎస్‌వోగా విధులు నిర్వహిస్తున్న బి.శంకరప్ప కరోనా వైరస్‌ ‌సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలులో విషాదం చోటు చేసుకుంది.

కరోనాతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వారం వ్యవధిలో మృత్యువాతపడ్డారు. భార్యాభర్త, కుమారుడు, కరోనాకు బలి అయ్యారు. భర్త సుబ్బారావు బాపులపాడు ఎంపీడీవో కార్యాలయంలో, రామన్నగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో అటెండర్‌గా చేసి రిటైరయ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇకపోతే తిరుమలలో కరోనా వైరస్‌ ‌కారణంగా భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. బుధవారం శ్రీవారిని 8,984 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 28 లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 2,933 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments (0)
Add Comment